పార్వతీపురం:బయోడీజిల్ మొక్కలు పెంచితే వాటి ద్వారా అధికాదాయం పొం దొచ్చని గిరిజనులకు మాయమాటలు చెప్పిన ఓ ప్రబుద్ధుడు, వారిని నిండా ముంచాడు. మెట్ట, పోడు భూముల్లో బయో డీజిల్ మొక్కలు వేస్తే మొక్కలతోపాటు వాటిని కాపాడేందుకు కూలి డబ్బులు కూడా ఇస్తానని చెప్పి నమ్మబలికిన ఆ ఘనుడు పార్వతీపురం యూనియన్ బ్యాంకు నుంచి ఒక్కొక్కరికీ రూ.2 వేల నుంచి 4వేల వరకూ ఇప్పించా డు. అయితే పంట చేతికొచ్చే సమయానికి కంపెనీ ఎత్తేశారని, పంట కొనలేమని చెప్పి తప్పుకున్నాడు. దీంతో చేసేది లేక బయో డీజిల్ పంట ను ఏమి చేసుకోవాలో తెలియక ఆయా గిరిజనులు ఆ మొక్కలను తీసిపారేశారు. అక్కడవరకు బాగానే ఉంది. అయితే ఇటీవల సంబంధిత బ్యాంకు నుంచి రూ.50 వేల బకాయి చెల్లించాలంటూ నోటీసులొచ్చాయి.
దీంతో తమకు తెలియకుండానే బ్యాంకులో అప్పులెలా ఉన్నాయంటూ పార్వతీపురం మండలంలోని గంజిగెడ్డ, కొయిమెట్టవలస, డెప్పివలస, మునక్కాయ వలస తదితర గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించి ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు అందించిన వివరాలిలా ఉన్నాయి...2008లో ఒడిశాకు చెందిన చందు అనే ఒక వ్యక్తి గంజిగెడ్డ, కొయిమెట్టవలస, డెప్పివలస, మునక్కాయవలస తదితర గ్రామాలకు వెళ్లి బయోడీజిల్ మొక్కలు పెంచమని కోరాడు. ఆయా గ్రామాలవారు మొదట అంగీకరించలేదు. అయితే ఈ మొక్కలు పెంచడంవల్ల అధిక లాభాలు వస్తాయని, కాసిన పిక్కలను తామే అధికరేటుకు కొం టామని, మొక్కలతో పాటు పెంపకానికి తామే డబ్బులిస్తామని చెప్పి అప్పట్లో ఒక్కొక్కరికీ రూ. 2 నుంచి రూ. 4వేలు వరకు ఇచ్చాడు.
అయితే 2012లో కాపుకొచ్చాక వాటికొనుగోలుకు మధు ముందుకు రాలేదని గిరిజనులు తెలిపారు. ఈ విషయమై నిలదీస్తే కంపె నీ ఎత్తేశారని, తాము కొనలేమని తప్పించుకున్నాడన్నారు. చేసేదిలేక తాము ఆ పంటను తొలగించామన్నారు. అయితే ఒక్కొక్కరూ రూ. 50 వేల చొప్పున బకాయి ఉన్నారని, ఆ సొమ్మును వెంటనే చెల్లించాలని పార్వతీపురం యూనియన్ బాం్యక్ నుంచి ఇటీవల నోటీసులు వచ్చాయని వారు వాపోయారు. కూలి ప నులు చేసుకుంటూ బతుకుతున్న తాము వేల కొలది అప్పులెలా తీరుస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హుద్‌హుద్ తుపానుకు నష్టపోయిన పంటకు వచ్చిన పరిహారాన్ని కూడా యూనియన్ బ్యాంకు అప్పుందంటూ జమచేసుకుందని గిరిజనులు తెలిపా రు.
క్రిమినల్ కేసులు పెట్టండి... ఐటీడీఏ పీఓ
ఈ విషయమై సోమవారం ఐటీడీఏ పీఓ శ్రీకేశ్ బి. ల ఠ్కర్‌వద్ద ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు మొ రపెట్టుకున్నారు. దీనికి స్పందించి పీఓ శ్రీకేశ్ దీనిపై విచారణ చేయాలని ఐకేపీ ఏపీడీ మురళీధర్‌ను విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కేసులు పెట్టాలని సూచించారు.
రూ. 4వేలు ఇచ్చారు..
మొక్కల పెంపకానికి అంటూ అప్పట్లో యూనియన్ బ్యాంకు వద్ద ఏవేవో సంతకాలు తీసుకొని రూ. 4వేలు ఇచ్చారు. ఇప్పుడు అదే బ్యాంకునుంచి రూ. 50వేలు అప్పు తీర్చాలంటూ నోటీసులు వచ్చాయి.
-మండంగి కుమార్, కొయ్యిమెట్టవలస
రూ. 50వేలు ఎలా తీర్చాలి..
రోజూ కూలి చేసుకొనే మేము రూ. 50వేల అప్పు ఎ లా తీర్చాలి. ఇటు బయోడీజిల్ పంటవేసి నష్టపోగా, ఇప్పుడు అప్పుల పాలయ్యాము. బ్యాంకు నుంచి నోటీసులు వచ్చేసరికి అంతా భయపడిపోయాము.
- మండంగి మాకిరి, కొయ్యిమెట్టవలస
హుద్‌హుద్ నష్టపరిహారాన్ని జమచేసుకున్నారు.
హుద్‌హుద్ తుపానుకు జొన్నపంట నష్టపోగా రూ. 4,900లు పరిహారం వచ్చింది. నేను బ్యాంకుకు బాకీ ఉన్నానని ఆ మొత్తాన్ని బ్యాంకు సిబ్బంది జమచేసుకున్నారు. నా గతమేంకాను
- మెల్లిక సరుగు, కొయ్యిమెట్టవలస
ఆశచూపి... అప్పుల్లో ముంచాడు !
Published Tue, Mar 17 2015 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM
Advertisement
Advertisement