
హైదరాబాద్: యూనియన్ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఆంధ్రా బ్యాంక్ వెల్లడించింది. యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌తో పాటు కార్పొరేషన్ బ్యాంక్ కూడా విలీనమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ రెండు బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి ఇటీవలనే యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ కూడా ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment