![Union Bank in sale of 8 NPA accounts - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/25/union-bank-npa.jpg.webp?itok=bLL-1uKx)
న్యూఢిల్లీ: బ్యాడ్ బ్యాంక్ ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు విక్రయించేందుకు రూ. 3,000 కోట్ల విలువ చేసే 8 మొండి పద్దులను (ఎన్‌పీఏ) గుర్తించినట్లు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 900 కోట్ల విలువ చేసే మూడు ఖాతాలను విక్రయించినట్లు తెలిపింది.
తాజాగా దాదాపు రూ. 10,000 కోట్ల బాకీలు ఉన్న మొత్తం 42 సమస్యాత్మక ఖాతాలను గుర్తించినట్లు బ్యాంకు సీఈవో ఎ మణిమేఖలై తెలిపారు. వీటిలో కనీసం ఎనిమిది ఖాతాలను ఈ ఆర్థిక సంవత్సరం విక్రయించగలమని ఆశిస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment