ముంబై : ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ వచ్చే నెలలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) పద్ధతిలో రూ.2,500 కోట్లను సమీకరించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ చైర్మన్, ఎండీ అరుణ్ తివారీ ధ్రువీకరించారు. యూనియన్ బ్యాంక్ ఇటీవలే పబ్లిక్ ఇష్యూ, రైట్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్‌మెంట్, ప్రభుత్వ పెట్టుబడులు వంటి తదితర మార్గాల ద్వారా దాదాపు రూ.3,700 కోట్ల నిధుల సమీకరణకు స్టాక్‌హోల్డర్ల నుంచి అనుమతి పొందింది.