Private Placement
-
మహీంద్రా రూ.5,000 కోట్ల నిధుల సమీకరణ
ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 5,000కోట్ల నిధులు సమీకరించనున్నది. ఈ నిధులను స్వల్ప, దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ వ్యాపార కార్యకలాపాలు, మూలధన వ్యయాల కోసం ఖర్చు చేయాలని కంపెనీ ఆలోచన. ఈ నిధుల సమీకరణకు వాటాదారుల నుంచి ఆమోదం కోరనున్నట్లు కంపెనీ బీఎస్ఈకి నివేదించింది. వచ్చే నెల 7న కంపెనీ సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం) జరగనున్నదని, అప్పటి నుంచి దశలవారీగా ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో దేశీయ/ విదేశీ మార్కెట్ల ద్వారా ఈ నిధులను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. -
రూ.2,500 కోట్ల నిధుల సమీకరణ దిశగా యూనియన్ బ్యాంక్
ముంబై : ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ వచ్చే నెలలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) పద్ధతిలో రూ.2,500 కోట్లను సమీకరించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ చైర్మన్, ఎండీ అరుణ్ తివారీ ధ్రువీకరించారు. యూనియన్ బ్యాంక్ ఇటీవలే పబ్లిక్ ఇష్యూ, రైట్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్మెంట్, ప్రభుత్వ పెట్టుబడులు వంటి తదితర మార్గాల ద్వారా దాదాపు రూ.3,700 కోట్ల నిధుల సమీకరణకు స్టాక్హోల్డర్ల నుంచి అనుమతి పొందింది.