మహీంద్రా రూ.5,000 కోట్ల నిధుల సమీకరణ
ప్రైవేట్ ప్లేస్‌మెంట్ విధానంలో
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ. 5,000కోట్ల నిధులు సమీకరించనున్నది. ఈ నిధులను స్వల్ప, దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ వ్యాపార కార్యకలాపాలు, మూలధన వ్యయాల కోసం ఖర్చు చేయాలని కంపెనీ ఆలోచన. ఈ నిధుల సమీకరణకు వాటాదారుల నుంచి ఆమోదం కోరనున్నట్లు కంపెనీ బీఎస్‌ఈకి నివేదించింది. వచ్చే నెల 7న కంపెనీ సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం) జరగనున్నదని, అప్పటి నుంచి దశలవారీగా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ విధానంలో దేశీయ/ విదేశీ మార్కెట్ల ద్వారా ఈ నిధులను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది.