యూనియన్ బ్యాంక్ నికర లాభాలు డౌన్
Published Sat, Aug 6 2016 5:56 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
ముంబై:యూనియన్ బ్యాంక్ నిరాశాజనక ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ నికరలాభాలు 68 శాతం క్షీణించాయి. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో రూ 166.32 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు శనివారం ప్రకటించింది. ప్రభుత్వరంగ రుణదాత యూనియన్ బ్యాంక్ గత ఏడాది ఇదే కాలంలో 518.78 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గ్లోబల్ బిజినెస్ మాత్రం కొంత మెరుగ్గా ఉంది. గత ఏడాది రూ.5,82,817కోట్లతో పోలిస్తే.. ప్రస్తుత క్వార్టర్ లో రూ.6,07,280 కోట్లను ఆర్జించింది. నెట్ ఎన్ పీఏ నిష్పత్తి గత ఏడాది జూన్ 30 నాటికి 3.08 శాతం ఉండగా జూన్ 30, 2016 నాటికి 6.16 శాతంగా ఉంది. అయితే జనవరి మార్చి క్వార్టర్ తో పోలిస్తే 72.2 శాతం లాభాలు ఎగిసాయి.
దేశీయ నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎమ్) ఏడాది ఇదే కాలంలో 2.46 శాతం పోలిస్తే ఏప్రిల్-జూన్ 2016 శాతం 2.36 శాతంగా నమోదైందని బ్యాంకు వెల్లడించింది. ఏప్రిల్-జూన్ కాలానికి నికర వడ్డీ ఆదాయం, గత ఏడాది మాదిరిగా స్థిరంగా ఉండి.. రూ 2,130 కోట్ల రూపాయల వద్ద ఉంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా తెరిచిన 58 లక్షలకు పైగా ఖాతాలతో రూ 892 కోట్ల నిల్వలు ఉన్నట్టు ప్రకటించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ 721 కోట్ల క్యాపిటల్ ఇన్ ఫ్యూజన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement