
హైదరాబాద్: ఓయో హోటల్‌లో మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ కుషమ్‌కాష్ గ్రామానికి చెందిన అనుర«ద్‌సింగ్, సచిన్‌సింగ్(30) ఇద్దరూ నాచారం మల్లాపూర్‌లో ఉంటూ ఓయో హోటల్‌లో పనిచేస్తున్నారు. మూడు నెలలుగా మల్కాజిగిరి మారుతీనగర్‌లోని సాయి మాన్సన్ ఓయో హోటల్ నిర్వహిస్తున్నాడు.
16వ తేదీ రాత్రి తన రూమ్‌లోకి వెళ్లిన సచిన్‌సింగ్ తలుపు తీయలేదు. తలుపు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొనని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment