
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పీర్జాదిగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బాత్ రూమ్‌లో చున్నితో ఉరి వేసుకున్న విద్యార్థినిని కళాశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఆత్మహత్య చేసుకుందా? మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
వనపర్తి పట్టణానికి చెందిన విద్యార్థిని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
ఇదీ చదవండి: కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
Comments
Please login to add a commentAdd a comment