medipalli
-
అంగట్లో అమ్మకానికి ఆడ శిశువు
మేడిపల్లి: ముక్కు పచ్చలారని మూడు నెలల పసికందును అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకునేందుకు యతి్నంచిన అమానవీయ ఘటన పీర్జాదిగూడలో బుధవారం కలకలం రేపింది. మూడు నెలల ఆడ శిశువును విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మేడిపల్లి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణా నగర్ కాలనీలో ఐతె శోభారాణి ఆర్ఎంపీగా పని చేస్తూ ప్రథమ చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తోంది. కొంత కాలంగా ఉప్పల్ ఆదర్శనగర్ కాలనీకి చెందిన చింత స్వప్న, రామకృష్ణా నగర్ కాలనీకి చెందిన షేక్ సలీం పాషాతో కలిసి నగరంతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు చెందిన చిన్నారుల ఆచూకీ తెలుకుంటున్నారు. ఆయా కుటుంబాలకు డబ్బుల ఆశ చూపిస్తున్నారు. కొంత మొత్తం ముట్టజెప్పి వారి పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన కొందరు మహిళలు తెలుసుకున్నారు. తమకు పిల్లలు లేరని పెంచుకోవడానికి ఆడపిల్ల కావాలని శోభారాణిని సంప్రదించారు. మూడునెలల పసికందును రూ.4.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చి మిగతా డబ్బులు పాపను తీసుకున్న తర్వాత ఇస్తామని చెప్పారు. బుధవారం మధా్నహ్నం విజయవాడ నుంచి తీసుకు వచి్చన మూడు నెలల ఆడ శిశువును శోభారాణి, స్వప్న, సలీం పాషా స్వచ్ఛంద సంస్థ మహిళలకు చూపించారు. ఈ విషయాన్ని వెంటనే వారు మేడిపల్లి పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్ఎంపీ శోభారాణి, ఆమెకు సహకరించిన స్వప్న, సలీంలను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శిశు విహార్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్: శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పీర్జాదిగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బాత్ రూమ్‌లో చున్నితో ఉరి వేసుకున్న విద్యార్థినిని కళాశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఆత్మహత్య చేసుకుందా? మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వనపర్తి పట్టణానికి చెందిన విద్యార్థిని హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఇదీ చదవండి: కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు -
నాలుగు నెలలు.. నరకయాతన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చెంగిచర్ల చౌరస్తా వద్ద గత జనవరి 12న జరిగిన పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో తీవ్రంగా గాయపడిన చెంగిచర్లకు చెందిన శివకుమార్ నాలుగు నెలల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఆదివారం మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెంగిచర్లకు శివకుమార్(25) చర్లపల్లిలోని హెచ్పీసీఎల్లో ఎలక్ట్రిషియన్‌గా పని చేసేవాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా కొబ్బరి కాయలు తెచ్చుకునేందుకు ఉప్పల్ వెళ్లిన అతను బైక్‌పై తిరిగి వస్తుండగా మేడిపల్లి చౌరస్తా వద్ద పెట్రోల్ ట్యాంకర్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో శివకుమార్ బైక్, అతని ఒంటికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొన్నాళ్ల పాటు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. శరీరంలో ఒక్కో అవయవం దెబ్బతినడంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని షణ్ముక్ వైష్ణవి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు రూ. 5 లక్షలు ఖర్చు కాగా నాలుగు నెలల పాటు మృత్యువుతో పోరాడిన శివకుమార్ శనివారం రాత్రి మృతి చెందాడు. శివ మృతితో అతని ఇంటి వద్ద విషాద చాయలు అలుముకున్నాయి. ఆదివారం ఆస్పత్రి నిర్వాహకులు శివకుమార్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహంతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాచారం అందడంతో మేడిపల్లి పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా అతని ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక శ్మశాన వాటికలో అతని అంత్యక్రియలు నిర్వహించారు. -
రైతుకు నిజమైన పండుగరోజు
మేడిపెల్లి : రైతుకు రైతుబంధు చెక్కులను అందజేసిన ఈ రోజు రైతుకు పండుగరోజు అని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. మండలంలోని కట్లకుంటలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా మొదట చెక్కుల పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం రైతులకు పూలదండ వేసి చెక్కులు, పట్టాదారు పాస్నుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడుతూ రైతులకు తెలంగాణ సర్కార్ అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. రైతులకు పంట పెట్టుబడి కోసం ఇతరుల వద్ద అప్పులు చేయవద్దన్న ఉద్దేశంతో రైతుబంధు చెక్కులను అందజేస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండుగ చేసుకొంటున్నారని చెప్పారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి మాట్లాడుతూ రైతులు రైతుబంధు చెక్కులను పంట పెట్టుబడికి మాత్రమే ఉపయోగించాలని సూచించారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడంతో పాటు పండించిన పంటలకు మద్ధతు ధర కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పుడు పంట పెట్టుబడి కింద చెక్కులు ఇవ్వడం తెలంగాణ రైతుల అదృష్టమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, వ్యవసాయశాఖ ఏడీఏ రాజేశ్వర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో హరికిషన్, ఏవో త్రివేదిక, జిల్లా రైతు సమన్వత కమిటీ సభ్యుడు కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, సర్పంచ్ చెట్ట గంగరాజు, ఎంపీటీసీ సురకంటి విజయ, సింగిల్‌విండో చైర్మన్లు మిట్టపెల్లి భూమరెడ్డి, వొద్దినేని హరిచరణ్‌రావు, మామిడి తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముక్కెర గంగాధర్, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సుధవేని గంగాధర్‌గౌడ్, నాయకులు నారాయణరెడ్డి, హైమద్, గంగారాం, భూమేశ్, దాసు, ప్రభాకర్, రవీందర్, గాజీపాషలు, గ్రామస్తులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. -
ట్యాంకర్ టెర్రర్
ఉప్పల్/బోడుప్పల్/మేడిపల్లి: శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయం.. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం.. భారీ శబ్దంతో డీజిల్ ట్యాంకర్ల పేలుడు.. ఏం జరిగిందో తెలిసేలోపే అర కిలోమీటర్ దూరం వ్యాపించిన అగ్నికీలలు.. రోడ్డు మీ ద ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారికి అంటుకున్న మంటలు.. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల వద్ద శుక్రవారం భారీ అగ్నిప్రమాదం తాలూకూ విధ్వంసమిదీ. డీజిల్ ట్యాంకర్లు మరమ్మతు చేసే షెడ్లో రెండు ట్యాంకర్లు ప్రమాదవశా త్తూ పేలడం తో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ట్యాంకర్ల నుంచి అక్రమంగా పెట్రోల్, డీజిల్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రమాదాన్ని గమనించిన షెడ్ నిర్వాహకుడు, పనిచేసేవారు, ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్లు అక్కడి నుంచి పరారవ్వగా.. దారినవెళ్లే అమాయకులు గాయాల పాలైనట్లు తెలుస్తోంది. అదుపులో షెడ్ నిర్వాహకుడు.. షెడ్ నిర్వాహకుడు రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్‌రావు వెల్లడించారు. ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమంగా డీజిల్ తీసిన తర్వాత సదరు ట్యాంకర్ రివర్స్ తీసుకుంటున్నప్పుడు నిప్పురవ్వలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. క్షతగాత్రులకు గాంధీలో చికిత్స.. అగ్నిప్రమాద ఘటనలో గాయపడిన ఆరుగురు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేష్‌నాయక్(26)కు 80 శాతం కాలిన గాయాలయ్యాయని, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన స్వామినాయక్(35)కు 35 శాతం, మచిలీపట్నానికి చెందిన వాసుకు 25 శాతం కాలిన గాయాలయ్యాయని చెప్పారు. చెంగిచర్లకు చెందిన గోల్డ్‌స్మిత్ నల్లా నాగులు(40), డ్రైవర్ మహ్మద్ జలీల్‌ఖాన్ (50), అంబర్‌పేట రతన్నగర్కు చెందిన టైలర్ షేక్ ఇబ్రహీం(60) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మేడిపల్లి అపెక్స్ ఆస్పత్రిలో కుషాయిగూడకు చెందిన ఏఎస్ఐ మురళీదాస్గౌడ్(50), నవనీత్(28), చెంగిచెర్లకు చెందిన డొప్ప శివ(25) చికిత్సపొందుతున్నారు. వీ6 చానల్ రిపోర్టర్ శేఖర్, చెంగిచర్లకు చెందిన కేతావత్ లక్ష్మణ్(25) స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిందిలా.. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లి చౌరస్తా చెంగిచర్ల వెళ్లే రహదారి పక్కన డీజిల్ ట్యాంకర్లు మరమ్మతులు చేసే షెడ్డు ఉంది. మేడిపల్లికి చెందిన రాజు అనే వ్యక్తి పదేళ్లుగా ఈ షెడ్డును నిర్వహిస్తున్నాడు. అయితే అదే షెడ్లో డీజిల్, పెట్రోల్ విక్రయ అక్రమ దందాను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరమ్మతుల పేరుతో ట్యాంకర్లను తీసుకొచ్చి వాటిలోని పెట్రోల్, డీజిల్‌ను తీసి డ్రైవర్లు, షెడ్డు నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ ట్యాంకర్ నుంచి డీజిల్, పెట్రోల్ అక్రమంగా వెలికి తీసిన తర్వాత సదరు ట్యాంకర్ రివర్స్ తీసుకుంటున్నప్పుడు నిప్పురవ్వలు అంటుకుని మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ట్యాంకర్‌కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా రెండు డీజిల్ ట్యాంకర్లు పేలడంతో అర కిలోమీటర్ దూరం వరకు అగ్నికీలలు వ్యాపించాయి. షెడ్లో ఉన్న వారు బయటకు పరుగులు తీయగా.. రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఆరు ఫైరింజన్లు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ క్రమంలో ఫైర్ సిబ్బందికి కూడా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన 11 మందిని గాంధీ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంప ముంచిన ఫొటోల సరదా.. ఇటీవల ప్రతీ ఘటనను తమ స్మార్ట్ఫోన్లలో బంధించేందుకు ఎక్కువ మంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. చెంగిచర్ల అగ్ని ప్రమాద స్థలంలో దారిన వెళ్లే్ల వారు తమ వాహనాలను నిలిపి వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో డీజిల్ ట్యాంకర్ల ఒక్కసారిగా పేలడంతో మంటలు వ్యాపించి.. రోడ్డుపై ఉన్న ఆరుగురు అందులో చిక్కుకుపోయారు. బైక్‌లపై ఉండటంతో కొందరు తప్పించుకోలేకపోయారు. ఆరు ద్విచక్ర వాహనాలు కాలిబూడిదయ్యాయి. అర కిలోమీటర్ మేర మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న చెట్లు, మొక్కలు మాడి మసైపోయాయి. ఇద్దరిని కాపాడా.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఏం జరిగిందో తెలియక పరుగులు తీశాం. హాహాకారాలు వినపడటంతో తేరుకుని చూస్తే.. రోడ్డుపై వెళ్లేవారు కాలిపోతున్నారు. వెంటనే టవల్‌తో మంటలార్పి ఇద్దరిని కాపాడాను. ఈ క్రమంలో నా చేతులు కాలిపోయాయి. – కేతావత్ లక్ష్మణ్ -
మేడిపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
-
ఉలిక్కిపడ్డ మేడిపల్లి.. వాహనదారుడి నరకయాతన..
-
ఉలిక్కిపడ్డ మేడిపల్లి.. క్షతగాత్రుడి నరకయాతన
సాక్షి, హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదంతో మేల్కాజ్గిరి-మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి ఉలిక్కిపడింది. శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకోవడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్‌తో పాటు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. వాహనదారుడి నరకయాతన.. ఆయిల్ ట్యాంకర్ నుంచి వ్యాపించిన మంటలు అంటుకుని ద్విచక్ర వాహనదారుడొకరు నరకయాతన అనుభవించారు. తలకు హెల్మెట్‌తో ఒళ్లంతా గాయాలతో అతడు పడిన యాతన హృదయాలను ద్రవింపజేసింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ముగ్గురు గాయపడ్డారు: సీపీ ఆయిల్ ట్యాంకర్ అగ్నిప్రమాదంలో ముగ్గురు గాయపడినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మంటలు అదుపులోకి వచ్చాయని, సహాయక చర్యలను ఉప్పల్ ఏసీపీ పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. -
మేడిపల్లిలో చైన్‌స్నాచింగ్
హైదరాబాద్: రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అమ్మసాని వెంకటరెడ్డి నగర్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. కాలనీలో నడచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని 3 తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన దుండగుడు తెంపుకెళ్లాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
చిట్టీల పేరుతో మూడు కోట్లు వసూలు.. పరార్
హైదరాబాద్: చిట్టీల పేరుతో మరో భారీ మోసం జరిగింది. ఓ వ్యక్తి దాదాపు రూ.3కోట్లను చిట్టీలపేరుతో వసూలు చేసి ఉడాయించాడు. దీంతో బాధితులు తీవ్ర ఆందోళనలోకి కూరుకుపోయారు. ఏం చేసేది పాలుపోక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు నమోదుచేసుకొని పోలీసులు కేసు విచారణ ప్రారంభించనున్నారు. -
18 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని మేడిపల్లిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. మంగళవారం ఉదయం చేపట్టిన దాడుల్లో పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.35 వేల నగదు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. -
2 ట్యాంకర్ల కల్తీ ఆయిల్ పట్టివేత, ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: నాచారం పారిశ్రామిక వాడ సమీపంలో కల్తీ ఆయిల్ తయారు చేస్తున్న స్థావరంపై ఎస్వోటీ పోలీసులు సోమవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని, రెండు ట్యాంకర్ల ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాచారం పారిశ్రామిక వాడకు సమీపంలోని హేమానగర్లో మహాలక్ష్మి ఆయిల్ పేరుతో ఉన్న గోదాములో పంతులు గోవిందరాజు, ప్రకాశరావు అనే వ్యక్తుల ఆధ్వర్యంలో కల్తీ ఆయిల్ తయారవుతోంది. వారు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ మడ్ ఆయిల్‌ను, కిరోసిన్‌ను కలిపి కల్తీ ఆయిల్‌ను తయారు చేసి, పరిశ్రమలకు విక్రయిస్తుంటారు. తయారీకి అవసరమైన కిరోసిన్‌ను రఫీక్, బాలాగౌడ్ అనే వారు సమకూరుస్తుంటారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రంగస్వామి ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం అర్థరాత్రి గోదాముపై దాడులు చేశారు. అక్కడున్న గోవిందరాజు, ప్రకాశరావులను అదుపులోకి తీసుకున్నారు. రెండు ట్యాంకర్లలో ఉన్న 35వేల లీటర్ల కల్తీ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్ సహా ఇద్దరు వ్యక్తులను మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై వెంకటయ్య కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. -
డీఎస్పీ బంధువు ఇంట్లో మహిళ అస్థిపంజరం
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలోని హిమా నగర్లో ఓ డీఎస్పీ బంధువు ఇంట్లో... మహిళ అస్థిపంజరం బయటపడిన ఘటన కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం మహిళను హత్య చేసి ఇంట్లోనే గొయ్యితీసి పూడ్చి పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.