కట్లకుంటలో రైతుకు చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు
మేడిపెల్లి : రైతుకు రైతుబంధు చెక్కులను అందజేసిన ఈ రోజు రైతుకు పండుగరోజు అని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. మండలంలోని కట్లకుంటలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా మొదట చెక్కుల పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం రైతులకు పూలదండ వేసి చెక్కులు, పట్టాదారు పాస్‌నుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడుతూ రైతులకు తెలంగాణ సర్కార్ అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.
రైతులకు పంట పెట్టుబడి కోసం ఇతరుల వద్ద అప్పులు చేయవద్దన్న ఉద్దేశంతో రైతుబంధు చెక్కులను అందజేస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండుగ చేసుకొంటున్నారని చెప్పారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి మాట్లాడుతూ రైతులు రైతుబంధు చెక్కులను పంట పెట్టుబడికి మాత్రమే ఉపయోగించాలని సూచించారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడంతో పాటు పండించిన పంటలకు మద్ధతు ధర కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు.
ఇప్పుడు పంట పెట్టుబడి కింద చెక్కులు ఇవ్వడం తెలంగాణ రైతుల అదృష్టమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, వ్యవసాయశాఖ ఏడీఏ రాజేశ్వర్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో హరికిషన్, ఏవో త్రివేదిక, జిల్లా రైతు సమన్వత కమిటీ సభ్యుడు కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, సర్పంచ్ చెట్ట గంగరాజు, ఎంపీటీసీ సురకంటి విజయ, సింగిల్‌విండో చైర్మన్లు మిట్టపెల్లి భూమరెడ్డి, వొద్దినేని హరిచరణ్‌రావు, మామిడి తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముక్కెర గంగాధర్, టీఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సుధవేని గంగాధర్‌గౌడ్, నాయకులు నారాయణరెడ్డి, హైమద్, గంగారాం, భూమేశ్, దాసు, ప్రభాకర్, రవీందర్, గాజీపాషలు, గ్రామస్తులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment