సాక్షి, హైదరాబాద్: ఎంత సంచలన కేసు దర్యాప్తు అయినా చిన్న చిన్న ఆధారాల దగ్గరే మొదలవుతుంది. నిందితుడిని పట్టుకోవడంలో క్లూస్ టీమ్స్ పాత్ర కీలకం. హైదరాబాద్ మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక క్లూస్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. కమిషనరేట్లలో డివిజన్ స్థాయిలో, జిల్లాల్లో ఒక్కోటి చొప్పున వీటి ని ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందాల్లో ముగ్గురు క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ ఆఫీసర్లు, ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, డ్రైవర్ చొప్పున ఉండనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే ఒక్కో క్లూస్ టీమ్ పని చేస్తోంది. ఇందులో ఉన్న సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఉంటోంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న డీజీపీ క్లూస్ టీమ్‌లను వికేంద్రీకరించాలని నిర్ణయించారు. త్వరలో సైబరాబాద్ లో 9, రాచకొండలో 8 బృందాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి కమిషనరేట్/జిల్లాల్లో ఉండే క్లూస్‌టీమ్‌లకు అదనంగా ఓ ప్రధాన క్లూస్ టీమ్ ఉం డనుంది. ఈ టీమ్స్‌లో పని చేయడానికి సైన్స్ విభాగంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారిని ఎంచుకోనున్నారు. వీరిని హోంగార్డ్స్ క్యాడర్‌లో రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నారు. సైంటిఫిక్ ఆఫీసర్స్‌గా పిలిచే వీరికి 6 నెలల పాటు సీఐడీ, గ్రేహౌండ్స్, సీసీఎస్, ఎఫ్‌ఎస్‌ఎల్ విభాగాల్లో శిక్షణిస్తారు.
ఈ ఆధారాలు సేకరించేలా శిక్షణ
బయోలాజికల్ ఎవిడెన్స్: రక్తం, వీర్యం, ఉమ్మి సహా శరీర సంబంధిత వాటితో పాటు కనిపించే వేలిముద్రలు
లేటెంట్ ప్రింట్ ఎవిడెన్స్: చోరీ కేసుల్లో కంటికి కనిపించని వేలిముద్రలు, పాదముద్రలతో పాటు ఇతర ఆధారాలు
ఫుట్‌వేర్ అండ్ టైర్ ట్రాక్ ఎవిడెన్స్: నేరస్థలాల్లో ఉన్న పాదరక్షల గుర్తులు, ప్రమాద స్థలాల్లో ఉండే వాహనాల టైర్ల మార్కులు తదితరాలు
ట్రేస్ ఎవిడెన్స్: సూక్ష్మమైన ఆధారాలుగా పిలిచే ఫైబర్ (నూలు పోగులు వంటివి), జుట్టు, కాల్పులు జరిగినప్పుడు పడే గన్‌పౌడర్ తదితరాలు
డిజిటల్ ఎవిడెన్స్: కంప్యూటర్లు, సెల్‌ఫోన్లకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు, ఫ్లాపీలు, పెన్‌డ్రైవ్‌లతో పాటు చిప్స్ తదితరాలు
టూల్ అండ్ టూల్ మార్క్ ఎవిడెన్స్: బాధితులు, మృతులను కొరకడం వంటివి జరిగితే ఆ ఆధారాలు, తాళాలు, డోర్లు పగులకొట్టిన ఆధారాలు
డ్రగ్ ఎవిడెన్స్: వివిధ రకాలైన మాదకద్రవ్యాలకు సంబంధించి ఘటనా స్థలాల్లో ఉన్న వాటితో పాటు పోలీసులు పట్టుకున్న వాటి నమూనాలు
ఫైర్ ఆరమ్స్ ఎవిడెన్స్: తూటాలు, ఖాళీ క్యాట్రిడ్జ్‌లు ఇతర ఆధారాలు
ఇక ఆధారాలు పదిలం!
Published Thu, May 17 2018 1:49 AM | Last Updated on Thu, May 17 2018 1:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment