
'దిలీప్‌ను జైలుకు పంపే ఆధారాలున్నాయి'
కొచ్చి: కేరళ ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో దిలీప్‌ను జైలుకు పంపించేందుకు కావాల్సినన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మేం ఆయనను అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్న ఏవీ గార్గ్ ఈ కేసు విషయంపై ప్రశ్నించగా దర్యాప్తునకు సంబంధించి ఇంతకుమించి ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు. దిలీప్‌నకు వ్యతిరేకంగా పూర్తి ఆధారాలు తమ ఉన్నాయని మాత్రం పునరుద్ఘాటించారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న దిలీప్ మేనేజర్ అప్పునీ బుధవారం దిలీప్ కోసం కేరళ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అంతేకాకుండా, తన బెయిల్ పిటిషన్‌లో పోలీసుల వద్ద అసలు ఎలాంటి ఆధారాలు లేకుండానే దిలీప్‌ను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో నటుడు, దర్శకుడు నదీర్ షా అప్రూవర్‌గా మారేందుకు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. దిలీప్ యాంటిసిపేటరీ బెయిల్‌పై హైకోర్టు గురువారం విచారించనుంది.