Kerala Actress Abduction Case
-
సూపర్ స్టార్ రిలీజ్: జైలువద్ద ఫ్యాన్స్ సందడి!
సాక్షి, కొచ్చి : ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన నటుడు దిలీప్ జైలు నుంచి విడుదలవుతారని తెలియగానే ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. తమ అభిమాన హీరో, సూపర్ స్టార్ దిలీప్ విడుదల కోసం అలువా జైలుకు ఆయన మద్ధతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు దాదాపు మూడు నెలల పోరాటం తర్వాత ఎట్టకేలకు మంగళవారం దిలీప్‌నకు కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నటి కేసు విషయంలో 85 రోజుల తర్వాత జైలు నుంచి దిలీప్ విడుదల కానున్నారు. గత జూలైలో దిలీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అలువా జైలుకు తరలించి విచారణ చేపట్టారు. గతంలో రెండు పర్యాయాలు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటీషన్లను కోర్టులు తిరస్కరించాయి. జూలై 24న తొలిసారి, ఆగస్టు 10న మరోసారి దిలీప్‌నకు బెయిల్ విషయంలో చుక్కెదురైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీని నటుడు దిలీప్ పురమాయించాడని పోలీసులు భావించారు. తమవద్ద ఈ కేసులో తగిన ఆధారాలున్నాయని, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా బెయిల్ కోసం దిలీప్ చేసుకున్న అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. తమ హీరో దిలీప్ జైలు నుంచి విడుదలకానున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దిలీప్ విడుదల కోసం ఆయన ఉన్న అలువా జైలు వద్దకు భారీ సంఖ్యలో సూపర్ స్టార్ అభిమానులు తరలివస్తున్నారు. కొందరు హీరో కటౌట్లను జైలు వద్దకు తీసుకొచ్చి హడావుడి చేస్తున్నారు. -
85 రోజుల తర్వాత.. ఎట్టకేలకు
కొచ్చి: ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన నటుడు దిలీప్‌కు ఊరట లభించింది. ఎట్టకేలకు ఆయనకు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరుచేసింది. దీంతో 85 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. గత ఫిబ్రవరిలో మలయాళ నటిని కారులో కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రధాన సూత్రధారిగా దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జూలై 10న దిలీప్‌ను అరెస్టుచేసిన పోలీసులు.. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా పక్కాగా ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలుసార్లు కేరళ హైకోర్టును, దిగువ కోర్టును బెయిల్ కోసం దిలీప్ ఆశ్రయించినా.. చుక్కెదురైంది. ఈ కేసులో దిలీప్ ప్రధాన నిందితుడు అనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని, ఆయనకు బెయిల్ ఇస్తే.. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించి.. గతంలో బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తాజాగా బెయిల్ కోసం దిలీప్ చేసుకున్న అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. దిలీప్ హీరోగా తెరకెక్కిన 'రామ్‌లీల' సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. -
ఆ నటిని కిడ్నాప్ చేస్తే రూ.3 కోట్లు ఇస్తాను
తిరువనంతపురం : కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న దిలీప్.. ఆ నాడు నటిని కిడ్నాప్ చేసేందుకు మూడు కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని విచారణ అధికారులు బుధవారం హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ముఖ్య నిందితుడైన పల్సర్ సునీకి రూ.1.50కోట్లు ఇస్తానని ఒప్పుకున్నారని, ఒక వేళ పోలీసులు పట్టుకుంటే మాత్రం రూ.3కోట్లు చెల్లించేందుకు అంగీకరించారని తెలిపారు. ఈ ఏడాది జులైలో దిలీప్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ నటిని కిడ్నాప్ చేసి వేధింపులకు గురిచేసేలా ప్లాన్ చేశారని, కుట్రపూరిత నేరం కేసులో ఆయనను అరెస్టు చేసి ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉంచారు. ప్రస్తుతం హైకోర్టులో దిలీప్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. గతంలో రెండుసార్లు కింది స్థాయి కోర్టు ఆయనకు బెయిల్‌ను నిరాకరించింది. -
'దిలీప్‌ను జైలుకు పంపే ఆధారాలున్నాయి'
కొచ్చి: కేరళ ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో దిలీప్‌ను జైలుకు పంపించేందుకు కావాల్సినన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మేం ఆయనను అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్న ఏవీ గార్గ్ ఈ కేసు విషయంపై ప్రశ్నించగా దర్యాప్తునకు సంబంధించి ఇంతకుమించి ఎలాంటి విషయాలు చెప్పలేమన్నారు. దిలీప్‌నకు వ్యతిరేకంగా పూర్తి ఆధారాలు తమ ఉన్నాయని మాత్రం పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దిలీప్ మేనేజర్ అప్పునీ బుధవారం దిలీప్ కోసం కేరళ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అంతేకాకుండా, తన బెయిల్ పిటిషన్లో పోలీసుల వద్ద అసలు ఎలాంటి ఆధారాలు లేకుండానే దిలీప్‌ను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో నటుడు, దర్శకుడు నదీర్ షా అప్రూవర్‌గా మారేందుకు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. దిలీప్ యాంటిసిపేటరీ బెయిల్‌పై హైకోర్టు గురువారం విచారించనుంది.