'రాహుల్ గాంధీ సాక్ష్యాలతో రావాలి'
ఉదయ్‌పూర్: మహాత్మా గాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్ఎస్ హస్తం ఉందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. దానికి సంబంధించిన సాక్ష్యాలతో రావాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మన్మోహన్ వైద్య కోరారు. ఆర్ఎస్ఎస్ వాలంటీర్ల సమావేశంలో పాల్గొనడానికి రోజుల పర్యటన నిమిత్తం ఉదయ్‌పూర్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీజీ హత్యకు ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుందని, రాహుల్ గాంధీ కాదని వైద్య స్పష్టం చేశారు. ఓ ఆర్‌ఎస్ఎస్ వాలంటీర్ కోర్టులో రాహుల్‌ను సవాల్ చేయగా.. పారిపోయాడని ఎద్దేవా చేశాడు.
రాహుల్ తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలుంటే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని సూచించారు. గాంధీజీ హత్యకు సంబంధించిన చార్జ్షీట్‌లో సైతం ఆర్ఎస్ఎస్ ప్రస్థావన లేదని వైద్య గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలు అసత్యమని ఆయన కొట్టిపారేశారు. కోర్టు ఉగ్రవాదులని పేర్కొన్నవారికి రాహుల్ మద్దతిస్తున్నారని.. అసలు దేశంలోని న్యాయవ్యవస్థపై అతనికి నమ్మకముందా అని వైద్య ప్రశ్నించారు.