
లక్నో: కర్ణాటక నుంచి హర్యానా వరకు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హిందూ యువతులను బలవంతంగా ముస్లింలుగా మార్చాలని కొందరు ప్రయత్నిస్తున్నారని గట్టిగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ‘లవ్ జిహాద్’ పేరుతో ఇలా చేస్తున్నారని వీరిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టం తీసుకురావాలని కోరుతున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ ఇలాంటి పనులకు పాల్పడితే అంతిమ సంస్కారాలు తప్పవని బాహాటంగానే ప్రకటించారు.
అయితే ఈ కేసులను విచారించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి కేసులు కాన్పూర్‌లో 14 నమోదు కాగా వాటిలో 7 కేసులు విచారణ చేపట్టిన పోలీసులకు ఈ అన్ని కేసులలో తమ ఇష్టప్రకారమే యువతి యువకులు ఒక్కటయినట్లు తెలిసింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులు నీరుగారిపోయాయి. ఆగస్టు 7 వతేదీన జుహి కాలనికి చెందిన షాలిని యాదవ్ అనే యువతిని మహ్మమద్ ఫసిల్ అనే వ్యక్తి తమ కూతురి పై గన్ను గురిపెట్టి ఆమెను బలవంతంగా పెళ్లి తీసుకోని ఇస్లాంలోకి మారాలని బలవంతం పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఆ యువతి తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని, తనకు నచ్చే ఇస్లాంలోకి మారానని ఇందులో ఎవరి బలవంతం లేదని కోర్టుకు తెలిపింది. ఇంకా వేరే కేసులో కూడా ఆ అమ్మాయి అబ్బాయి ఎప్పటి నుంచో ప్రేమించుకున్నారని ఇలా కేసు పెట్టడానికి ముందు వరకు వారు బాగానే ఉన్నారని వారి ఇరుపొరుగువారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment