'The Kerala Story' type case in Uttar Pradesh - Sakshi
Sakshi News home page

యూపీలో ‘ది కేరళ స్టోరీ’... సంచలన ఉదంతం వివరాలివే..

Published Mon, May 29 2023 9:20 AM | Last Updated on Mon, May 29 2023 10:01 AM

kerala story type case in uttarpradesh - Sakshi

‘ది కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తలపించే ఉదంతం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఒక హిందూ యువతిని హత్యచేశారనే ఆరోపణలతో ఇద్దరు యువకులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఒక ముస్లిం యువకుడు ఒక హిందూ యువతిని కిడ్నాప్‌ చేసి, రహస్యంగా వివాహం చేసుకున్నాడు. తరువాత ఆమె చేత మతమార్పిడి చేయించాడు. కొంతకాలానికి ఆమె గర్భవతి అయ్యింది. ఈ సమయంలోనే ఆమెను హత్య చేశాడని సమాచారం.

ఈ ఉదంతంలో పోలీసులు నావేద్‌ అనే యువకునితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి, వారిని విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలు సామాజిక సంస్థలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం లవ్‌ జిహాద్‌, హత్యలతో ముడిపడిన ఈ ఉదంతం లోదీపూర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన నావేద్‌ అనే యువకుడు లఖీపూర్‌ జిల్లాలోని పలియా ప్రాంతానికి చెందిన సీమా గౌతమ్‌ అనే యువతి చేత మత మార్పిడి చేయించి, ఆమెను వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివాహం తరువాత సీమా గౌతమ్‌ పేరును సిద్ధిఖీ అని మార్చాడని తెలుస్తోంది. ఒక ఆసుపత్రిలో పనిచేసే ఆమెతో పాటు ఒక గదిలో నావేద్‌ అద్దెకు ఉండటం ప్రారంభించాడు. ఆదివారం అర్థరాత్రి నవాద్‌ ఆమెను వైద్య పరీక్షల పేరుతో మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, మృతి చెందిందని ధృవీకరించారు. దీంతో నవాద్‌ ఆమె మృతదేహాన్ని వెంటనే అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకుని నావేద్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఆ యువతి 6 నెలల గర్భవతి అని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ తమ కుమార్తె చేత బలవంతంగా మత మార్పిడి చేయించి, గర్భవతిని చేశాక, విషం ఇచ్చి చంపేశారని ఆరోపించారు. నిందుతునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న పలు సామాజిక సంస్థలు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేపట్టాయి. నిందితునిపై వెంటనే చర్యలు తీసుకోని పక్షంలో హిందూ సంస్థలు సంయుక్తంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తాయని హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement