అమ్మాయి, అబ్బాయి ఇష్టపడ్డారు. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పెళ్లి జరుగుతోంది. ఇంతలో కొంతమంది అక్కడికి వచ్చారు. ‘ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు’’ అన్నారు! అమ్మాయి అబ్బాయి ముఖముఖాలు చూసుకున్నారు. వధువు వైపువాళ్లు, వరుడి వైపు వాళ్లు ముఖముఖాలు చూసుకున్నారు. అమ్మాయి తండ్రి పైకి లేచి, ‘‘ఏం ఎందుకు జరగకూడదు?’’ అని అడిగాడు. ‘‘మీ అమ్మాయి హిందువు, ఆ అబ్బాయి ముస్లిం కనుక జరగకూడదు’’ అన్నారు ఆ వచ్చినవాళ్లు. ‘‘ఇంతకీ మీరెవరు?’’ అని అడిగాడు అమ్మాయి తండ్రి. ‘‘హిందువుల తరఫు వాళ్లం’’ అన్నారు. ఆయనకు అర్థం కాలేదు. ‘‘అయితే?!’’ అన్నాడు. ‘‘మా అమ్మాయిని ముస్లింకు ఇచ్చి పెళ్లి చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోం’’ అన్నారు వాళ్లు.
ఆ తండ్రికి సంతోషం వేసింది. ‘మా అమ్మాయి’ అన్నందుకు. వెంటనే కోపం కూడా వచ్చింది. ‘ముస్లింకి ఇచ్చి చేస్తే ఊరుకోం’ అన్నందుకు. ‘‘మీరు చేసుకునేది చేసుకోండి. నేను చేసేది నేను చేస్తాను’’ అని చెప్పి, అమ్మాయి పెళ్లి జరిపించాడు. వాళ్లతో వాదించి, తలపడి, అడ్డుగా ఉండి, వాళ్లను లెక్కచెయ్యకుండా కూతురికి నచ్చినవాడిని ఇచ్చి పెళ్లి జరిపించాడు. పది రోజుల క్రితం జరిగింది ఈ పెళ్లి. ఘజియాబాద్‌లో ఇప్పుడంతా ఆ పెళ్లి గురించే చెప్పుకుంటున్నారు. ఆ తండ్రి గురించే ఎక్కువగా చెప్పుకుంటున్నారు. ‘గ్రేట్ ఫాదర్’ అంటున్నారు.
అమ్మాయి పెళ్లి
Published Sat, Jan 6 2018 12:28 AM | Last Updated on Sat, Jan 6 2018 12:28 AM
Comments
Please login to add a commentAdd a comment