లక్నో: గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్ వాసులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాలు.. ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని సూపర్‌టెక్ ఎకోజోన్ కాంప్లెక్స్‌లో ఓ వ్యక్తికి సోమవారం కరోనా పాజిటీవ్‌గా తెలీంది. దాంతో పోలీసులు ఆ కాంప్లెక్స్‌ను సీల్ చేశారు. ఈ విషయంలో పోలీసులకు, అపార్ట్‌మెంట్ వాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కరోనా బయటపడిన ఇంటిని మాత్రమే సీల్ చేయాల్సిందిగా అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులను కోరారు. తాము పని చేస్తున్న కంపెనీలు తిరిగి తెరిచారని.. ఆఫీసులకు వెళ్లకతప్పదని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ('రథయాత్ర 'ఏమవుతుందో ఏమో...!)
అపార్ట్‌మెంట్‌వాసులకు నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ‘మీకు ముందు మేము ఉన్నాం. మేం మా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాం. ఇది ప్రభుత్వ ఉద్యోగం. మేం 24 గంటలు పని చేస్తున్నాం.. కానీ మాకు 12 గంటలకే జీతం ఇస్తారు. అయినా మేం ప్రజల కోసం పని చేస్తున్నాం. ఒక వేళ మీరు గొడప పడాలనుకుంటే రండి’ అంటూ పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసుల మాటలతో జనాలు శాంతించారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ పూర్తిగా సీల్ చేయబడింది.
Comments
Please login to add a commentAdd a comment