సాక్షి, తిరుపతి: కనిపించే మూడు సింహాలు.. పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులే అన్నారు సినీ నటడు సాయి కుమార్. మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా భయపడుతున్నా.. స్వామి వారి దయతో అందరూ ధైర్యంగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడే షూటింగులు మొదలయ్యాయి. కరోనా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి సెల్యూట్ చేశారు. ‘పోలీసులు నిజమైన హీరోలు.. వారి గెటప్ వేస్తే.. మాలో ఒక పౌరుషం కనిపస్తుంది. నిజమైన పోలీసులకి ఇంకా ఎంత షౌరుషంగా ఉంటుందో. ‘పోలీస్ స్టోరి’ చేసి 25 సంవత్సరాలు పూర్తి అయింది. త్వరలోనే ‘నాలుగో సింహం’ అని మరో పోలీస్ స్టోరీలో నటించబోతున్నాను’ అన్నారు సాయి కుమార్. (చదవండి: 13 ఏళ్లకు మళ్లీ...)
తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డిపై సాయి కుమార్ ప్రశంసలు కురిపించారు. పోలీసు అధికారి పోలంలోకి దిగడం అంటేనే, ఆయన మనుషుల్లో ఎలా కలిసి పోయారో అర్థం చేసుకోవచ్చు అన్నారు. రమేష్ రెడ్డి లాంటి అధికారి ఉన్న చోట మంచి హ్యూమానిటీ కూడా ఉంటుందని తెలిపారు సాయి కుమార్.
Comments
Please login to add a commentAdd a comment