
సాక్షి, విజయవాడ: కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో పోలీసులదే అగ్రస్థానం అన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. పోలీసుల సమక్షంలో సోమవారం నిర్వహించిన రాఖీ పౌర్ణమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వీర్రాజుతో పాటు జీవిఎల్, సునీల్ డియోదర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ సిబ్బందిని కలిసి వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు సోము వీర్రాజు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో వైద్యుల తరువాత ముఖ్య పాత్ర పోలీసులదే అని ప్రశంసించారు. (3 రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం)
లాక్‌డౌన్‌లో ప్రజలందరూ బయటకు రాకుండా పోలీసులు ప్రముఖ పాత్ర వహించారని సోము వీర్రాజు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు పోలీసులు కల్పించిన అవగాహన, జాగ్రత్తలు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో పనిచేస్తోన్న సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment