రెడ్డి కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి | Reddy's caste should come in all sectors | Sakshi
Sakshi News home page

రెడ్డి కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి

Published Mon, May 22 2017 10:39 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

రెడ్డి కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి - Sakshi

రెడ్డి కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి

  •  కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి
  •  శెట్టూరు: రెడ్డికులస్తులు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణించాలని కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం చెళ్లికెర తాలూకా తిప్పరెడ్డిపల్లిలో సోమవారం యోగి వేమన తల్లి వేమారెడ్డి మల్లమ్మ 595వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా  హాజరై మాట్లాడారు.

    రెడ్డి సామాజికవర్గం వారు వేమనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యోగి వేమన జీవిత విశేషాలను గుర్తుచేశారు. అంతకు ముందు  గ్రామంలో పూర్ణకుంభాలతో యోగి వేమన, మల్లమ్మ చిత్రపటాలను ఊరేగించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.మంత్రిని సన్మానించారు.

    కర్ణాటక రెడ్డి సమాజ్‌ అధ్యక్షుడు కేటీ వెంకటరెడ్డి, కర్ణాటక మాజీ జెడ్పీటీసీ హనుమంతరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు దాస్‌రెడ్డి, శెట్టూరు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ సోమనాథరెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి హరినాథ్‌రెడ్డి, మాజీ సర్పంచు సిద్దం రామిరెడ్డి, రెడ్డి కులస్తులు   పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement