కందుకూరు: ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ డి.రామలింగారెడ్డి తన ఆర్టికల్స్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచారని కాలేజీ కరస్పాండెంట్ కంచర్ల రామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామలింగారెడ్డి ఆర్టికల్స్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్నోవేటివ్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్స్ (ఐజెఐఆర్‌డీ)లో ప్రచురితమయ్యాయని తెలిపారు.
దీంతో ఆర్టికల్స్ పరిశీలనార్థం కేంబ్రిడ్జి, స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సీటీ లైబ్రరీలలో ఉంచనున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. ఇది తమ కాలేజీ అధ్యాపకుల సామర్ధ్యాన్ని తెలియజేస్తుందని వివరించారు. తమ కాలేజీ ప్రొఫెసర్ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగడించడం గర్వకారణం అన్నారు. రామలింగారెడ్డిని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావుతో పాటు, తోటి అధ్యాపకులు డాక్టర్ రవికుమార్, శ్రీనివాస్, రాముడు, ప్రసాద్ అభినందించారు.
ప్రకాశం అధ్యాపకుడికి అంతర్జాతీయ గుర్తింపు
Published Sat, Jul 16 2016 6:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement
Advertisement