
కొందరు చిన్న వయసులోనే అసాధారణ తెలివితేటలు, ప్రతిభ సామర్థ్యంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఈ అసామాన్య వ్యక్తులు అందరిలా కాకుండా చిన్న వయసులోనే పెద్ద పెద్ద డిగ్రీలు పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే తథాగత్ అవతార్ తులసి. అతడి అసామాన్య ప్రతిభ గురించి తెలిస్తే నోటమాట రాదు. మరీ అతడి ప్రతిభాపాటవాలేంటో చూద్దామా..!.
ఆ అసామాన్యుడే తథాగత్ అవతార్ తులసి. ఆయన సెప్టెంబర్ 9, 1987న బిహార్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తథాగత్ చిన్నప్పటి నుంచి తన అసాధారణ మేథాతో అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. అలా తథాగత్ 9 ఏళ్లకే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 11 ఏళ్లకు బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇక 12 ఏళ్లకే ఎంఎస్సీ పూర్తి చేసి, 21 ఏళ్లకే డాక్టరేట్‌ని పొందాడు.
ఆ విధంగా 22 ఏళ్ల వయసుకే ప్రతిష్టాత్మక ఐఐటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్ అయ్యాడు. ఈ అపార ప్రతిభాశాలి పీహెచ్‌డీలో క్వాంటం సెర్చ్ అల్గారిథంపై పరిశోధన చేసి మంచి పేరుతెచ్చుకున్నాడు. అంతేగాదు తథాగత్ ప్రఖ్యాత శాస్త్రవేత్త లవ్ గ్రోవర్‌తో కలిసి ఒక పరిశోధనా పత్రాన్ని కూడా రచించాడు అయితే అది ఏ జర్నల్‌లోనూ ప్రచురితం కాలేదు. అయితే ప్రస్తుతం ఆయన 2019లో ఐఐటీ బాంబే నుంచి తొలగించబడ్డారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఉద్యోగ పోరాటం చేస్తున్నారు.
2011లో తథాగత్ తీవ్ర జ్వరం బారినపడీ అలెర్జీకి గురయ్యాడు. ఆ అనారోగ్యం చాలా ఏళ్ల పాటు కొనసాగడంతో సుదీర్ఘ సెలవు తీసుకున్నాడు. చివరికి 2013లో ముంబై విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ కారణాల వల్లే 2019లో తథాగత్ ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయాడు. తన అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలో నివసించడం సాధ్యం కాదని, తనని ప్రత్యేక కేసు కింద IIT ఢిల్లీకి బదిలీ కోసం అభర్థిస్తున్నారు తథాగత్. అందుకోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించనున్నట్లు సమాచారం.
చివరగా తథాగత్ మాట్లాడుతూ..క్వాంటం కంప్యూటర్ల రంగం పరంగా నాదేశం అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ అంశంపైనే చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నాను. కేవలం 17 ఏళ్ల వయసులో లవ్ గ్రోవర్ మార్గదర్శకత్వంలో దీనిపై పనిచేయడం ప్రారంభించాను. తన పరిశోధన ప్రొఫైల్ ముందు బాగానే ఉంది.
ఆ తర్వాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ పరిశోధనపై ఫోకస్ పెట్టలేకపోయానని వాపోయారు. కానీ ఇప్పుడు తాను క్వాంటం కంప్యూటర్ల రంగానికి తోడ్పాలని కోరుకుంటున్నానని అన్నారు. అదీగాక మన భారతదేశంలో క్వాంటం కంప్యూటర్లపై రూ. 8 వేల కోట్లు ఆంక్షలు ఉన్నాయి. కావున ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈరంగంలో మంచి విప్లవం తీసుకురాగలనని ధీమాగా చెప్పారు తథాగత్ .
సత్కారాలు, అవార్డులు..
1994లో, తథాగత అవతార్ తులసిని అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సత్కరించారు. ఆయన సాధించిన విజయానికి బహుమతిగా ఆయనకు కొంత డబ్బుని పారితోషకంగా ఇచ్చారు. కానీ తథాగత్ ఆ డబ్బుని తీసుకోవడానికి నిరాకరించారు.
దీంతో ఆయనకు ఒక మంచి కంప్యూటర్‌ని బహుమతిగా ఇచ్చారు. అది ఆయనకు మరిన్ని గొప్ప విజయాలను సాధించడానికి సహాయపడింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం తథాగత్ సాధించిన విజయాలకు అబ్బురపడటమే గాక అతడిని ఘనంగా సత్కరించారు కూడా.
(చదవండి: అంతా జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్‌గా కీర్తిస్తారు..కానీ ఆయన..!)
Comments
Please login to add a commentAdd a comment