Jar Founder Misbah Ashraf Success Story Who Failed And College Dropout - Sakshi
Sakshi News home page

రెండుసార్లు ఫెయిల్‌...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్‌ స్టోరీ 

Published Tue, Jun 20 2023 6:28 PM | Last Updated on Tue, Jun 20 2023 7:02 PM

Jar founder Misbah Ashraf success story who failed and college dropout - Sakshi

ఇంటర్‌, పదవతరగతి, ఇతర పోటీ  పరీక్షల ఫలితాలు వచ్చాయంటే..చాలు విద్యార్థుల సక్సెస్‌  కంటే.. అందర్ని భయపెట్టే మరో అంశం కూడా మరొకటి ఉంది. అవును మీరు ఊహించింది కరెక్టే. ఫెయిల్‌ అయ్యామన్న బాధతో ఎంతమంది పిల్లలు ఉసురు తీసుకుంటారో ననే ఆందోళన ఎక్కువ. ఈ విషయంకేవలం తల్లిదండ్రులను మాత్రమేకాదు చాలామందిని పట్టి పీడిస్తోంది. అలాంటి వారికి జీవితంలో ఒక్కోసారి ఓడిపోయినా, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారి సక్సెస్‌ స్టోరీల గురించి చెప్పాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాల్సిందే...కానీ అదే సందర్భంలో ఫెయిల్‌ అయినంత మాత్రాన జీవితం ముగిసి పోయినట్టు కాదు.. అని మానసికంగా ముందే వారిని సన్నద్ధం చేయాలి. రెండుసార్లు పెయిలైనా వ్యాపారంలో  రాణించి 29 ఏళ్లకే  కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ బిహారీ కాలేజీ డ్రాపౌట్‌ సక్సెస్‌ జర్నీ చూద్దాం

ఈ స్టోరీలో మన హీరో పేరు మిస్బా అష్రఫ్. మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. బిహార్‌లో పుట్టి పెరిగిన ఈయన తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. అష్రాఫ్ ఐఐటీ ఢిల్లీలో చదువుతూ తొలి ఏడాదే కాలేజీ మానేశాడు. ఆ తరువాత Pulse.qa (YC), Pursuit, Toymail (YC),Spangle లాంటి సంస్థలలో పనిచేశాడు. మధ్యతరగతి కుటుంబం..ఇటు ఆర్థిక ఇబ్బందులు అయినా వ్యాపారవేత్త అవ్వాలనేది అతని కల  సాకారానికి ఇందుకు తండ్రే స్పూర్తి. ఎలా అంటే  

తండ్రి  ప్రేరణ
ఒక రోజు ఎప్పుడూ రోడ్డు మీద చురుగ్గా నడిచే తండ్రిని అడిగాడుమిస్బా "ఎందుకు నెమ్మదిగా నడవడం లేదు?"  దానికి చిరు మందహాసంతో చెప్పాడు ఇలా "నువ్వు నెమ్మదిగా నడిస్తే..కొట్టుకుపోతావు" అని. దీన్నుంచే అతను జీవిత పాఠాన్ని నేర్చుకున్నాడు. తన కల సాకారం కోసం వేగాన్ని పెంచాడు. (స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌)

అలా సెప్టెంబరు 2013లో  ఐఐటీ-ఢిల్లీకి చెందిన తన స్నేహితులతో కలిసి చెల్లింపుల సంస్థ సిబోలా అనే కంపెనీనీ స్థాపించాడు. కానీ నాలుగు నెలలకే దాన్ని మూసి వేయాల్సి వచ్చింది. ఎందుకంటే స్టార్టప్  కావడం,ప్రభుత్వం పేమెంట్స్‌ లైసెన్స్‌రాలేదు. మళ్లీ నాలుగేళ్ల తరువాత  ఆగస్ట్ 2017లోమార్స్‌పే అనే స్టార్టప్‌ లాంచ్‌ చేశాడు. ఇంతలో కోవిడ్‌ మహమ్మారి వచ్చింది. అయితే భారీగా  వృద్ధిని నమోదు చేయడంతో ఫిబ్రవరి 2021లో బ్యూటీ షాపింగ్ ,లైవ్ వీడియో కామర్స్ యాప్ అయిన ఫాక్సీ ఈ కంపెనీ  కొనుగోలు చేసింది. 

 ఈ ఉత్సాహంతో నెలల వ్యవధిలోనే  మే 2021లో,  జార్ అనే తన మూడవ వెంచర్‌ను ప్రారంభించాడు. జార్‌లో నిశ్చయ్‌ మరో కో ఫౌండర్‌. అతను చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసరుగా ఉన్నారు.   స్టార్టప్ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన పొదుపు , పెట్టుబడి. 18 నెలల తర్వాత, ఇది 11 మిలియన్ల వినియోగదారులను దాటింది. ఫిన్‌టెక్ సంస్థ 58 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది.

జార్  రూ. 2463 కోట్లు (22.6 మిలియన్ డాలర్ల) ను సేకరించింది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే  రూ. 2463 కోట్లకు చేర్చాడు కంపెనీని. అంతేకాదు నిధుల సమీకరణకు అనేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మల్టీ-మిలియన్ డాలర్ల  బిగ్‌డీల్‌ను సాధించాడు. ఇండియాలోని మైక్రో-సేవింగ్స్ యాప్ అయిన జార్, టైగర్ గ్లోబల్ నేతృత్వంలోని సిరీస్ బీ ఫండింగ్‌లో ఈ నిధులను సమకూర్చుకుంది.  అలాగే ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్ (2023)లో ఫోర్బ్స్ 30 అండర్  లిస్ట్‌లో  30 వాడిగా ఎంపికకావడం విశేషం.

జార్‌ ఆఫ్‌ గోల్డ్‌ 
ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తుకు డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం అనే ఉద్దేశంతో జార్ ను  స్టార్ట్‌ చేశారు.ఈ యాప్‌లో అందరూ డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఎంత చిన్న మొత్తంలో అయినా. 10 రూపాయలతో కేవలం 45 సెకన్లలో  24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్‌లో  పెట్టుబడి  పెట్టొచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement