dropout
-
రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!
కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ యువకుడు తన స్నేహితుడి సాయంతో రూ.25,000 పెట్టుబడితో వ్యాపారం సాగించి మూడేళ్లలో ఏకంగా రూ.33.61 కోట్ల వ్యాపారాన్ని విస్తరించాడు. అసలు కాలేజీ డ్రాపవుట్ అయ్యాక తాను ఏ బిజినెస్ ఎంచుకున్నాడు.. తన వ్యాపారాన్ని ఎలా విస్తరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.డారియన్ క్రెయిగ్(31) కొన్ని కారణాల వల్ల కాలేజ్ డ్రాపవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇళ్లు గడవడం ఇబ్బందిగా ఉండడంతో చిన్న ఉద్యోగం చేరాడు. ఒకరోజు ఆఫీస్‌కు వచ్చిన క్రెయిగ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. తాను ఉద్యోగం కోల్పోయే నాటికి తన బ్యాంకు అకౌంట్లో కేవలం 7 డాలర్లు(రూ.600) ఉన్నాయి. తాను ఎలాగై జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం తన చిన్ననాటి స్నేహితుడు బ్రాండన్ ఎకోల్స్ సాయంతో 300 డాలర్లు(రూ.25,000) అప్పుచేసి వ్యాపారం మొదలు పెట్టాడు. ‘వైఆల్ స్వీట్ టీ’ పేరుతో టీ బిజినెస్ ప్రారంభించాడు. 2021లో మొదలుపెట్టిన ఈ వ్యాపారం అభివృద్ధి చెంది మూడేళ్లలో ఏటా రూ.33.61 కోట్ల ఆదాయం సమకూర్చే స్థాయికి ఎదిగింది.వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి విశేష ఆదరణయునైటెడ్ స్టేట్స్లో కార్యకలాపాలు సాగించే ఈ సంస్థ ద్వారా నేరుగా వినియోగదారులకు తమ టీ ఉత్పత్తులను అందిస్తున్నారు. సుమారు 600 రిటైల్ అవుట్లెట్లతో వ్యాపారం సాగిస్తున్నారు. విభిన్న ఫ్లేవర్లలో టీను అందిస్తున్నారు. ఇటీవల క్రెయిగ్, ఎకోల్స్ తమ కంపెనీ విస్తరణకు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల సాయం కోరగా విశేష ఆదరణ లభించిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతాకష్టాలు సహజం.. సరైన నిర్ణయాలు ముఖ్యంఉద్యోగం రాలేదనో, డబ్బు లేదనో, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనో చాలా మంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ క్రెయిన్, ఎకోల్స్లాగా జీవితంలో కష్టపడి ఎదుగుతున్నవారు కోట్లల్లో ఉన్నారు. కాబట్టి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
డ్రాప్ అవుట్.. నో చాన్స్!
సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లలందరినీ బడుల్లోకి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో (2023–24) ఇప్పటి వరకు గుర్తించిన 38,677 డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించడం ఒక సూచికగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బడి ఈడు పిల్లలందరినీ నూరు శాతం బడుల్లో చేర్పించేలా ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వలంటీర్ల ద్వారా ప్రత్యేకంగా 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు బడుల్లో ఉన్నారా.. లేక బడి బయట ఉన్నారా అనే అంశంపై సర్వే నిర్వహించడం ద్వారా డ్రాప్ అవుట్ పిల్లలను గుర్తించారు. ఇప్పటి వరకు 38,677 మంది డ్రాప్ అవుట్ పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించినట్లు ఇటీవల జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. 1వ తరగతిలో చేరిన పిల్లలు ఆ మరుసటి సంవత్సరం రెండో తరగతి.. ఆ మరుసటి సంవత్సరం ఆపై తరగతిలో.. ఇలా 8వ తరగతి వరకు చేరుతున్నారా లేక మధ్యలో డ్రాప్ అవుట్ అవుతున్నారా.. అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహణలో అసలు బడిలో చేరని, డ్రాప్ అవుట్, బాల కార్మికులను గుర్తించి వారి కోసం ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. పిల్లలను బడుల్లో చేర్పించడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించడం ద్వారా అవగాహన కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. తద్వారా బడి ఈడు పిల్లలందరూ బడుల్లో ఉండేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. తద్వారా ఇప్పటి వరకు మొత్తం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్కూల్స్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్య 56,34,974కు చేరింది. ఈ విద్యా సంవత్సరంలో అత్యధికంగా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బడుల్లో చేరిన పిల్లలు కర్నూలు జిల్లాలో 3,78,564 మంది ఉండగా, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 3,06,667 మంది, నంద్యాల జిల్లాలో 2,29,280 మంది బడుల్లో చేరారు. -
రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ
ఇంటర్, పదవతరగతి, ఇతర పోటీ పరీక్షల ఫలితాలు వచ్చాయంటే..చాలు విద్యార్థుల సక్సెస్ కంటే.. అందర్ని భయపెట్టే మరో అంశం కూడా మరొకటి ఉంది. అవును మీరు ఊహించింది కరెక్టే. ఫెయిల్ అయ్యామన్న బాధతో ఎంతమంది పిల్లలు ఉసురు తీసుకుంటారో ననే ఆందోళన ఎక్కువ. ఈ విషయంకేవలం తల్లిదండ్రులను మాత్రమేకాదు చాలామందిని పట్టి పీడిస్తోంది. అలాంటి వారికి జీవితంలో ఒక్కోసారి ఓడిపోయినా, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారి సక్సెస్ స్టోరీల గురించి చెప్పాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాల్సిందే...కానీ అదే సందర్భంలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసి పోయినట్టు కాదు.. అని మానసికంగా ముందే వారిని సన్నద్ధం చేయాలి. రెండుసార్లు పెయిలైనా వ్యాపారంలో రాణించి 29 ఏళ్లకే కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ బిహారీ కాలేజీ డ్రాపౌట్ సక్సెస్ జర్నీ చూద్దాం ఈ స్టోరీలో మన హీరో పేరు మిస్బా అష్రఫ్. మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. బిహార్‌లో పుట్టి పెరిగిన ఈయన తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. అష్రాఫ్ ఐఐటీ ఢిల్లీలో చదువుతూ తొలి ఏడాదే కాలేజీ మానేశాడు. ఆ తరువాత Pulse.qa (YC), Pursuit, Toymail (YC),Spangle లాంటి సంస్థలలో పనిచేశాడు. మధ్యతరగతి కుటుంబం..ఇటు ఆర్థిక ఇబ్బందులు అయినా వ్యాపారవేత్త అవ్వాలనేది అతని కల సాకారానికి ఇందుకు తండ్రే స్పూర్తి. ఎలా అంటే తండ్రి ప్రేరణ ఒక రోజు ఎప్పుడూ రోడ్డు మీద చురుగ్గా నడిచే తండ్రిని అడిగాడుమిస్బా "ఎందుకు నెమ్మదిగా నడవడం లేదు?" దానికి చిరు మందహాసంతో చెప్పాడు ఇలా "నువ్వు నెమ్మదిగా నడిస్తే..కొట్టుకుపోతావు" అని. దీన్నుంచే అతను జీవిత పాఠాన్ని నేర్చుకున్నాడు. తన కల సాకారం కోసం వేగాన్ని పెంచాడు. (స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్) అలా సెప్టెంబరు 2013లో ఐఐటీ-ఢిల్లీకి చెందిన తన స్నేహితులతో కలిసి చెల్లింపుల సంస్థ సిబోలా అనే కంపెనీనీ స్థాపించాడు. కానీ నాలుగు నెలలకే దాన్ని మూసి వేయాల్సి వచ్చింది. ఎందుకంటే స్టార్టప్ కావడం,ప్రభుత్వం పేమెంట్స్ లైసెన్స్రాలేదు. మళ్లీ నాలుగేళ్ల తరువాత ఆగస్ట్ 2017లోమార్స్పే అనే స్టార్టప్ లాంచ్ చేశాడు. ఇంతలో కోవిడ్ మహమ్మారి వచ్చింది. అయితే భారీగా వృద్ధిని నమోదు చేయడంతో ఫిబ్రవరి 2021లో బ్యూటీ షాపింగ్ ,లైవ్ వీడియో కామర్స్ యాప్ అయిన ఫాక్సీ ఈ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ ఉత్సాహంతో నెలల వ్యవధిలోనే మే 2021లో, జార్ అనే తన మూడవ వెంచర్‌ను ప్రారంభించాడు. జార్లో నిశ్చయ్ మరో కో ఫౌండర్. అతను చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసరుగా ఉన్నారు. స్టార్టప్ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన పొదుపు , పెట్టుబడి. 18 నెలల తర్వాత, ఇది 11 మిలియన్ల వినియోగదారులను దాటింది. ఫిన్‌టెక్ సంస్థ 58 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. జార్ రూ. 2463 కోట్లు (22.6 మిలియన్ డాలర్ల) ను సేకరించింది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే రూ. 2463 కోట్లకు చేర్చాడు కంపెనీని. అంతేకాదు నిధుల సమీకరణకు అనేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో మల్టీ-మిలియన్ డాలర్ల బిగ్డీల్ను సాధించాడు. ఇండియాలోని మైక్రో-సేవింగ్స్ యాప్ అయిన జార్, టైగర్ గ్లోబల్ నేతృత్వంలోని సిరీస్ బీ ఫండింగ్‌లో ఈ నిధులను సమకూర్చుకుంది. అలాగే ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్ (2023)లో ఫోర్బ్స్ 30 అండర్ లిస్ట్‌లో 30 వాడిగా ఎంపికకావడం విశేషం. జార్ ఆఫ్ గోల్డ్ ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తుకు డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం అనే ఉద్దేశంతో జార్ ను స్టార్ట్ చేశారు.ఈ యాప్‌లో అందరూ డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఎంత చిన్న మొత్తంలో అయినా. 10 రూపాయలతో కేవలం 45 సెకన్లలో 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. -
18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్
17 ఏళ్ల వయసులోనే చదువుకు గుడ్‌బై చెప్పాడు. అయితేనేం కేవలం 19 ఏళ్లకే లక్షాధికారిగా మారిపోయాడు. టిక్‌టాక్, యూట్యూబ్ వీడియోల ద్వారా ఏంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాడు హెడెన్ బౌల్స్. లంబోర్ఘినీ కారు, టెక్నికల్ రిటైర్ మెంట్.. లగ్జరీ టూర్లు.. అటు లక్షల మంది ఫాలోయర్లు.. ఇటు లక్షలాది సబ్స్క్రైబర్లు.. ఇదంతా ఎలా సాధ్యం.. తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీలోకి పోదాం రండి! అమెరికాకు చెందిన హెడెన్ బౌల్స్ చిన్నవయసులోనే ఇ-కామర్స్పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి చదువుకు స్వస్తి పలికాడు. ఈకామ్సీజన్ (EcommSeason) అనే ప్లాట్పారమ్తో వ్యాపారవేత్తగా అవతరించాడు. ఆన్లైన్లో డబ్బు సంపాదించడం ఎలా అనే కోర్సులను అందిస్తుంది. ఇది దీనికి చార్జ్ 575 డాలర్లు అంటే సుమారు 47 వేల రూపాయలు. కేవలం రెండేళ్లలోనే తన కలను సాకారం చేసుకున్నాడు. 22 ఏళ్లకే మిలియన్ల డాలర్లను ఆర్జిస్తున్నాడు. అంతేకాదు దీనిద్వారా వచ్చిన సొమ్మును రియల్ ఎస్టేట్‌లో పెట్టి హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. బౌల్స్ 18 ఏళ్ల వయస్సులోనే విలాసవంతమైన లంబోర్ఘినిని సొంతం చేసుకోవడం విశేషం. తన విజయానికి గల కారణాలను టిక్‌టిక్ యూట్యూబ్ వీడియోల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటాడు. దీంతో అతనికి మరింత ఆదరణ పెరిగింది. టిక్‌టాక్‌లో దాదాపు 107,000మంది అనుచరులు, యూట్యూబ్‌లో 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. గత సంవత్సరం కేవలం ఇ-కామర్స్ నుండి 15 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాడు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా మరో 1.5 మిలియన్ల డాలర్లు ఆర్జించాడు. ఇంకా పని చేయాలని ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడుల లాభాలతో తాను "టెక్నికల్ రిటైర్డ్"గా భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ వెంచర్ల నుండి వచ్చే ఆదాయం చాలు జీవితాంతం హ్యాపీగా ఉంటా అంటున్నాడు. అందుకే ఇపుడు బాలి తదితర పలు టూరిస్ట్ ప్లేస్‌లను సందర్శిస్తూ లగ్జరీగా లైఫ్‌ను గడిపేస్తున్నాడు. పర్యటనల ఫుటేజ్‌తో, ఫోటోలతో సోషల్ మీడియాను ముంచెత్తుతూ తన సక్సెస్ సీక్రెట్లను ఫాలోయర్లతో పంచుకుంటున్నాడు. అంతేకాదు జీవితంలో పైకి రావాలని భావిస్తున్న వారికి కీలక సలహాలు కూడా అందిస్తున్నాడు. మీరు సోషల్‌మీడియా స్టార్ కావాలనుకుంటే.. ఏం చేయాలో ఆలోచించుకుని ముందుకు సాగాలని సలహా ఇస్తాడు. డెడికేషన్, సింగిల్ ఫోకస్... సంపద అంటే.. రాబడి, ఖర్చుల నిష్పత్తి అంటాడు బౌల్స్. అంతేకాదు విజయవంతమైన వ్యక్తులు వారు సంపాదించిన దానిలో 20 శాతం మాత్రమే ఖర్చుపెడతారని మీరు కూడా అలా చేయగలిగితే, ఆ పొదుపును పెట్టుబడిగా పెట్టి రెట్టింపు ఆదాయాన్ని సాధించవచ్చు అంటాడు. ఫోకస్ ఎపుడూ సింగిల్ గానే ఉండాల, ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ డెడికేషన్ ఉండాలని పిలుపునిస్తున్నాడు. -
17 ఏళ్లకే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు, కానీ ఇప్పుడు
తైహీ కొబయాషి... జపాన్ యువతకు ఆదర్శం. పాఠశాలకు డ్రాపౌట్ అయిన కారణంగా తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో బయటకు వచ్చిన అతడు.. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఓ స్టార్టప్‌ను స్థాపించాడు. ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్ విలువ సుమారు 1 బిలియన్ డాలర్లు. టోక్యో వీధుల్లో గడ్డకట్టే చలిలో వణుకుతూ అనాధలా బతికిన నాటి నుంచి నేడు సంపన్న వ్యక్తిగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా అతడు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి నుంచి కొబయాషికి సంగీతం అంటే ప్రాణం. మ్యూజిక్ నేర్చుకునేందుకు స్కూలు ఎగ్గొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా చదువును నిర్లక్ష్యం చేసిన కొబయాషి.. హైస్కూళ్లోనే డ్రాపౌట్ అయ్యాడు. ఉన్నత విద్యనభ్యసించి కొడుకు ప్రయోజకుడైతే చూడాలనుకున్న అతడి తల్లిదండ్రులు కొబయాషి తీరుతో ఎంతో బాధపడ్డారు. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకుని అతడి చదువు కోసం పొదుపు చేసిన డబ్బుకు విలువ లేకుండా పోయిందని, కొబయాషి ఇకపై బాగుపడడు అనే బాధ వారిని వెంటాడింది. ఆ కోపంలోనే అతన్ని ఇంట్లో నుంచి గెంటేశారు. అలా 17 ఏళ్ల వయస్సులో కొబయాషి ఇల్లు విడిచాడు. టోక్యోలోని వీధులే అతడికి ఆశ్రయమిచ్చాయి. వానకు తడవడం, చలికి వణికకడం అతడికి అలవాటుగా మారాయి. అప్పుడు కార్డుబోర్డులే అతడికి దుప్పట్లు అయ్యాయి. అలా ఏడాదిన్నర పాటు ఏ దిక్కు లేక కాలం వెళ్లదీశాడు కొబయాషి. అయినప్పటికీ, సంగీతాన్ని మాత్రం వదల్లేదు. అలాంటి సమయంలో కొబయాషిలోని ప్రతిభను గుర్తించిన ఓ లైవ్ మ్యూజిక్ క్లబ్ మేనేజర్ అతడికి పిలిచి మరీ ఉద్యోగమిచ్చాడు. ఆరేళ్లపాటు కోబయాషి అక్కడే పనిచేశాడు. కానీ అదొక్కటే జీవితం కాదని అతనికి అర్థమైంది. సంగీతంతో ఒక్కటే కాదని, మంచి ఉద్యోగం అవసరమని నిర్ణయించుకున్నాడు. కోరుకున్నఉద్యోగం దొరికేంత వరకు నిలదొక్కుకోవడానికి ఆన్లైన్ మ్యూజిక్ రికార్డులతో కొంత డబ్బు పోగు చేసుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగ ప్రకటనల వేట మొదలుపెట్టాడు. అలా 2012లో వియత్నాం చేరుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతడికి ఓ సువర్ణావకాశం వచ్చింది. ఎటువంటి అకడమిక్ అర్హతల అవసరం లేకుండానే ఓ కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందే వెసులుబాటు కల్పించింది. అందుకోసం ఆరు గంటల పరీక్ష.. మాథమెటికల్ స్కిల్స్‌తో పాటు లాజికల్ థింకింగ్, ఐక్యూ టెస్టు నిర్వహించగా.. కొబయాషి అన్నింటిలో పాసయ్యాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం. కానీ కొబయాషి ఆ ఉద్యోగంతోనే సరిపెట్టుకోలేదు.‘‘సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మందే ఉంటారు. కానీ సరికొత్త బిజినెస్ మోడల్స్‌తో ముందుకు వెళ్లేవారు చాలా అరుదుగా ఉంటారనే ఆలోచనే అతనితో ఓ స్టార్టప్ స్థాపనకు దారి తీసింది. అక్కడే పనిచేసే మకాటో హిరాయి కూడా కొబయాషికి జతయ్యాడు. వారితో పాటు మరికొంత మంది. అంతాకలిసి 2013 మార్చిలో ఫ్రామ్గియా ఇన్కార్పొరేషన్ పేరిట స్టార్టప్ స్థాపించారు. తర్వాత దాని పేరును సన్ అస్టెరిస్క్గా మార్చారు. వియత్నాంలోని యువతకు పెద్దపీట వేశారు. స్టార్టప్‌లకు ఐడియాలు ఇవ్వడం, ఇప్పటికే నిలదొక్కుకున్న కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చేయడం లక్ష్యంగా ఈ కంపెనీని స్థాపించారు. అందులో విజయవంతమయ్యారు. 70కి పైగా క్లైంట్లు ఉన్నారు. టోక్యో స్టాక్ ఎక్స్చేంజీలో కొబయాషీ కంపెనీ లిస్ట్ అయ్యింది. సెప్టెంబరు నాటికి దాని మార్కెట్ విలువ 1.4 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఆ తర్వాత కొన్ని ఒడిదొడుకులు ఎదురుకావడంతో ఇప్పుడు దాని విలువ 1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆ కంపెనీలో కొబయాషి వాటా 7.9 శాతం. విలువ 71 మిలియన్ డాలర్లు. ఇప్పుడు తనే ఆ కంపెనీ సీఈఓ. ఇప్పుడు అతని వయస్సు 37 ఏళ్లు. అలా ఓ స్థాయికి చేరుకున్న తర్వాత కొబయాషి 2019లో జపాన్‌కు చేరుకున్నాడు. అక్కడా తమ కంపెనీని విస్తరించాడు. ఇప్పుడు టోక్యో ఆఫీసులో 130 మంది ఉద్యోగులు, వియత్నాంలో 1300 ఉద్యోగులు ఉన్నారు. అతడి స్ఫూర్తితో ఇప్పుడు జపాన్‌లో చాలా మంది స్టార్టప్‌లు పెడుతున్నారు. ఇక బిజినెస్‌మెన్‌గా సక్సెస్ అయిన కొబయాషి తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కొబయాషి జీవితంలో అది పెద్దలోటు. ‘‘నాకప్పుడు అంతా నరకంలా అనిపించేది. కానీ వాటిని నేను అధిగమించాను. డ్రాపౌట్ అయిన నన్ను ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నారు నా తల్లిదండ్రులు. నేను ఇల్లు వీడాను.. అంతే. నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు అదే చేశాను. టోక్యోలోని షింజుకు, శిబుయా జిల్లాలోని వీధుల్లో గడిపాను. నిజానికి ఆ చలికి నేను చచ్చిపోయేవాడినే. ఎక్కడ చోటు దొరికితే అక్కడ నిద్రించేవాడిని’’అని కొబయాషి పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. అయితే ప్రతీసారీ అదృష్టం కలిసిరాదని, షేర్ మార్కెట్లో ఎత్తుపల్లాలు సహజం కాబట్టి అంతగా ఆనంద పడాల్సిన అవసరం లేదంటూ వ్యాపార ప్రత్యర్థులు హెచ్చరించినా తాను జీవితంలో ఇప్పటికే అతిపెద్ద కష్టాలు దాటి వచ్చానని, ఓటమి గురించి తానెప్పుడూ భయపడనని కొబయాషి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. తన కంపెనీని టాప్‌లో నిలబెట్టడమే లక్ష్యమని అందుకోసం ఎంతకైనా శ్రమిస్తానని చెప్పుకొచ్చాడు. రిస్కు చేయడంలోనే అసలైన మజా ఉందని పేర్కొన్నాడు. -
అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న కమలాహ్యారిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి భారతీయ సంతతి పార్లమెంటు సభ్యురాలు కమలా హ్యారిస్ తప్పుకున్నారు. 2020లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి తగినన్ని నిధులు లేకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. కాలిఫోర్నియా నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కమలా మంగళవారం ఓ కార్యకర్తకు ఫోన్ చేసిన సందర్భంలో ఈ విషయం తెలిసింది. ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజుతో ముగిస్తున్నానని, ఇందుకు చింతిస్తున్నానని 55 ఏళ్ల కమలా హ్యారిస్ మంగళవారం ఓ ట్వీట్ కూడా చేశారు. ఇంతకాలం తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు అని ట్వీట్లో పేర్కొన్నారు. -
విద్యార్థుల వికాసానికి ‘ఎర్త్’
విద్యా, కళలు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ మారుమూల గ్రామాలే దత్తత నిరాక్షరాస్యత, డ్రాప్ అవుట్స్ వద్దు సుల్తానాబాద్ : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఎర్త్ ఫౌండేషన్ ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుతున్న విద్యలో సమూలమైన మార్పులు తేవడానికి తమవంతు ప్రయత్నం చేస్తోంది. కరీంనగర్, నల్గొండ జిల్లాలోని పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు చేయూతనందిస్తోంది. డ్రాప్ అవుట్స్, నిరాక్షరాస్యత, పేదరికంతో బడులకు వెళ్లకుండా ఉన్నవారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించే బాధ్యత తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. 2012 ఏప్రిల్ 18న అమెరికాలో స్థిరపడ్డ కరీంనగర్‌కు చెందిన ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఎర్త్ ఫౌండేషన్‌ను స్థాపించారు. తానుచేసిన సహాయం స్వచ్ఛంద సంస్థల ద్వారా విద్యార్థులకు అందడంలేదని భావించి ఆయన ఈ ఫౌండేషన్ ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు. పేదరికంలో ఉండి చదువుకోలేని పిల్లలకు సాయమందించడమే ప్రధాన ఉద్దేశం. పిల్లలకు జిల్లాలో సుల్తానాబాద్ మండలం భూపతిపూర్, గర్రెపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీకాలనీ, పెద్దరాతుపల్లి, ముత్తారం మండలకేంద్రం, మల్యాల మండలం లంబాడిపల్లెలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు నల్గొండ జిల్లా భీమ్‌నగర్ మండలం రాఘవపూర్, చౌట్పల్లి మండలం మల్కాపూర్ గ్రామాల్లో పాఠశాలలను ఫౌండేషన్ దత్తత తీసుకుంది. విద్యావలంటీర్లతో బోధన చేయిస్తున్నారు. 70 మంది స్వచ్ఛందంగా సేవ చేస్తుండగా.. 38 మంది వలంటీర్లకు గౌరవవేతనం సంస్థ ఇస్తోంది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, టైలు, బెల్టులు, బ్యాడ్జీలు అందిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. పాఠశాలల్లో నెలకోసారి వైద్యశిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తున్నారు. తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వీరిసేవల ద్వారా 570 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అమెరికాలో ఉంటున్నఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రమోద్‌కుమార్‌రెడ్డి అందిస్తున్నారు. నైపుణ్యాన్ని వెలికితీసేందుకే... విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యత వెలికితీసి విద్యావంతులను చేయడమే ఎర్త్ ఫౌండేషన్ ఉద్దేశం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మావంతు ప్రయత్నం చేస్తున్నాం. దత్తత తీసుకున్న పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన దుస్తులు, పాఠ్యపుస్తకాలు, బెల్టులు అందిస్తున్నాం. –కలవేని శ్రీనివాస్, రాష్ట్ర కోఫౌండర్, కరీంనగర్ తల్లిదండ్రులతో సమావేశాలు పాఠశాలల అభివృద్ధికి చేయూతనిస్తున్నాం. తల్లిదండ్రులను చైతన్యవంతం చేసేందుకు ఎస్ఎంసీ సమావేశాలు నెలవారీగా నిర్వహిస్తున్నాం. పిల్లలకు వైద్యపరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్, మొక్కలపెంపకం వంటి కార్యక్రమాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వెన్నెల, కోఆర్డినేటర్, భూపతిపూర్ గోడలపై పెయింటింగ్.. ఎర్త్ ఫౌండేషన్ దత్తత తీసుకున్న పాఠశాలలో గోడలపై విద్యార్థులకు అర్థమయ్యేలా ఆకర్షణీయమైన రంగులతో పలు బొమ్మలు వేస్తున్నాం. జాతీయ చిహ్నాలు, మానవ ఆకృతులు, అక్షరమాలలు, శరీరంలోని విడివిభాగాలను వేసి అవగాహన కల్పిస్తున్నాం. –హేమవతి, వాలంటీర్, భూపతిపూర్ ప్రైవేటుకు దీటుగా బోధన ప్రైవేటు పాఠశాలల మాదిరిగా మాకు దుస్తులు ఇచ్చారు. ఆంగ్లంలో విద్యా బోధన చేస్తున్నారు. నెలకు ఒకసారి పేయింటింగ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ప్రభుత్వ పాఠశాలలో చెబుతున్నారు. –చిట్టి, అయిదో తరగతి విద్యార్థిని, భూపతిపూర్ -
ఆ డ్రాపవుట్ రచనలతో ఐదు పీహెచ్ డీలు
న్యూ ఢిల్లీః అతడు కేవలం పాఠశాల చదువుకూడ పూర్తి చేయలేదు. అయితేనేం రచయితగా అత్యంత ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఒడిషాకు చెందిన ఆయన రచనలు ఐదుగురు పరిశోధనా విద్యార్థులకు ఆధారంగా మారాయి. కోస్లీ భాషా పండితుడు, కవి, 66 ఏళ్ళ హల్దార్ నాగ్ ఎన్నో పురాణాలకు గుర్తుగా పద్యాలు రాసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన రచనలు ప్రస్తుతం సంబల్పూర్ విశ్వవిద్యాలయ సిలబస్ లో భాగమయ్యాయి. హల్దార్ గ్రంథబాలి-2 పేరున విశ్వవిద్యాలయం వాటిని సంగ్రహించింది. హల్దార్ తన రచనలను ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తుంటాడు. తాను వల్లించిన పద్యాలను వల్లెవేస్తుంటాడు. కనీసం రోజుకు మూడు నాలుగు ప్రత్యేక కార్యక్రమాలకు హాజరౌతుంటాడు అంటూ అతడి సన్నిహితుడు, కవి నాగ్ చెప్తున్నారు. హల్దార్ రచించిన కోస్టీ భాషలోని పద్యాలు యువకులను అమితంగా ఆకట్టుకుంటాయని, ప్రతివారు కవులు అయినప్పటికీ.. కొందరు మాత్రమే వాటికి ఓ ప్రత్యేక రూపును ఇవ్వగల్గుతారని అదే వారిలోని కళను ప్రస్ఫుటింప జేస్తుందని హల్దార్ సన్నిహితుడు నాగ్ చెప్తున్నారు. కనీసం కాళ్ళకు చెప్పులు కూడ ధరించని హల్దార్... ఎప్పుడూ తెల్లని పంచె, చొక్కా వేసుకుంటాడని, పైగా అలా వేసుకోవడం తనకిష్టమని చెప్తాడు. ఒరిస్సాలోని బర్ఘర్ జిల్లాలోని ఓ పేద కుటుంబంలో 1950 లో పుట్టిన హర్దార్... కేవలం మూడో క్లాసు వరకే పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ అతడు బడికి హాజరు కాలేదు. పదేళ్ళ వయసులో తండ్రిని కోల్పోవడంతో కుటుంభ భారాన్ని నెత్తికెత్తుకున్న అతడు... తప్పని పరిస్థితిలో ఓ మిఠాయి దుకాణంలో పనికి (డిష్ వాషర్) చేరాడు. రెండేళ్ళ తర్వాత ఓ గ్రామపెద్ద అక్కడో హైస్కూలు స్థాపించాడు. అదే గ్రామంలో హల్దార్ పదహారేళ్ళపాటు వంటవాడిగా పనిచేశాడు. ఆ తర్వాత అక్కడ అనేక పాఠశాలలు వెలిశాయి. దీంతో హల్దార్ ఓ బ్యాంకును సంప్రదించి వెయ్యి రూపాయల లోన్ తీసుకొని ఓ చిన్న స్టేషనరీ షాప్ తో పాటు పాఠశాల విద్యార్థులకోసం తినుబండారాల అమ్మకం ప్రారంభించాడు. ఇదే సమయంలో హల్దార్ 'దోడో బర్గాచ్' (పురాతన మర్రిచెట్టు) అంటూ తన మొదటి పద్యాన్ని రాశాడు. 1990 ప్రాంతంలో అతడు రాసిన ఆ పద్యం స్థానిక పత్రికలో ప్రచురించారు. ఆ తర్వాత వరుసగా నాలుగు పద్యాలు రాసి పంపితే అవి కూడ అచ్చయ్యాయి. అనంతరం అతడి పద్యాలకు సమీప గ్రామాల్లోనూ భారీ స్పందన వచ్చింది. అక్కడే అతడి ప్రస్థానం మొదలైంది. ఆ ప్రోత్సాహం నేడు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేర్చింది. హల్దార్ నాగ్ ను ఒడిస్పాలో లోక్ కబీ రత్నగా పిలుస్తారు. ఎక్కువగా ప్రకృతి, సమాజం, పురాణాలు, మతం వంటివే అతడి పద్యాలకు ప్రధానాంశాలు. అయితే ఎన్నోసార్లు అతడి రచనలకు సమాజం నుంచి వ్యతిరేకత కూడ ఎదురైంది. నా దృష్టిలో కవిత్వం వాస్తవ జీవితానికి అద్దం పడుతుందని, ప్రజలకు సందేశాన్ని అందించేదిగా ఉండాలని హల్దార్ నాగ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. -
అధ్వాన్నం
సాక్షి, అనంతపురం : విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు డ్రాపౌట్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మధ్యాహ్న భోజన’ పథకం జిల్లాలో చతికిల పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రభుత్వ మెనూ అటకెక్కింది. అధిక శాతం స్కూళ్లలో నీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 63 మండలాల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరును గురువారం ‘సాక్షి’ పరిశీలించగా ఈ విషయం బహిర్గతమైంది. ఇక మంగళవారం, శుక్రవారం విద్యార్థులకు గుడ్డు/అరటిపండు అందించాలన్న నిబంధనను పాటించడం లేదని తెలిసింది. అటకెక్కిన పౌష్టికాహారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 4107 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. 3,79,078 మంది విద్యార్థులకు గానూ 3,60,124 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. ఈ పాఠశాలల్లో అనంతపురం పట్టణంలో ఒక పాఠశాలతో కలుపుకుని రూరల్ పరిధిలో దాదాపు 25 పాఠశాలల్లో ఇస్కాన్ ద్వారా భోజనం వడ్డిస్తుండగా.. మిగిలిన పాఠశాలల్లో అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్న ఏజెన్సీలే భోజనం చేస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా తాజా కూరగాయలు, ఆకుకూరలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి 100 గ్రాముల అన్నం, 20 గ్రాముల పప్పు దినుసులు, 50 గ్రాముల కూరగాయలు, 5 గ్రాములు నూనెతో కూడి న భోజనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 150 గ్రాముల అన్నం, 30 గ్రాముల పప్పు దినుసులు, 75 గ్రాముల కూరగాయలు, 7.05 గ్రాముల నూనెతో కూడుకున్న భోజనాన్ని వడ్డించాల్సి ఉంది. అయితే ఎక్కడా కూడా నిర్వాహకులు ఈ విధమైన భోజనాన్ని అందించడం లేదు. నీటి వసతి లేక ఇబ్బందులు మధ్యాహ్న భోజనం అమలౌతున్న పాఠశాలల్లో నీటి వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భోజనం చేసే సమయంలో ముద్ద అడ్డం పడుతుండడంతో విద్యార్థులు నీళ్ల కోసం బోరింగుల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. జిల్లాలో దాదాపు 195 పాఠశాలల్లో నీటి వసతి లేదని అధికారులు చెబుతున్నా వాస్తవానికి 600 పాఠశాలల వరకు నీటి వసతి లేదని తెలుస్తోంది. ఇక పైపులైన్లు, నీటి ట్యాంకులు ఉన్న పాఠశాలల్లో సైతం నీటి కొరత కారణంగా పైపులైన్లు చిలుముపట్టి, ట్యాంకులు ఎండిపోయి దర్శనమనిస్తున్నాయి. విద్యార్థులకు మినరల్ వాటర్ అందజేయాలన్న ఉద్దేశంతో జలనిధి పథకం కింద పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్ఓఆర్ ప్లాంట్లు అప్పుడే మూలనపడిపోయాయి. సరిపడని నిధులు గత విద్యా సంవత్సరం వరకు మధ్యాహ్న భోజనానికి మంజూరౌతున్న నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని వంట ఏజెన్సీలు గగ్గోలు పెట్టాయి. ఇందుకు స్పందించిన కిరణ్ ప్రభుత్వం నిధులు పెంచింది. ఈ నిధులకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలకు పొంతన లేకుండా పోయింది. దీనికి తోడు కొన్ని పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్లపై వంట చేస్తుండడంతో సిలిండర్ల కొరత వల్ల బహిరంగ మార్కెట్లో ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా ఖర్చు చేసిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు వంట ఏజెన్సీలు గత్యంతరం లేక పిల్లలు తినే మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గిస్తూ పిల్లల పొట్టలు కొడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 28న ప్రభుత్వం విడుదల చేసిన జీవోఎంఎస్ నెంబర్ 52 ప్రకారం అయిదో తరగతి వరకు పిల్లలకు రూ.4 మొత్తాన్ని రూ.4.35 గాను, 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.5 ఉన్న మొత్తాన్ని రూ.6కు పెంచి చెల్లిస్తున్నారు. 25 మందిలోపు పిల్లలు ఉంటే ఒకరికి, 25కు మించి 50 మందికి లోపు పిల్లలు ఉంటే ఇద్దరికి అలా..ప్రతి 25 మంది పిల్లలకు ఒక ఉద్యోగికి రూ.1000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. అయితే మెనూలో మాత్రం ఏ మార్పు లేదు.