అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న కమలాహ్యారిస్‌ | Indian origin senator Kamala Harris drops out of 2020 US presidential race | Sakshi
Sakshi News home page

అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న కమలాహ్యారిస్‌

Published Thu, Dec 5 2019 5:30 AM | Last Updated on Thu, Dec 5 2019 5:30 AM

Indian origin senator Kamala Harris drops out of 2020 US presidential race - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి భారతీయ సంతతి పార్లమెంటు సభ్యురాలు కమలా హ్యారిస్‌ తప్పుకున్నారు. 2020లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి తగినన్ని నిధులు లేకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. కాలిఫోర్నియా నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కమలా మంగళవారం ఓ కార్యకర్తకు ఫోన్‌ చేసిన సందర్భంలో ఈ విషయం తెలిసింది. ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజుతో ముగిస్తున్నానని, ఇందుకు చింతిస్తున్నానని 55 ఏళ్ల కమలా హ్యారిస్‌ మంగళవారం ఓ ట్వీట్‌ కూడా చేశారు. ఇంతకాలం తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement