కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ యువకుడు తన స్నేహితుడి సాయంతో రూ.25,000 పెట్టుబడితో వ్యాపారం సాగించి మూడేళ్లలో ఏకంగా రూ.33.61 కోట్ల వ్యాపారాన్ని విస్తరించాడు. అసలు కాలేజీ డ్రాపవుట్ అయ్యాక తాను ఏ బిజినెస్ ఎంచుకున్నాడు.. తన వ్యాపారాన్ని ఎలా విస్తరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.
డారియన్ క్రెయిగ్(31) కొన్ని కారణాల వల్ల కాలేజ్ డ్రాపవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇళ్లు గడవడం ఇబ్బందిగా ఉండడంతో చిన్న ఉద్యోగం చేరాడు. ఒకరోజు ఆఫీస్‌కు వచ్చిన క్రెయిగ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. తాను ఉద్యోగం కోల్పోయే నాటికి తన బ్యాంకు అకౌంట్లో కేవలం 7 డాలర్లు(రూ.600) ఉన్నాయి. తాను ఎలాగై జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం తన చిన్ననాటి స్నేహితుడు బ్రాండన్ ఎకోల్స్ సాయంతో 300 డాలర్లు(రూ.25,000) అప్పుచేసి వ్యాపారం మొదలు పెట్టాడు. ‘వైఆల్ స్వీట్ టీ’ పేరుతో టీ బిజినెస్ ప్రారంభించాడు. 2021లో మొదలుపెట్టిన ఈ వ్యాపారం అభివృద్ధి చెంది మూడేళ్లలో ఏటా రూ.33.61 కోట్ల ఆదాయం సమకూర్చే స్థాయికి ఎదిగింది.
వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి విశేష ఆదరణ
యునైటెడ్ స్టేట్స్‌లో కార్యకలాపాలు సాగించే ఈ సంస్థ ద్వారా నేరుగా వినియోగదారులకు తమ టీ ఉత్పత్తులను అందిస్తున్నారు. సుమారు 600 రిటైల్ అవుట్‌లెట్లతో వ్యాపారం సాగిస్తున్నారు. విభిన్న ఫ్లేవర్లలో టీను అందిస్తున్నారు. ఇటీవల క్రెయిగ్, ఎకోల్స్ తమ కంపెనీ విస్తరణకు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల సాయం కోరగా విశేష ఆదరణ లభించిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతా
కష్టాలు సహజం.. సరైన నిర్ణయాలు ముఖ్యం
ఉద్యోగం రాలేదనో, డబ్బు లేదనో, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనో చాలా మంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ క్రెయిన్, ఎకోల్స్‌లాగా జీవితంలో కష్టపడి ఎదుగుతున్నవారు కోట్లల్లో ఉన్నారు. కాబట్టి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment