అంకిత భావం, ఓర్పు పట్టుదలగా ప్రయత్నించాలే గానీ విజయం వంగి సలాం చేయాల్సిందే. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పేదింటి రైతు బిడ్డ పడిన శ్రమ, చేసిన కృషి గురించి తెలుసుకుంటే ఈ మాటలు అక్షర సత్యాలు అంటారు. 13 ఏళ్లకే ఐఐటీ ర్యాంక్ సాధించి, 24 ఏళ్లకే యాపిల్ కంపెనీలో చేరిన సత్యం కుమార్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందామా!
బిహార్(Bihar)కు చెందిన సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు సత్యం కుమార్ (Satyam Kumar). చిన్నప్పటి నుంచీ తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చకున్నాడు. అయితే పేదరికం కారణంగా చదువు చాలా కష్టంగామారింది. మేనమామ, స్కూలు టీచర్ సాయంతోదీక్షగా చదువుకున్నాడు. కేవలం 13 సంవత్సరాల వయస్సులో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈ ర్యాంక్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
2012లో, అతను ఆల్-ఇండియా ర్యాంక్ 8,137 సాధించి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అయితే, అతను మళ్లీ మళ్లీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక సంవత్సరం తరువాత, అతను మళ్ళీ పరీక్ష మరియు పరీక్షలో ఎక్కువ ర్యాంక్ సాధించాడు.2013లో 13 ఏళ్ల వయసులో కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు పొందిన సత్యం, 679 ర్యాంక్ సాధించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు (మునుపటి రికార్డు సహల్ కౌశిక్ పేరిట ఉంది అతను 14 సంవత్సరాల వయస్సులో ఈ ఘనతను సాధించాడు). 2013లో ఐఐటీలో 679 ర్యాంక్ తో ఐఐటీ కాన్పూర్( IIT Kanpur) నుంచి 2018 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు. ఇక్కడ చదువుకునే సమయంలోనే మూడు ప్రాజెక్ట్ లపై సత్యం కుమార్ వర్క్ చేసిన ప్రశంలందుకోవడం విశేషం.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సంయుక్త BTech-MTech కోర్సు, అమెరికాలోని ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం PhDని పూర్తిచేశాడు. ఆ తరువాత కేవలం 24 సంవత్సరాల వయస్సులో Appleలో ఉద్యోగం చేసాడు. అక్కడ, అతను ఆగస్టు 2023 వరకు మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా పనిచేశాడు.అలాగే యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేజెస్ స్పెషలైజేషన్‌తో పనిచేశాడు.రాజస్థాన్‌లోని కోటలోని మోడరన్ స్కూల్‌లో చదువుతున్న సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పశుపతి సింగ్, సత్యం ప్రతిభను గుర్తించారు. అందుకే IIT ప్రవేశ పరీక్ష,కోచింగ్ ఖర్చులను వర్మ స్వయంగా భరించారని సత్యం మేనమామ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో తన రాష్ట్రంలోని పేద విద్యార్థులకు చదువు నేర్పించాలని భావిస్తున్నాడు సత్యం. సత్యం సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment