
మోదీ , హోంమంత్రి రామలింగారెడ్డి
సాక్షి, బెంగళూరు: మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్ ఏం మాట్లాడుతున్నారో అతనికే తెలియడం లేదని హోంమంత్రి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీలో స్థానం నిలుపుకునే ఉద్దేశంతో ఏదో ఒకటి మాట్లాడిందే పదేపదే చెబుతున్నారని విమర్శించారు.
మూడేళ్ల క్రితం బీబీఎంపీ ఫలితాల గురించి తాను తప్పుగా మాట్లాడినట్టు వార్త పత్రికలో ప్రచురితమైందని ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీబీఎంపీ వార్డుల్లో కాంగ్రెస్‌కు పూర్తిగా మద్దతు పలికారని తెలిపారు. అయితే బీజేపీ వారు మాత్రం తామే తెలివైన వారిగా గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలే తెలివైన వారనే విషయాన్ని గమనించాలని సూచించారు. ఈసందర్భంగా ఆయన బీజేపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీ ప్రతాపాలు ఇక్కడ కాదు.. మోదీ ముందు చూపించండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment