
మచ్చా రామలింగారెడ్డి సాయిబాబాగా నటించి, నిర్మించిన చిత్రం ‘ప్రత్యక్ష దైవం షిరిడి సాయి’. కొండవీటి సత్యం దర్శకత్వంలో దత్త ఫిలింస్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా పాటలను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘షిర్డీ సాయిబాబా జీవితం ఎందరినో ప్రభావితం చేసింది. సాయిబాబా పాత్రకు రామలింగారెడ్డి కరెక్టుగా సరిపోయారు. బాబా లీలలను సత్యం చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు.
‘‘ఈ సినిమాని ముందు వేరేవాళ్లు ప్రారంభించి, ఆపేశారు. బాబా దయవల్ల ఇదే సినిమాను కొండవీటి సత్యం దర్శకత్వంలో నిర్మించాను. బాబా గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను చూపించాం’’ అన్నారు మచ్చా రామలింగారెడ్డి. ‘‘బాబా దయతో సినిమాని అందరూ మెచ్చే విధంగా తెరకెక్కించాను’’ అన్నారు కొండవీటి సత్యం.
Comments
Please login to add a commentAdd a comment