ముంబై: ఆలయాల్లోనూ, ప్రజానీకం దగ్గర నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని కొనుగోలు చేసి, బులియన్ కింద మార్చే యోచనేదీ లేదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటును (క్యాడ్) కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ.. ఆలయాలు సహా ఇతరత్రా వర్గాల దగ్గరున్న పసిడిని కొనుగోలు చేసి బులియన్ కింద మార్చాలని భావిస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, వెళ్లే నిధుల మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పేర్కొంటారు.