
అభివృద్ధి-అణిచివేతకి మధ్య పోరు
మెదక్: నారాయణఖేడ్ ఉప ఎన్నికలు అభివృద్ధి-అణిచివేతకి మధ్య జరుగుతున్న పోరాటమని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. నారాయణఖేడ్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ... బెదిరింపులకు పాల్పడుతున్న పార్టీలను సాగనంపాలని, ప్రజలకు అండగా తాముంటామన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ బండారం బయటపడుతుందని ఆగమాగమవుతున్నారని హరీష్ ఎద్దేవా చేశారు.