సోమవారం సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో ఇంద్రకరణ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు
సిద్దిపేటజోన్: తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం ముఖం పెట్టుకుని బస్సుయాత్ర చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పంథా ఏ మాత్రం మారలేదన్న విషయం ఇటీవల కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేశ్ మాటలతో అర్థమవుతోందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తామని జైరాం అనడాన్ని హరీశ్ ఖండించారు. తాము ఏపీకి వ్యతిరేకం కాదని, అయితే ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు రెండు రాష్ట్రాలూ సమానమన్న విషయాన్ని విస్మరించి జైరాం ఏకపక్షం గా వ్యాఖ్యలు చేయడాన్ని మాత్రమే తప్పుబ డుతున్నామన్నారు. సోమవారం హరీశ్‌రావు సిద్దిపేటలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్‌తో కలసి విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నా ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రశ్నించక పోవ డం దారుణమన్నారు.
తెలంగాణలో బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతలు అధిష్టానం వ్యాఖ్యలను సమర్థిస్తారా? ఖండిస్తారా? చెప్పాలన్నారు. అప్పుడే బస్సు యాత్ర చేయా లన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. పోలవరానికి జాతీయ హోదాను కట్టబెట్టి, వెనకబడిన తెలంగాణ ప్రాజెక్ట్ అయిన అప్పటి ప్రాణహిత– చేవెళ్లకు మొండిచెయ్యి చూపిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అప్పు లు తెచ్చి కడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించడాన్ని మంత్రి ఖండించారు. ఆనాడు ప్రాణహితను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తిస్తే కేంద్రం నుంచి నిధులు వచ్చేవన్నారు. ఎనిమిదేళ్ల పాటు ప్రాణహితకు సీడబ్ల్యూసీ అనుమతులు, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. ఆ తప్పును సరిదిద్దేందుకే ఇప్పుడు అప్పుచేసైనా కాళేశ్వరం ప్రాజెక్టును కడుతున్నామన్నారు.
తెలంగాణను అవమానించినట్లే..
తలుపులు మూసి పార్లమెంట్‌లో విభజన బిల్లు పాస్ చేశారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీని కోరినా, తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో డిమాండ్ చేసినా, ఉమాభారతి, గడ్కరీకి వినతిపత్రాలు అందజేసినా న్యాయం జరగలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment