jairamramesh
-
అస్సాం సీఎం పచ్చి అవకాశవాది
డిస్పూర్ : మేనిఫెస్టో భారత్‌లో ఎన్నికల కోసం కాదని పాకిస్థాన్‌కు సంబంధించిన మేనిఫెస్టో అంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అస్సాం సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమంత బిశ్వకు రాజకీయబిక్ష పెట్టింది కాంగ్రెసేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో హిమంత్ బిశ్వకు గుర్తింపు, హోదా తమ పార్టీ ఇచ్చిందని అన్నారు. జై రాం రమేష్ పీటీఐ ఇంటర్వ్యూలో అధికారం కోల్పోయిన మరుక్షణం హిమంత్ బిశ్వ బీజేపీలో చేరారని అన్నారు. అస్సాం సీఎం తరుణ్ గోగోయ్ బాధ్యతలు చేపట్టినంత కాలం దాదాపూ 15ఏళ్ల పాటు హిమంత్ బిశ్వకు గుర్తింపు, సముచిత స్థానం కల్పించడంతో పాటు అధికారం ఇచ్చిందని గుర్తు చేసిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ఆయన పార్టీకి ద్రోహం చేశారన్నారు. ఇలాంటి వారికి బాధ్యతలు అప్పగించడం చాలా బాధాకరం. పదవులు అవకాశవాదంగా మారాయి. కానీ అవి మా ఆత్మవిశ్వాసాన్ని ఛిన్నాభిన్నం చేయలేదు అని అన్నారు. అవకాశవాదులు కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం వల్ల మంచే జరిగిందని, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన యువకులకు అవకాశం కల్పించినట్లువుతుందని జై రామ్ రమేష్ వ్యాఖ్యానించారు. -
ఆనంద్ మహీంద్రని మైమరిపించిన పులి వీడియో
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఓ పులి వీడియో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది. ఆ వీడియోను చూసిన ఆయన చిన్నప్పుడు దక్షిణ భారతంలో గడిపిన ఆనందక్షణాలను, తన బాల్య సమయాన్ని గుర్తుచేసుకున్నారు. జైరామ్ రమేష్ వాట్సాప్‌లో అందుకున్న ఈ వీడియోలో.. పులి ఓ ఇంటి పెరట్లో.. నీటితో నిండిన తొట్టెను చూసి, కాసేపు టబ్ చుట్టూ తిరుగుతూ, దాని చుట్టూ సంకోచంగా చూస్తూ, ఆపై వెంటనే నీటిలోకి దిగి కొద్దిసేపు సేదతీరింది. దాని పాదాలను తొట్టి అంచుకు ఉంచి త్వరగా తప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నా అన్నట్లు ఫోజ్ పెట్టింది. What an unusual occurrence. Apparently in Coorg. Received from a friend on WhatsApp. pic.twitter.com/C7yEF6fjAW — Jairam Ramesh (@Jairam_Ramesh) December 7, 2020 ‘ఓ అరుదైన సంఘటన’ అని జైరామ్ రమేష్ డిసెంబర్ 7న ట్వీట్ చేశారు. మూడు రోజుల తరువాత ఈ వీడియోను చూసిన మహీంద్ర గ్రూప్ చైర్మెన్ రీట్వీట్ చేశారు. సెలవుల్లో నాగర్హోల్ ఆభయారణ్యం నుంచి ఆరు మైళ్ల దూరంలో ఉన్న కొడగులో తాను గడిపిన బాల్య క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పటి వరకు పులిని చూసిందే లేదని, ఇందులో అతను ఇంకో దాన్ని చూడాలి అనుకుంటునన్నాడో లేదా తన కొడుగు రోజులను గుర్తు చేసుకుంటున్నాడో అస్పష్టంగా ఉంది. ఎప్పుడు అలా పులి చూడకపోవడంతో ఇది అతనికి చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. పులి బాడీ మసాజ్‌కి నీటి తొట్టెను ఉపయోగించడంతో అది ‘టికుజి’గా అయిందని ముగించారు. Spent most of my childhood holidays at our home in Kodagu, just six miles from Nagarhole game sanctuary. NEVER lucky enough to see a tiger. And this chap comes to someone’s home to use their ‘bathtub.’ Magnificent. When a Tiger uses a Jacuzzi it becomes a ‘Ticuzzi’ https://t.co/OjixxCEXJ2 — anand mahindra (@anandmahindra) December 10, 2020 -
మాజీ మంత్రి చెప్పింది నిజమే: అభిషేక్ సింఘ్వీ
న్యూఢిల్లీ: వరుస ఎన్నికల పరాజయాలతో కాంగ్రెస్ నాయకుల స్వరం మారుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఓ పుస్తకావిష్కరణ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ నరేంద్ర మోదీ పరిపాలనను వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రధాని పనితనాన్ని విశ్లేషించకుండా కేవలం విమర్శించడం ద్వారా పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్‌కు సింఘ్వీ పూర్తి మద్దతు పలికారు. విధానాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం మోదీకి సానుకూలంగా మారుతోందని సింఘ్వీ వ్యాఖ్యానించారు. గతంలో నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా విమర్శించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రభుత్వ విధానాలను, పనితీరును అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. -
ఉజ్వల తెలంగాణ దిశగా ప్రజాఫ్రంట్ పాలన
సంగారెడ్డి టౌన్: తెలంగాణలో కేవలం కేసీఆర్‌కు లాభం చేకూరిందని, బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తానని చెప్పి నాలుగున్నరేళ్లలో దివాళా తెలంగాణగా మార్చివేశారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించి ప్రజలు కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పంపనున్నారని, ఉజ్వల తెలంగాణ దిశగా ప్రజాఫ్రంట్ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డికి విచ్చేసిన ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు బాగు పడతారని సోనియా, మన్మోహన్‌సింగ్‌లు రాష్ట్రం ఏర్పాటు చేస్తే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగు పడిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కుటుంబ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని, ప్రజాఫ్రంట్ అధికారంలోకి వస్తే అందరికి లాభం చేకూరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లయినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, మోదీల్లాగా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇవ్వదని, మ్యానిఫెస్టోలో ఉన్నవి అన్నీ నెరవేర్చుతామన్నారు. ఈ ఎన్నికల్లో జగ్గారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, నియోజకవర్గంలో బలమైన నాయకుడు అధికారంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. తెలంగాణకు ప్రత్యేక హోదా కావాలని కేసీఆర్ ఏన్నాడూ అడగలేదన్నారు. మార్పు వస్తుంది.. వచ్చే నెల 7వ తేదీన ఎన్నికల్లో ప్రజల తీర్పుతో మార్పు వస్తుందని ప్రజాఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఢిల్లీకా రాస్తా హైదరాబాద్‌సే .. హైదరాబాద్‌కా రాస్తా సంగారెడ్డిసే షురూ హోగా అని కూటమి విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టో అమలు కోసం ప్రత్యేకంగా జిల్లాకో నాగరిక్ సమితిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హమ్ సంవేదన్ శీల్ ... సర్కార్ దేంగే అని తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ పనితీరు ఉంటుందన్నారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్, మోదీలు దొందూ దొందేనన్నారు. బీజేపీ టీఆర్ఎస్కు మద్దతు ఇస్తుందని, వారిద్దరికి ఎంఐఎం ఆక్సిజన్ అందిస్తుందని అన్నారు. ఈ పార్టీలతో కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తూ ఉంటుందన్నారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాగాంధీ, మన్మోహన్సింగ్ల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందన్నారు. అత్యవసరంగా తెలంగాణలో అవినీతిని, లంచగొడితనాన్ని అంతం చేయాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోదీ సైతం ఫాంహౌస్‌కు వెళ్తారని, బహుషా కేసీఆర్, మోదీ ఒకే ఫాంహౌస్‌కు పరిమితం అవుతారని ఎద్దేవా చేశారు. ఆంధ్రాకు ప్రత్యేక కేటగిరి.. తెలంగాణ విభజన సమయంలో ఆంధ్రకు ప్రత్యేక కేటగిరీ ఇస్తామని చెప్పామని ఆయన తెలిపారు. విభజన జరిగిన సమయంలో అందరి కళ్లు హైదరాబాద్‌పైనే ఉన్నాయని, హైదరాబాద్ తెలంగాణకే చెందాలని సోనియా, మన్మోహన్లు నిర్ణయించినట్లు తెలిపారు. విభజన సమయంలో హైదరాబాద్ ఆదాయం రూ.16వేల కోట్లు ఉండగా నేడు అది సుమారు రూ.25 వేల కోట్లు ఉందన్నారు. ఈ నిధులన్నీ తెలంగాణ ఖాతాల్లోకి వెళ్లినందున ఆంధ్రకు ఐదు సంవత్సరాల ప్రత్యేక కేటగిరి ఇస్తామని మన్మోహన్సింగ్ ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ సర్కార్ ఏర్పడితే 10 సంవత్సరాల ప్రత్యేక కేటగిరి ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామని వెంకయ్యనాయుడు పార్లమెంట్లో ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. తిరుపతి పర్యటనలో సైతం మోదీ అబద్ధాలు చెప్పారని, కేటగిరి ఇస్తామని మోసం చేశారన్నారు. వండివార్చిన బిర్యానీ.. తెలంగాణ ఏర్పడిన సమయంలో హైదరాబాద్ వండివార్చిన బిర్యానీగా ఉందని జైరాం తెలిపారు. హైదరాబాద్‌ను ఎన్టీఆర్, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులు అభివృద్ధి చేశారన్నారు. తయారుగా ఉన్న బిర్యానీ కేసీఆర్‌కు దొరికినప్పటికీ ఇప్పుడు స్పెషల్ కేటగిరిని ప్రశ్నించడం సరికాదన్నారు. దేశంలో ప్రత్యేక కేటగిరిలు ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులో ప్రభుత్వం ఇవ్వగలుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు మోదీ ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు మోదీని పొగిడిన కేసీఆర్ ఎన్నికలు ఉన్నాయన్న కారణంతో మోదీని విమర్శిస్తున్నారన్నారు. కేసీఆర్‌ది తెలంగాణ కాదని, ఆయన విజయనగరం నుంచి వచ్చిన సెటిలర్ అని గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో సంగారెడ్డి శాసనసభ అభ్యర్థి జగ్గారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజి అనంతకిషన్ తదితరులు ఉన్నారు. -
ఏం ముఖం పెట్టుకుని యాత్ర చేస్తున్నారు
సిద్దిపేటజోన్: తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం ముఖం పెట్టుకుని బస్సుయాత్ర చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పంథా ఏ మాత్రం మారలేదన్న విషయం ఇటీవల కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేశ్ మాటలతో అర్థమవుతోందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తామని జైరాం అనడాన్ని హరీశ్ ఖండించారు. తాము ఏపీకి వ్యతిరేకం కాదని, అయితే ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు రెండు రాష్ట్రాలూ సమానమన్న విషయాన్ని విస్మరించి జైరాం ఏకపక్షం గా వ్యాఖ్యలు చేయడాన్ని మాత్రమే తప్పుబ డుతున్నామన్నారు. సోమవారం హరీశ్‌రావు సిద్దిపేటలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీబీ పాటిల్‌తో కలసి విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నా ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రశ్నించక పోవ డం దారుణమన్నారు. తెలంగాణలో బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతలు అధిష్టానం వ్యాఖ్యలను సమర్థిస్తారా? ఖండిస్తారా? చెప్పాలన్నారు. అప్పుడే బస్సు యాత్ర చేయా లన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. పోలవరానికి జాతీయ హోదాను కట్టబెట్టి, వెనకబడిన తెలంగాణ ప్రాజెక్ట్ అయిన అప్పటి ప్రాణహిత– చేవెళ్లకు మొండిచెయ్యి చూపిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అప్పు లు తెచ్చి కడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించడాన్ని మంత్రి ఖండించారు. ఆనాడు ప్రాణహితను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తిస్తే కేంద్రం నుంచి నిధులు వచ్చేవన్నారు. ఎనిమిదేళ్ల పాటు ప్రాణహితకు సీడబ్ల్యూసీ అనుమతులు, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. ఆ తప్పును సరిదిద్దేందుకే ఇప్పుడు అప్పుచేసైనా కాళేశ్వరం ప్రాజెక్టును కడుతున్నామన్నారు. తెలంగాణను అవమానించినట్లే.. తలుపులు మూసి పార్లమెంట్లో విభజన బిల్లు పాస్ చేశారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీని కోరినా, తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో డిమాండ్ చేసినా, ఉమాభారతి, గడ్కరీకి వినతిపత్రాలు అందజేసినా న్యాయం జరగలేదన్నారు. -
మిగిలింది ఇద్దరే...
కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల్లో ఇద్దరే మిగిలారు. కేంద్రమంత్రులు జైరామ్ రమేష్, జెడీ శీలం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి జిల్లా మంత్రితో పాటు పలువురు శాసనసభ్యులు గైర్హాజరయ్యారు. జిల్లా మంత్రి పార్థసారథి ఇప్పటికే తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధం కావడంతో ఆయన రాలేదు. తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి, పామర్రు ఎమ్మెల్యే డీవై దాసు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిలి రవి కూడా గైర్హాజరయ్యారు. మిగిలిన నియోజకవర్గ ఇన్చార్జులు కూడా ఎవరూ ఆంధ్రరత్నభవన్ దరిదాపుల్లోకి రాలేదు. మంగళవారం విజయవాడ వచ్చిన జైరామ్ రమేష్‌కు రైల్వే స్టేషన్లో స్వాగతం పలికేందుకు కేవలం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిటీ కాంగ్రెస్ నేతలు అడపా నాగేంద్రం, మీసాల రాజేశ్వరరావు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత హోటల్‌కు వెల్లంపల్లి వచ్చి కలిశారు. సాయంత్రం ఆంధ్రరత్నభవన్లో జరిగిన సమావేశంలో కూడా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అంతా తానై వ్యవహరించగా, ఇద్దరు ఎమ్మెల్యేలు అంటీముట్టనట్లుగా ఉండిపోయారు. పలుమార్లు మైక్‌లో పిలిస్తేగాని వేదిక మీదకు వెళ్లలేదు. ఆ తర్వాత కూడా మాట్లాడమని చెప్పినా వారు మౌనంగానే ఉండిపోయారు. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పమంటారు... ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర మంత్రులను నిలదీశారు. కేంద్ర మంత్రి జెడీ శీలం మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు చిరు ఆగ్రహంతో ఉన్నారని, దీనికి కాంగ్రెస్ నేతలే కారణమంటూ మాట్లాడుతుండగా కార్యకర్తలు అడ్డు తగిలారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన తర్వాత ప్రజల వద్దకు వెళ్లి ఏం చెప్పాలంటూ వారు నిలదీశారు. దీంతో అసలు దోషి చంద్రబాబు నాయుడేనని, ముందుగానే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారంటూ తన వాదనను సమర్థించుకున్నారు. డౌన్‌డౌన్ నినాదాలు జైరామ్ రమేష్ విలేకరుల సమావేశం జరుగుతున్న సమయంలో బీసీ విద్యార్థి సంఘం నగర ప్రధాన కార్యదర్శి కె.హరీష్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు ఆంధ్రరత్న భవన్ ముందు నిరసన తెలిపారు. జైరామ్ రమేష్ డౌన్‌డౌన్, గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హరీష్‌ను బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లి అరెస్టు చేశారు. భద్రతావలయంలో ఆంధ్రరత్నభవన్ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ రాకతో ఆంధ్రరత్నభవన్ భద్రతావలయంలోకి వెళ్లింది. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన జైరామ్ రమేష్ ఎక్కడికెళ్లినా నిరసనలు వ్యక్తం అవుతుండటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయన బస చేసిన డీవీ మనార్ హోటల్ వద్ద కూడా భారీ బందోబస్తు నిర్వహించారు. ముగ్గురు ఏసీపీలతో వందలాది మంది పోలీసులను అక్కడ మోహరించారు. ఆంధ్రరత్నభవన్లోకి వెళ్లే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పంపించారు. జైరామ్ వ్యంగ్యాస్త్రాలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జైరాం రమేష్ ప్రసంగం ఆద్యంతం తెలుగువారిపై వ్యంగ్యాస్త్రాలతో సాగింది. సీమాంధ్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలో స్పష్టత ఇస్తారని భావించిన కాంగ్రెస్ శ్రేణులను ఆయన నిరుత్సాహపరిచారు. తెలుగు వారికి ఒక భాష రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు రాజధానులు ఏర్పడతాయని, మిగిలిన రాష్ట్రాలకు ఆ పరిస్థితి ఉండదన్నారు. సీమాంధ్రులకు అవకాశం ఇస్తే చార్మినార్‌లో రెండు మినార్లు కోరతారంటూ వ్యంగ్యాస్త్రాలు వేశారు. చివరికి అధిష్టానానికి వీర విధేయులుగా ఉన్న కేంద్ర మంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, పళ్లంరాజులపైనా తనదైన శైలిలో చమక్కులు విసిరారు. వారు ఉదయం లేచింది మొదలు హైదారాబాద్‌ను యూటీ చేయాలంటూ ‘ సుప్రభాతం, సహస్రనామ’ ప్రత్యేక మంత్రాలుగా జపించారని చెప్పారు. సీమాంధ్రకు కేంద్రం ఇచ్చే ప్యాకేజీల ఊసెత్తలేదు. -
అమ్మా... ధన్యవాదాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దర్శనం లభించింది. పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర మంత్రి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్‌తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, కుంజా సత్యవతి బుధవారం ఉదయం సోనియాను ఢిల్లీలోని ఆమె నివాసమైన 10జన్‌పథ్‌లో కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేయబోతున్న కాంగ్రెస్ అధినాయకురాలిని కలిసి ఖమ్మం జిల్లా ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేశామని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. దశాబ్దాల ఆకాంక్షను నెరవేరుస్తున్నందున జిల్లా ప్రజానీకమంతా రుణపడి ఉంటామని సోనియాకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అంతకు ముందు వీరంతా తెలంగాణ బిల్లుపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం సభ్యుడు జైరాంరమేశ్‌ను కలిశారు. భద్రాచలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్ర ప్రాంతంలో కలపవద్దని విజ్ఞప్తి చేశారు. పోలవరం ముంపు గ్రామాలను కూడా సీమాంధ్రలో కలిపేందుకు అక్కడ నివసించే ప్రజలు అంగీకరించడం లేదని జైరాంకు తెలియజేశారు.