డిస్పూర్ : మేనిఫెస్టో భారత్‌లో ఎన్నికల కోసం కాదని పాకిస్థాన్‌కు సంబంధించిన మేనిఫెస్టో అంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అస్సాం సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిమంత బిశ్వకు రాజకీయబిక్ష పెట్టింది కాంగ్రెసేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో హిమంత్ బిశ్వకు గుర్తింపు, హోదా తమ పార్టీ ఇచ్చిందని అన్నారు.
జై రాం రమేష్ పీటీఐ ఇంటర్వ్యూలో అధికారం కోల్పోయిన మరుక్షణం హిమంత్ బిశ్వ బీజేపీలో చేరారని అన్నారు. అస్సాం సీఎం తరుణ్ గోగోయ్ బాధ్యతలు చేపట్టినంత కాలం దాదాపూ 15ఏళ్ల పాటు హిమంత్ బిశ్వకు గుర్తింపు, సముచిత స్థానం కల్పించడంతో పాటు అధికారం ఇచ్చిందని గుర్తు చేసిందని తెలిపారు.
కానీ కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు ఆయన పార్టీకి ద్రోహం చేశారన్నారు. ఇలాంటి వారికి బాధ్యతలు అప్పగించడం చాలా బాధాకరం. పదవులు అవకాశవాదంగా మారాయి. కానీ అవి మా ఆత్మవిశ్వాసాన్ని ఛిన్నాభిన్నం చేయలేదు అని అన్నారు. అవకాశవాదులు కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం వల్ల మంచే జరిగిందని, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన యువకులకు అవకాశం కల్పించినట్లువుతుందని జై రామ్ రమేష్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment