న్యూఢిల్లీ: వరుస ఎన్నికల పరాజయాలతో కాంగ్రెస్ నాయకుల స్వరం మారుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఓ పుస్తకావిష్కరణ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ నరేంద్ర మోదీ పరిపాలనను వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రధాని పనితనాన్ని విశ్లేషించకుండా కేవలం విమర్శించడం ద్వారా పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్‌కు సింఘ్వీ పూర్తి మద్దతు పలికారు. విధానాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం మోదీకి సానుకూలంగా మారుతోందని సింఘ్వీ వ్యాఖ్యానించారు. గతంలో నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా విమర్శించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రభుత్వ విధానాలను, పనితీరును అధ్యయనం చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment