తూప్రాన్ మండలం రావెల్లికి నేడు మంత్రి హరీశ్‌రావు రానున్నట్లు టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తూప్రాన్: తూప్రాన్ మండలం రావెల్లికి నేడు మంత్రి హరీశ్‌రావు రానున్నట్లు టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రావెల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి గత ఆరు నెలల క్రితం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో విద్యుత్ శాఖ నుంచి మృతుడి కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరుచేసినట్లు తెలిపారు. ఈ చెక్కును మంత్రి చేతుల మీదుగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని టీఆర్‌ఎస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.