అభివృద్ధిలో గజ్వేల్‌ రోల్‌మోడల్‌ | gajewel is rollmodel for develpment | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో గజ్వేల్‌ రోల్‌మోడల్‌

Published Sat, Oct 1 2016 7:46 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
 

గజ్వేల్‌: గజ్వేల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రభాగాన నిలబెట్టడమే లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామాత్యులు హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం గజ్వేల్‌లో రూ.8.5 కోట్ల వ్యయంతో నాలుగు లేన్లుగా విస్తరిస్తున్న జాలిగామ బైపాస్‌ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంతానికి వరమని చెప్పారు. సీఎం కృషితో ఇప్పటికే గజ్వేల్‌ అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తుందని వెల్లడించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. గజ్వేల్‌ను అభివృద్ధిలో మోడల్‌గా చూపేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కనీస సౌకర్యాలు కరువై కొట్టుమిట్టాడిన గ్రామాలు నేడు కొత్తరూపును సంతరించుకుంటున్నాయని చెప్పారు.

‘మిషన్‌ భగీరథ’, మిషన్‌ కాకతీయ వంటి పథకాలు ప్రజల జీవనంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం రెండు కళ్లులా భావిస్తూ ముందుకు వెళ్తుందన్నారు. చివరగా మంత్రి పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ‘గడ’ ఓఎస్‌డీ హన్మంతరావు, టీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ నగర పంచాయతీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, వైస్‌ చైర్మన్‌ అరుణ, కమిషనర్‌ శంకర్‌, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ చిన్న మల్లయ్య, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ మండల శాఖ అధ్యక్షుడు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రావు, ఆకుల దేవేందర్‌, బెండ మధు, శ్యాంమనోహర్‌, కౌన్సిలర్లు బోస్‌, రాజ్‌కుమార్‌, వసీంఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement