gajwel constituency
-
హరీష్‌రావు ముందు కొత్త సవాల్.. బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ అదేనా?
తెలంగాణలోని రెండు నియోజకవర్గాలు అన్ని పార్టీలకు హాట్ టాపిక్‌గా మారాయి. కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు కూడా గట్టిగానే ఉన్నారు. కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయడమే ఆసక్తికరం కాగా.. రెండు చోట్లా బరిలో ఉన్న ప్రత్యర్థులు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. గజ్వేల్‌లో రెండుసార్లు గెలిచిన కేసీఆర్ హ్యట్రిక్ సాధించడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ ప్రధాన పార్టీల ప్రచారం ఎలా ఉందంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో గులాబీ పార్టీ ప్రచార బాధ్యతలు మంత్రి హరీష్‌రావు నిర్వహిస్తున్నారు. హరీష్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజలకు తాము చేసిన అభివృద్ధి గురించి, బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరంగా చెబుతూ ప్రచారం చేస్తున్నారు. ఈసారి గులాబీ బాస్‌కు లక్షకు పైగా మెజారిటీ రావాలనే లక్ష్యంతో ప్రచారం సాగిస్తున్నారు. హరీష్ రావు ఇప్పటివరకు నాలుగు మండలాల్లో ప్రచారం పూర్తి చేశారు. ఇక నియోజకవర్గ నేతలందరూ పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ సెగ్మెంట్లోని అన్ని మండలాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గతంలో ప్రకటించినట్టుగానే హుజూరాబాద్, గజ్వేల్ నుండి కమలం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ రెండు నియోజకవర్గాల్లోనూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఈటల ప్రచారం పూర్తయింది. గజ్వేల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలకు బీజేపీ కండువా కప్పి కమలం గూటికి ఆహ్వానించారు. పలు గ్రామాల సర్పంచులు కూడా ఈటల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ ఓటమే తన లక్ష్యంగా జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడినుంచే రెండుసార్లు గెలిచి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నియోజకవర్గంలోనే ఇప్పటివరకు సమస్యలు తీరకపోవడం సిగ్గుచేటు అంటూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. గజ్వేల్ ప్రజలు రెండుసార్లు మంచి మనసుతో కేసీఆర్‌ను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే.. పదేళ్ళయినా నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని మరోసారి గెలిపిస్తే ప్రజలకు అధోగతే అని కాంగ్రెస్ అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్‌లకు ఈ నియోజకవర్గంతో సంబంధం లేదని.. కేసీఆర్‌ది పక్క నియోజకవర్గం అయితే.. ఈటల పక్క జిల్లాకు చెందిన నాయకుడని.. తాను మాత్రం ఎల్లప్పుడూ ప్రజలతో గజ్వేల్‌లోనే ఉంటానని చెబుతున్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గజ్వేల్‌లో, రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని నర్సారెడ్డి తన ప్రచారంలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2009లో ఒకసారి తూముకుంట నర్సారెడ్డి గజ్వేల్‌లో విజయం సాధించారు. గజ్వేల్‌లో ఏ పార్టీ గెలుస్తుందో రాష్ట్రంలో ఆ పార్టీకే అధికారం దక్కడం ఒక విశేషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. మూడోసారి కూడా ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. ధరణి పోర్టల్ బాధితులు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్వాసితుల బాధితులు, నిజామాబాద్‌లో చెరుకు ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన రైతులు గజ్వేల్‌లో 127 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. 70 మంది అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం గజ్వేల్ పోటీలో మొత్తం 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గతంలో సిద్ధిపేట నుంచి గెలిచిన గులాబీ బాస్ కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గజ్వేల్‌కు మారారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో లోక్‌సభకు పోటీ చేసిన కేసీఆర్.. సిద్దిపేట నియోజకవర్గాన్ని హరీష్‌రావుకు అప్పగించారు. అక్కడి నుంచి హరీష్‌రావు వరుసగా గెలుస్తూనే ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ గజ్వేల్‌లో కేసీఆర్ భారీ మెజారిటీతో గెలిచారు. గత ఎన్నికల్లో 58 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించిన కేసీఆర్ మెజారిటీని ఈసారి లక్ష దాటించాలని గులాబీ శ్రేణులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరి గజ్వేల్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.. -
ఈటల కన్నా పెద్ద మనిషి కాసాని
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్‌లకు వస్తాయని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన అనుయాయులతో కలసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ వంటి నాయకుడు బీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమని అన్నారు. జ్ఞానేశ్వర్ ఏడాది కిందటే బీఆర్ఎస్లోకి రావాల్సిందని, ఆలస్యమైనా రాజకీయంగా ఎంతో అనుభవజు్ఞలైన ఆయన రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈటల రాజేందర్ కన్నా పెద్ద మనిషి జ్ఞానేశ్వర్ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల తరువాత ముదిరాజ్‌లతో సమావేశం అవుతానని, ఎవరెవరికి ఎక్కడ అవకాశం ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటానని సీఎం చెప్పారు. ముదిరాజ్‌ల నుంచి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు కావాలని, ఈసారి రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులతో పాటు ఇతర నామినేటెడ్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్, స్థానిక సంస్థల పదవుల్లో పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు. పారీ్టలో ఈటల ఎవరినీ ఎదగనివ్వలేదని, ఈటలను మించిన నాయకులు ముదిరాజుల్లో ఉన్నారని అన్నారు. ముదిరాజ్ వర్గానికి చెందిన బండ ప్రకాశ్‌ని తీసుకొచ్చి ఎంపీ, ఎమ్మెల్సీ, కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. ఎన్నికల తరువాత జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ముదిరాజ్ కులపెద్దలను కూర్చోబెట్టుకొని వారి ప్రధాన సమస్యల పరిష్కారంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా జ్ఞానేశ్వర్‌తోపాటు బీఆర్ఎస్లో చేరినవారిలో కాసాని వీరేశ్, బండారి వెంకటేశ్ ముదిరాజ్, ముప్పిడి గోపాల్, బియ్యని సురేశ్, ప్రకాశ్ ముదిరాజ్ తదితరులున్నారు. -
అచ్చొచ్చిన చోట.. అలవోకగా.. ‘గెలుపు’
మెదక్ జిల్లాలో నాయకులకు నేటితో నరాలు తెగే ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మెదక్ జిల్లా నాయకుల భవిష్యత్తును మార్చాయి. గతంలో మెదక్‌లో టీఆర్ఎస్ పది స్ధానాలను గెలుచుకుంది, కానీ ఇప్పుడు తొమ్మిది స్ధానాలకు పరిమితమైన ఓటు బ్యాంకు పెరగడంతో భారీ మెజారీటీతో మెదక్‌లో టీఆర్ఎస్ విజయం సాధించారు. ఉద్యమాల గడ్డగా పేరొందిన ‘సిద్దిపేట’ దేశ చరిత్రలోనే 2018 లో అత్యంత లక్ష మెజారీటితో గెలుపొందిన వ్యక్తిగా తన్నీరు హరీష్ రావు చరిత్ర సృష్టించారు. సాక్షి, మెదక్ : మెదక్‌లో రాజకీయ నేతగా నిలదొక్కుకోగలిగారంటే అది ఆమె సంకల్ప బలమే వృత్తి రీత్యా న్యాయవాది అయిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొటు, అడ్వకేట్ గా పనిచేసిన అనుభవంతో రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించారు. బాధ్యతలను నిర్వర్తించడంలో కష్టపడే తత్వంతో మెదక్ స్ధానాన్ని టీఆర్ఎస్ అభ్యర్ధి పద్మా దేవేందర్ రెడ్డి నిలబెట్టుకున్నారు. మెదక్ జిల్లాలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నపది స్ధానాల్లో ఘన విజయం సాధించింది.ఈసారి ఈ జిల్లాలో టీఆర్ఎస్ ఒక స్థానాన్ని కొల్సోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ , హరీష్ రావులకు బలమైన కేడర్ ఉన్నా కానీ ఈసారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక నియోజకవర్గంలో ప్రజల మద్దతును పొందింది. సంగారెడ్డి నియోజకవర్గంలో గతంలో గెలిచిన చింతా ప్రభాకర్ ఈ ఎన్నికల్లో ఒటమి చెందారు. ఇప్పుడు సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డి గెలుపోందారు. హరీష్ రావు ఇలాకా సిద్దిపేటలో గతంలో కన్న ఈసారి భారీ మెజారీటితో గెలిచారు. కష్టపడేతత్వమే ఈయన బలం, నిత్యం ప్రజలతో మమేకం అయ్యే హరీష్ రావుకు, సిద్దిపేటలో టీ.జే.ఎస్ అభ్యర్ధి భవాని రెడ్డి ప్రత్యర్ధిగా నిలుచున్న గట్టిపోటీ ఇవ్వలేక పొయింది. ఎందుకంటే హరీష్ రావుకు సిద్దిపేటలో ట్రబుల్ షూటర్‌కు కబలమైన కేడర్ ఉండడం వల్ల లక్ష పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.‘సిద్దిపేట’ దేశ చరిత్రలోనే 2018 లో అత్యంత మెజారీటితో గెలుపొందిన వ్యక్తిగా తన్నీరు హరీష్ రావు చరిత్ర సృష్టించారు. నర్సాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి సునీతారెడ్డి పైన టీఆర్ఎస్ అభ్యర్ధి చిలుముల మదన్ రెడ్డి విజయం సాధించారు. జహీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి కె.మాణిక్‌రావు గట్టి పోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ అభ్యర్ధి గీతారెడ్డి ఒటమి పాలైనారు. పఠాన్‌చెరులో టీఆర్ఎస్ అభ్యర్ధి గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి కాటా శ్రీనివాస్ గౌడ్ పైన గెలిచారు. ఆందోల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహ గట్టి పోటీ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్ధి చంటి క్రాంతి కిరణ్ గెలుపొందారు. నారయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి సురేశ్ షెట్కార్ , టీఆర్ఎస్ అభ్యర్ధి భుపాల్‌రెడ్డి పైన చిత్తుగా ఒడిపోయారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్ధి మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పైన , టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట రామలింగారెడ్డి భారీ మెజారీటీతో విజయం సాధించారు. మాటల మాంత్రికుడు తనదైన పరిపాలనతో, ప్రత్యర్ధుల మాటలకు తన తూటలకు విసారే వాక్చాతుర్యంతో, కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి , బీజేపీ అభ్యర్ధి ఆకుల విజయ లు కేసీఆర్‌కు ఎంత పోటీ ఇచ్చిన, అభివృద్దే మంత్రంగా భావించే కేసీఆర్ గజ్వేల్ స్ధానాన్ని మరోసారి భారీ విజయంతో నిలబెట్టుకున్నారు. నియోజకవర్గం అభ్యర్ధి పార్టీ మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ నర్సాపూర్ చిలుముల మదన్ రెడ్డి టీఆర్ఎస్ జహీరాబాద్(ఎస్సీ) కె. మాణిక్ రావు టీఆర్ఎస్ సంగారెడ్డి జగ్గారెడ్డి కాంగ్రెస్ ఆందోల్ చంటి క్రాంతి కిరణ్ టీఆర్ఎస్ పఠాన్‌చెరు గూడెం మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ సిద్దిపేట టీ. హరీశ్ రావు టీఆర్ఎస్ గజ్వేల్ కేసీఆర్ టీఆర్ఎస్ హూస్నాబాద్ వడితెల సతీష్ కుమార్ టీఆర్ఎస్ దుబ్బాక సోలిపేట రామలింగా రెడ్డి టీఆర్ఎస్ నారాయణఖేడ్ ఎమ్. భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ -
ఇక్కడ గెలిచిన వారిదే అధికార పీఠం
సాక్షి, గజ్వేల్ : భిన్న సంస్కృతుల సమ్మేళనంగా విరాజిల్లుతోంది గజ్వేల్ నియోజకవర్గం. స్వయానా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంగా.. ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు జన్మనిచ్చిన గడ్డగా.. తెలంగాణ ఉద్యమాన్ని అప్రతిహతంగా కొనసాగించిన నేలగా.. కవులు, కళాకారులకు నిలయంగా.. ‘వెజిటబుల్ హబ్’గా ఇలా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. సిక్కులు, గుజరాతీలు, కేరళవాసులు పెద్ద ఎత్తున స్థిరపడడంతో మినీ ఇండియాను తలపిస్తోంది. రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. స్థానికేతరులకు అచ్చొచ్చిన నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంది. తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ 2014లో ఇక్కడి నుంచి గెలిచి స్వరాష్ట్ర తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. గత 13 ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన పార్టీయే అధికారంలోకి రావడం విశేషం. సెంటిమెంట్‌గా నియోజకవర్గాన్ని ఎంచుకున్న కేసీఆర్ ఏడు మండలాలతో కూడిన గజ్వేల్ నియోజవవర్గం పాత వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. దీంతో ఈ మూడు జిల్లాల సంస్కృతి ఇక్కడ విస్తరించింది. ములుగు, వర్గల్, తూప్రాన్ మండలాలు గ్రేటర్ హైదరాబాద్‌కు ఆనుకొని ఉండడంతో ఇక్కడ నగర వాతావరణం కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తుంటారు. ప్రజా ఉద్యమ గాయకుడు గద్దర్ పుట్టింది ఈ గడ్డ మీదనే. ఇక్కడి బిడ్డ అయిల నర్సింలు 1969లో తెలంగాణ తొలి దశ పోరాటంలో పాల్గొని గజ్వేల్ చౌరస్తా వద్ద జరిగిన పోలీసు కాల్పులకు నేలకొరిగాడు. ‘అయిల నర్సింలు’ రక్తంతో తడిసిన ఈ నేల మలి దశ పోరాటంలోను అదే స్ఫూర్తిని చాటింది. తెలంగాణ ఉద్యమ రథ సారథి కేసీఆర్ 2014లో ఇక్కడి నుంచి గెలిచి స్వరాష్ట్ర తొలి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించి ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. గత 13 ఎన్నికల్లోనే ఇక్కడ గెలిచిన పార్టీయే అధికారంలోకి రావడం విశేషం. ప్రజా ఉద్యమాల పురిటి గడ్డ దశాబ్ధాలుగా ఈ ప్రాంతం ప్రజా ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తున్నది. ప్రత్యేకించి ప్రత్యేక రాష్ట్ర ప్రజాస్వామిక ఆకాంక్షతో సాగిన తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో గజ్వేల్‌లోని చౌరస్తావద్ద విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో కాల్పులు జరిగాయి. ఇందులో పన్నెండేళ్ల వయసున్న అయిల నర్సింలు అనే బాలుడు పోలీసు తూటాలకు నేలకొరిగాడు. మరో విద్యార్థి సైతం గాయపడ్డాడు. ఈ సంఘటన అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కళలకు నెలవు... ప్రజాగాయకునిగా ప్రపంచస్థాయి గుర్తింపును పొందిన గద్దర్‌కు జన్మనిచ్చింది ఈ ప్రాంతమే. నియోజకవర్గంలోని తూప్రాన్‌లో జన్మించిన ఆయన పీడితుల గొంతుకగా మారి ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచారు. తన అసమాన ప్రతిభతో సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన బీ నర్సింగరావుది గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామమే. ‘మా భూమి, దాసి, రంగుల కల’ వంటి చిత్రాలతో ఆయన సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. వీరిద్దరే కాకుండా ఈ ప్రాంతానికి చెందిన పలువురు వర్ధమాన కవులు, కళకారులు తమదైన ప్రతిభను చాటుతున్నారు. భిన్న సంస్కృతుల నిలయం గజ్వేల్ నియోజకవర్గం భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. నియోజకవర్గంలోని కాళ్లకల్ పారిశ్రామిక ప్రాంతంలో దేశంలోని అనేక మతాలు వివిధ మతస్తులు, సంప్రదాయాలు కలిగిన వారు నివాసముంటున్నారు. ఇక్కడ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ములుగు మండలంలోని గంగాపూర్‌లో సుమారు 60కిపైగా సిక్కుల కుటుంబాలున్నాయి. వీరి కుటుంబాల్లో ఎక్కువమంది దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరి సేవలందించడం విశేషం. ఇదిలా ఉంటే గజ్వేల్ పట్టణంలో గుజరాతీలు, కేరళవాసులు పెద్ద ఎత్తున స్థిరపడ్డారు. కేరళ వాసులు జరుపుకునే ‘ఓనమ్ ఉత్సవాలు’ ఇక్కడ ప్రతిఏటా ఘనంగా జరుగుతాయి. గుజరాతీలు సైతం తమ సంప్రదాయ పండుగలను జరుపుకుంటారు. వీరంతా ఇక్కడి ప్రజలతో ఆత్మీయుల్లా కలిసిపోయారు. మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామం పారిశ్రామికీకరణ జరగడం వల్ల ఆ ప్రాంతంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు నివసించడం వల్ల మినీ ఇండియా వాతావరణాన్ని కలిగి ఉంది. గజ్వేల్ ముఖ చిత్రం మండలాలు గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తూప్రాన్, మర్కూక్, మనోహరాబాద్. ఓటర్లు మొత్తం : 2,27,954 పురుషులు : 1,14,362 మహిళలు : 1,13,554 మొత్తం జనాభా : 3,50,980 ‘వెజిటబుల్ హబ్’గా అవతరణ.. గణనీయమైన కురగాయల సాగుతో గజ్వేల్ నియోజకవర్గం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. ఇక్కడి పండించిన కురగాయలే జంటనగరాలకు ఆధారం. ఇక్కడ పండించిన కురగాయలు సేకరించడానికి ఇక్కడ వివిధ మల్టినేషనల్ కంపెనీల కలెక్షన్ సెంటర్లు వెలిశాయి. ప్రభుత్వ పరంగా ములుగు మండలం వంటిమామిడిలో కురగాయాల మార్కెట్ ఏర్పాటైంది. ఇక్కడి నుంచి జంట నగరాలకే కాకుండా ఢిల్లీ, బెంగుళూర్, చెన్నై లాంటి ప్రధాన నగరాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఈ ప్రాంత ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు మండల కేంద్రంలోని అటవీ పరిశోధనా కేంద్రంలో హర్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. దీంతోపాటు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఫారేస్ట్రీ కళశాలను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ ముఖ చిత్రం గజ్వేల్ 1962 నుంచి 2004వరకు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉంది. ఆ సమయంలో ఎస్సీ ఎమ్మెల్యేలను అడ్డంపెట్టుకొని చక్రం తిప్పిన నేతలంతా ఇక్కడి రాజకీయాలను శాసించారు. 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ‘జనరల్’గా మారటంతో తెరచాటు రాజకీయాలు చేసిన నేతలంతా ప్రత్యక్ష రాజకయాలకు దిగడంతో పరిస్థితులు ఆసక్తిరంగా మారాయి. స్థానికేతరులకు అచ్చొచ్చిన నియోజకవర్గం 1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండేం వాసుదేవ్, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో పనిచేసిన జేబీ. ముత్యాలరావు, ఆర్.నర్సింహ్మారెడ్డి, 1983లో గెలుపొందిన అల్లం సాయిలు, 1985లో ఎమ్మెల్యేగా పనిచేసిన సంజీవరావు, 1989, 2004లలో గెలుపొందిన డాక్టర్ జే.గీతారెడ్డి, 1994లో విజయం సాధించిన డాక్టర్ జీ.విజయరామారావు, 1999లో పనిచేసిన సంజీవరావులు స్థానికేతరులే. స్థానిక నాయకత్వం బలంగా లేదనే కారణంతో గజ్వేల్‌లో కాంగ్రెస్, టీడీపీ రాజకీయాలను శాసించిన ఇక్కడి నేతలు స్థానికేతర నాయకులను ‘బరి’లోకి దింపి గెలిపించారు. 2014లో కేసీఆర్ ‘ఇలాకా’గా ఆవిర్భావం 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని సెంటిమెంట్‌గా ఎంచుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకున్న విధంగానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 2008 నుంచే ఇక్కడ ఫామ్‌హౌస్ ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేస్తున్న కేసీఆర్ ఇదే తన ‘ఇలాకా’గా ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గత ఎన్నికల్లో మొత్తం 199062ఓట్లు పోలవగా, ఇందులో కేసీఆర్ 86372 ఓట్లను దక్కించుకున్నారు. టీడీపీకి చెందిన తన సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 19218 ఓట్ల మెజార్టీని సాధించి విజయం సాధించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం ఇదిలా ఉంటే ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున తిరిగి కేసీఆర్ బరిలో ఉండగా... కాంగ్రెస్ నుంచి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంటేరు ప్రతాప్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఈ రెండు పార్టీల ప్రచారపర్వం జోరుగా సాగుతోంది. అభివృద్ధే ఎజెండాగా టీఆర్ఎస్ ముందుకెళ్తుండగా... ప్రతాప్‌రెడ్డి గతంలో ఓడిపోయిన సానుభూతి, ప్రభుత్వ వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. -
బ్రహ్మాండంగా గెలవబోతున్నాం: హరీశ్‌రావు
జగదేవ్‌పూర్(గజ్వేల్): ‘గజ్వేల్ ప్రజలు చాలా గొప్పవాళ్లు. గతంలో గెలిచిన వాళ్లు ఎంతోకొంత అభివృద్ధి చేస్తేనే మూడు నాలుగు సార్లు గెలిపించారు. అలాంటిది సీఎం కేసీఆర్ నాలుగున్నరేళ్లలోనే నియోజకవర్గాన్ని 20 ఏళ్లు ముందుకు తీసుకుపోయార’ని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామ సమీపంలో కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో గెలిచిన వారంతా ఒకటి రెండు అభివృద్ధి పనులకే పరిమితం అయ్యారని, కేసీఆర్ మాత్రం గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. దేశం మొత్తం గజ్వేల్ వైపు చూసేలా అభివృద్ధి చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. అభివృద్ధిలో, మెజార్టీలో ఆదర్శంగా ఉన్న గజ్వేల్.. ఎన్నికల నిబంధనలు పాటించడంలోనూ ఆదర్శంగా నిలవాలని కార్యకర్తలను కోరారు. ప్రతి కార్యకర్త ఎన్నికల నియమాలు తూ.చ తప్పకుండా పాటించాలని సూచించారు. బూత్‌కమిటీ సభ్యులు సమన్వయంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలను తీసుకుపోవాలని, 90 శాతం ఓటర్లు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, మిగతా పది శాతం కోసం ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని కోరారు. గజ్వేల్‌లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నామని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని తేల్చిచెప్పారు. ఎదుటి పార్టీ వాళ్లకు డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. 25 రోజుల పాటు గ్రామాల్లోనే కార్యకర్తలు ఉంటూ ప్రచారం చేయాలని, చేసిందే చెప్పాలని, చేయబోయేది మేనిఫెస్టో వివరాలను ఇంటింటికీ తీసుపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఫారుఖ్‌హుస్సేన్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, భూపతిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు రాంచంద్రం, సత్తయ్య, మధూరి, వెంకటేశం, రాష్ట్ర నాయకులు నర్సింహారెడ్డి, రఘుపతిరావు, సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు రంగారెడ్డి, మధు, శ్రీనివాస్, దుర్గయ్య, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో నాణ్యతాలోపాన్ని సహించం
గడువులోగా అభివృద్ధి జరగాలి సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష గజ్వేల్: సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతాలోపాన్ని సహించేది లేదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వేల్‌లోని ‘గడా’ కార్యాలయంలో ఓఎస్డీ హన్మంతరావుతో కలిసి నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీలేదన్నారు. ‘గడా’ కార్యాలయంలో వారానికోసారి నిర్వహిస్తున్న సమీక్షకు అధికారులతోపాటు సంబంధిత కాంట్రాక్టర్లు తప్పనిసరిగా హాజరై ప్రగతిపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఉదాసీనత ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనాగా నిలపాలన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉందన్నారు. మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతను ఎంపీపీలు, జెడ్పీటీసీలు సైతం చూసుకోవాలన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే తనకు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఈడబ్ల్యూఐడీసీ(ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్), పంచాయతీరాజ్, ఆర్అండ్బీ తదితర శాఖల పనులను మండలాల వారీగా సమీక్షించారు. కొన్నిచోట్ల స్థల సేకరణలో జాప్యం, మరికొన్నిచోట్ల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనుల్లో వేగంగా పుంజుకోవడం లేదన్నారు. ఈ సమీక్షలో ఆర్అండ్బీ ఈఈ బాల్‌నర్సయ్య, డిప్యూటీ ఈఈ బాలప్రసాద్, ఈడబ్ల్యూ ఐడీసీ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ, కమిషనర్ శంకర్, ఎంపీపీలు చిన్న మల్లయ్య, రేణుక, జెడ్పీటీసీ జేజేల వెంకటేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో గజ్వేల్ రోల్‌మోడల్
భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గజ్వేల్: గజ్వేల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రభాగాన నిలబెట్టడమే లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామాత్యులు హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం గజ్వేల్‌లో రూ.8.5 కోట్ల వ్యయంతో నాలుగు లేన్లుగా విస్తరిస్తున్న జాలిగామ బైపాస్ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంతానికి వరమని చెప్పారు. సీఎం కృషితో ఇప్పటికే గజ్వేల్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తుందని వెల్లడించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. గజ్వేల్‌ను అభివృద్ధిలో మోడల్‌గా చూపేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కనీస సౌకర్యాలు కరువై కొట్టుమిట్టాడిన గ్రామాలు నేడు కొత్తరూపును సంతరించుకుంటున్నాయని చెప్పారు. ‘మిషన్ భగీరథ’, మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రజల జీవనంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం రెండు కళ్లులా భావిస్తూ ముందుకు వెళ్తుందన్నారు. చివరగా మంత్రి పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ‘గడ’ ఓఎస్డీ హన్మంతరావు, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ అరుణ, కమిషనర్ శంకర్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ చిన్న మల్లయ్య, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రవీందర్రావు, ఆకుల దేవేందర్, బెండ మధు, శ్యాంమనోహర్, కౌన్సిలర్లు బోస్, రాజ్‌కుమార్, వసీంఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
గజ్వేల్ టు దుబాయ్
కూరగాయలకు గిరాకీ ఎగుమతికి దుబాయ్ ఆసక్తి అధ్యయనం చేసిన అధికారులు ప్రతిపాదనలకు ప్రయత్నాలుఆసియాలోనే అత్యంత నాణ్యమైన కూరగాయలు పండించే ప్రాంతంగా గుర్తింపు పొందిన గజ్వేల్ నేడు మరో ఖ్యాతిని మూటగట్టుకోబోతున్నది. ఇక్కడి కూరగాయలు త్వరలో దుబాయ్‌కి ఎగుమతి కానున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎం వద్దకు పంపనున్నారు. ఇప్పటికే ఇక్కడి ఉద్యానవనశాఖ అధికారి చక్రపాణి దుబాయ్‌లో ఈ నెల 14 నుంచి 20 వరకు అధ్యయనం జరిపి వచ్చారు. గజ్వేల్:మెదక్ జిల్లాలో ప్రస్తుతం 60 వేల ఎకరాల్లో కురగాయలు సాగవుతున్నాయి. ఆరేళ్ల కిందట ఈ సాగు విస్తీర్ణం 10 వేల హెక్టార్లు కాగా, ప్రస్తుతం ఆరింతలు పెరిగింది. గతంలో మార్కెటింగ్ సౌకర్యాల్లేక తక్కువగా కురగాయలను పండించిన రైతులు పెరిగిన మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రధానంగా గజ్వేల్, ములుగు, వర్గల్, జిన్నారం, పటాన్చెరు, కొండాపూర్, సదాశివపేట, సిద్దిపేట, చిన్నకోడూరు, జహీరాబాద్, నారాయణఖేడ్, రేగోడ్ మండలాల్లో ఈ సాగు పెరిగింది. ఆయా మండలాల్లో టమాట, వంకాయ, బెండ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లిగడ్డ, బీన్స్, ఆలుతో పాటు పందిరి రకాలు బీర, కాకర, సోర, చిక్కుడు ఎక్కువగా సాగులో ఉన్నాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుండి వందలాది టన్నులు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు రాష్రీ్టయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. నెలకు రూ.100 కోట్లకుపైగా టర్నోవర్ జరుగుతున్నట్లు అంచనా. పెరుగుతున్న జనాభా అవసరాలకు కురగాయలను అందించేందుకు గజ్వేల్ నియోజకవర్గంలో వివిధగ్రామాల్లో రిలయన్స్ఫ్రెష్, స్పెన్సార్, ఐటీసీ లాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాయి. ఇక్కడ కొనుగోలు చేసిన ఉత్పత్తులను కోల్డ్ స్టోరేజిల్లో నిల్వ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వున్న తమ బ్రాంచిల ద్వారా అమ్మకాలను సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వంటిమామిడిలో కూరగాయల మార్కెట్ యార్డును ప్రారంభించడం కూరగాయల సాగుకు మరింత అనుకూలంగా మారింది. నాణ్యమైన ఉత్పత్తులు.. గజ్వేల్‌లో ఉత్పత్తి చేస్తున్న తీగజాతి, సాధారణ కూరగాయలు ఆసియాలోనే నాణ్యమైనవిగా గుర్తింపు పొందాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కూరగాయలను దుబాయ్‌కి ఎగుమతి చేసి రైతులకు మరింత లాభసాటిగా మార్చడానికి యత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అక్కడి మార్కెట్లో 60 శాతం ఇక్కడి ఉత్పత్తులే ఉన్నట్టు అంచనా. తెలంగాణ ప్రాంతంలో ఉత్పత్తయ్యే బంగినపల్లి మామిడి దుబాయ్‌లోని ప్రముఖ షాపింగ్‌మాల్‌లలో ‘బేనీశా’ పేరిట విక్రయిస్తున్నారు. ఇది తెలుసుకున్న చక్రపాణి పూణేలోని ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సహకారంతో వెన్మహ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ ఎండీ విజయ్ సిరిగిరితో కలిసి ఈ నెల 14 నుంచి 20 వరకు దుబాయ్‌లో పర్యటించారు. వీరు దుబాయ్‌లో లేమెరిడియన్, అబుదుబాయ్కు వెళ్లారు. అంతేకాక దుబాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాంతాల్లో చర్చాగోష్టిలు, పవర్‌పాయింట్ ప్రజంటేషన్లలో పాల్గొన్నారు. ఆల్అవీర్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్, కిషోర్ టీరవాలే, హెడ్, ఎఫ్అండ్వీ, జైన్ ఇరిగేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలను సందర్శించారు. ప్రస్తుతం దుబాయ్‌లో దొరుకుతున్న కూరగాయలు, పండ్లతో పోలిస్తే తమ రైతులు మరింత నాణ్యమైన ఉత్పత్తులు తీసుకువస్తున్నారని అక్కడి యంత్రాంగానికి వివరించగలిగారు. దీంతో వారు ఉత్పత్తులను భారీగా ఎగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే ఇక్కడ పర్యటించి ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకారం తెలిపినట్లు చక్రపాణి ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్, ‘గడ’ ఓఎస్డీ హన్మంతరావుల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రతిపాదన అమలయ్యేలా చూస్తామన్నారు. ముందుగా గజ్వేల్ నియోజకవర్గంలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో)లను నెలకొల్పి... వాటి ద్వారా నాణ్యమైన కూరగాయల ఉత్పత్తులు తీసుకురావడానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇప్పటికే ఉన్న వర్గల్ మండలం గౌరారం, సింగాయపల్లి, గజ్వేల్ మండలం కొల్గూరు ఎఫ్‌పీవోలను బలోపేతం చేసి కలెక్టర్ దత్తత గ్రామం మల్కాపూర్‌లో కొత్త ఎఫ్‌పీవో ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. -
లక్ష ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు: కడియం
గజ్వేల్(మెదక్): విద్యాశాఖతోపాటు ఇతర విభాగాల్లో ఉన్న సుమారు లక్షకుపైగా ఖాళీల భర్తీకి 2015-16 ఏడాదిలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. బుధవారం ఆయన గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించారు. నగరపంచాయతీ పరిధిలో ఏర్పాటుచేయబోయే ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించి పరిశీలన జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గురుకుల విద్యావ్యవస్థను పటిష్టం చేసి, మరింత మెరుగైన ఫలితాలు సాధించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎలక్షన్రెడ్డ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు సీఎం పర్యటన
- ఏర్పాట్లు పూర్తి - ముందుగా నాచగిరి బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ - తర్వాత గజ్వేల్ నగర పంచాయతీలో పర్యటన - ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఇతర అధికారులు గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గంలో గురువారం సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వస్తుండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు, డీఐజీ తదితరులు బుధవారం గజ్వేల్‌లో పర్యటించారు. పిడిచెడ్ రోడ్డువైపున ఆయిల్ మిల్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ను కలెక్టర్ పరిశీలించారు. సీఎం సందర్శించనున్న ఆడిటోరియం, ఇంటిగ్రేటేడ్ ఆఫీస్ బిల్డింగ్ కోసం సేకరించనున్న పాల శీతలీకరణ కేంద్రం స్థలం, సంగాపూర్ రోడ్డు వైపున రైతు బజార్ కోసం సేకరించనున్న స్థలం, ఇందిరాపార్క్ తదితర ప్రదేశాలను కలెక్టర్ స్వయంగా చూశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీఎం నిర్వహించనున్న సమీక్ష సమావేశ స్థలాన్ని సైతం పరిశీలించారు. నాచారం నుంచి ప్రారంభం.. కేసీఆర్ ముందుగా వర్గల్ మండలం నాచారంగుట్టకు చేరుకొని బ్రహోత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి గజ్వేల్‌కు చేరుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం సేకరించనున్న స్థలాలను పరిశీలించి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నగర పంచాయతీ పాలక వర్గం, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు పట్టణంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగనుంది. కలెక్టర్ సమీక్ష.. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ పోలీసు అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కమిషనర్ ఎన్.శంకర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నగర పంచాయతీ సమీక్ష నిర్వహిస్తున్న వేళ... ఆయన దృష్టికి ఏయే అంశాలను తీసుకెళ్లాలనే అంశంపై స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో ‘గడా’ ఓఎస్డీ, మున్సిపల్ శాఖ రీజినల్ డెరైక్టర్ శ్రీనివాస్‌రెడ్డిలు కమిషనర్ ఎన్.శంకర్, నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పాలకవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాచగిరిలో కలెక్టర్, ఎస్పీ... వర్గల్: బ్రహ్మోత్సవాలకు సీఎం హాజరవుతున్న దృష్ట్యా బుధవారం కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ సుమతి నాచగిరిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ఈఓ హేమంత్ కుమార్ కు సూచనలు చేశారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. హెలిపాడ్ స్థలాన్ని సందర్శించారు. -
ఉద్యమవీరునికి జేజేలు
నేడు ముఖ్యమంత్రి జన్మదినం ⇒ కేసీఆర్ ఇలాకా.. ఆనందహేల ⇒ రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా గజ్వేల్ ⇒ ప్రగతివైపు పరుగులు ⇒ సంబరాలకు సిద్ధమవుతున్న పార్టీ యంత్రాంగం ⇒ ఎమ్మెల్యేల శుభాకాంక్షలు గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15సార్లు జరిగిన ఎన్నికల్లో 1989, 2004 ప్రాంతంలో డాక్టర్ జె.గీతారెడ్డి మంత్రి పదవులను దక్కించుకోగా మిగతా వారంతా ఎమ్మెల్యేలుగానే కొనసాగారు. తాజాగా కేసీఆర్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో సాదాసీదా నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో అగ్రతాంబూలాన్ని అందుకుంది. సీఎం కొత్త తరహా ఆలోచనలకు నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి శివారులోని ఫాంహౌస్ కేంద్రబిందువుగా మారడం. ఈ దశలోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్నదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరోవైపు ‘కొత్త రాష్ట్రం-కొత్త నాయకత్వం-సరికొత్త పంథా’ పేరిట తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ సిద్ధమవుతున్న తరుణంలో ఆయన సొంత నియోజకవర్గం కావడం వల్ల సహజంగానే ఈ లక్ష్యానికి ఈ ప్రాంతమే కేంద్ర బిందువుగా మారింది. గజ్వేల్‌లో అభివృద్ధి ఇలా.. గజ్వేల్ చుట్టూ రింగు రోడ్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటికే స్థల సేకరణకు నిధులు మంజూరు చేశారు. అదేవిధంగా గజ్వేల్ నగర పంచాయతీలో శాశ్వత దాహార్తి నివారణకు ‘గోదావరి సుజల స్రవంతి పథకం’ కోసం రూ. 60కోట్లకుపైగా నిధులి చ్చారు. గజ్వేల్‌లో 5వేల మంది పేదలకు ఇళ్లస్థలాలు, గృహనిర్మాణానికి కార్యాచరణకు అధికారులను ఆదేశిం చారు. ఆర్అండ్బీ, పీఆర్రోడ్ల అభివృద్ధికి విరివిగా నిధులు మంజూరు చేశారు. ములుగులో హార్టికల్చర్ యూనివర్శిటీ, ఫారెస్ట్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. గజ్వేల్ మిల్క్‌గ్రిడ్ పథకానికి ఇప్పటికే అంకురార్పణ జరిగింది. గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి మండల కేంద్రాలు, పంచాయతీలు, మధిరగ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి విరివిగా నిధులిచ్చారు. గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచగా, తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిని 50 పడకలుగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రారంభమైంది. అభివృద్ధి పవర్‌డే నిర్వహణ, మిషన్ కాకతీయ కింద 606 చెరువుల అభివృద్ధికి నిర్ణయం, గజ్వేల్ నియోజకవర్గంలో కొత్తగా 220కేవీ, ఒక 132, మరో ఆరు 33/11కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇవే కాకుండా పలు ప్రతిష్టాత్మక పథకాలకు సైతం గజ్వేల్‌ను పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. ఇదిలావుంటే మంగళవారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సంబరాలు జరుపుకోవడానికి పార్టీ యంత్రాంగం సిద్ధమవుతోంది. కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు సాక్షి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించిన అనంతరం తొలి జన్మదినోత్సవాన్ని మంగళవారం జరుపుకోనున్నారు. సీఎంకు మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ మరింత ముందు కు సాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని వారి మనోభావాలు వారి మాటల్లోనే... ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా ముందుకు: హరీష్‌రావు, నీటిపారుదలశాఖా మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుంది. సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు జిల్లాల్లో 1.20 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేస్తాం. మిషన్ కాకతీయను యజ్ఞంలా నిర్వహించి చెరువు, కుంటలకు గత వైభవాన్ని తీసుకొస్తాం. చెరు వు కుంటల నుంచి తరలించిన మట్టితో రైతుల వ్యవసాయ భూముల్లో భూ సారాన్ని పెంచుతాం. వాటర్‌గ్రిడ్ పథకాన్ని విజయవంతం చేసి ప్రతి ఇంటికి నీరందిస్తాం. కేసీఆర్‌తో సుపరిపాలన చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే సంగారెడ్డి శివరాత్రి పర్వదినంతోపాటు కేసీఆర్ జన్మదినం కలిసిరావటం ఆనందంగా ఉంది. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ సుపరిపాలన అందజేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేరుస్తారు. ఆయన సారధ్యంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం అవుదాం. తెలంగాణ పోరాట యోధుడు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలంగాణ పోరాట యోధు డు కేసీఆర్. నాలుగున్నర కోట్ల ప్రజల్లో ఉద్యమ స్ఫూ ర్తిని రగిలించి..పన్నెండేళ్ల అలుపెరగని పోరాటంతో సమైక్య పాలనను సమాధిచేసి...తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. నిరుపేదలు, ఉద్యోగులు, మహిళల అభ్యున్నతికోసం ప్రవేశ పెట్టిన పథకాలు భేష్‌గా ఉన్నాయి. ఏడుపాయల జాతరకు కోటి రూపాయలు మంజూరు చేయడం గర్వకారణం. దుర్గమ్మతల్లికి మంగళవారం ఏడుపాయల్లో ప్రత్యేక పూజలు చేయిస్తాం. బంగారు తెలంగాణ సాధించాలి: చిలుముల మధన్‌రెడ్డి,ఎమ్మెల్యే నర్సాపూర్ కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండి బంగారు తెలంగాణ సాధిం చాలని కోరుకుం టున్నా. పేదల సంక్షేమం కేసీఆర్ తోనే సాధ్యం. వాటర్‌గ్రిడ్ పథకాన్ని సీఎం మానస పుత్రికగా చేపడుతున్నారు. పథకం పూర్తయితే ఇంటింటికీ మంచినీరు అందుతుంది. సీఎం సహకారంతో నర్సాపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ జోగిపేట: సీఎం సాధించబోయే బంగారు తెలంగాణకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. లక్షలాది మందికి అన్నం పెట్టే ఆయనకు తెలంగాణ ప్రజలంతా ఆశీస్సులు అందజేయాల్సిన అవసరం ఉంది. 22 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ గూర్చి తెలిసిన వాడిగా ఆయన తెలంగాణ మహాత్మాగాంధీ. స్నేహశీలి భావాలు కల్గి ఉన్నవాడు. ఆడంబరాలకు దూరంగే ఉండే ఆ మహానుభావుడికి భగవంతుడు అన్నివిధాలా సహకరించాలి. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలి: జడ్పీ చైర్పర్సన్ రాజమణి చంద్రశేఖరరావు దేశంలోనే అగ్రగామి సీఎంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నా.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ హయాం లో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెంది దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నత స్థాయిలో ఉండగలదని నా ఆశాభావం. -
సర్వం సిద్ధం
గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చేపట్టనున్న సమీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ వేదికగా సీఎం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా అధికారులు నివేదికలతో సిద్దమయ్యారు. సీఎం సమీక్ష నేపథ్యంలో ఈనెల 27న గజ్వేల్‌లోని శ్రీలక్ష్మీ గార్డెన్స్‌లో కలెక్టర్ రాహుల్ బొజ్జా జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సీఎం సమీక్షకు వాస్తవ నివేదికలతో రావాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సహిం చేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు రెండ్రోజులుగా ఈ పనిలో నిమగ్నమై నివేదికలు తయారు చేశారు. గజ్వేల్‌లో సాగుతున్న పథకాల అమలు తీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి. జూన్ 4న గజ్వేల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్, ఆ తర్వాత పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అదివారం సైతం అదే తరహాలో సమీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మొదలుకొని వివిధ శాఖల రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు, గజ్వేల్ నియోజకవర్గ అధికారులతోపాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం పాల్గొంటుండడం విశేషం. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల అవసరాలపై సీఎం కేసీఆర్ అంశాల వారీగా సమీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం సేకరించి అభివృద్ధి ప్రణాళికలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ నగర పంచాయతీని తెలంగాణలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దనున్న నేపథ్యంలో ఈ సమీక్షలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నగర పంచాయతీకి రూ.90 కోట్లతో రింగ్ రోడ్డు, రూ.60 కోట్లతో గోదావరి సుజల స్రవంతి పైప్‌లైన్ నుంచి శాశ్వత మంచినీటి పథకాన్ని మంజూరు చేసిన సీఎం, తాజా సమీక్షలో నియోజకవర్గానికి మరిన్ని వరాలు కురిపించే అవకాశముంది. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు సమీక్ష సమావేశం కోసం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌లు పరిశీలించారు. ఫాంహౌస్ ఆవరణలో సుమారు 400 మంది కూర్చునేందుకు వీలుగా టెంట్ వేశారు. సమీక్షలో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పాల్గొననున్నారు. -
గజ్వేల్ అభివృద్ధే లక్ష్యం
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాహుల్‌బొజ్జా పిలుపునిచ్చారు. శనివారం రాత్రి గజ్వేలోని లక్ష్మీ గార్డెన్స్‌లో ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ హోదాలో వివిధశాఖల జిల్లా అధికారులు, స్థానిక అధికారులతో నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షే ఫలాలు అందించటంతోపాటు అభివృద్దిని వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా పలు సమీక్ష జరిపారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పీహెచ్‌సీల్లో సాధారణ డెలివరీల సంఖ్య అతి తక్కువగా ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యాధికారులు, గ్రామస్థాయిలో పనిచేసే సిబ్బంది సరైన శ్రద్దను ప్రదర్శించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని అభిప్రాయపడ్డారు. పీహెచ్‌సీలు, ఆసుపత్రుల్లో సమస్యలను తీర్చడానికి సిద్దంగా ఉన్నామని, డెలివరీల సంఖ్య పెంచి గ్రామీణ పేద మహిళలకు మేలు చేయాలని సూచించారు. వ్యవసాయాశాఖకు సంబంధించి రుణాల రీషెడ్యుల్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో అపరిశుద్ధ్యాన్ని పారదోలడానికి డంప్ యార్డుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఇందుకోసం గ్రామాలవారీగా అర ఎకరంనుంచి ఎకరం వరకు సేకరించాలని ఆదేశించారు. అదేవిధంగా పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై దృష్టిసారించాలన్నారు. ప్రతి పంచాయతీలో పన్నుల వసూలు శాతాన్ని 50కి పెంచాలని చెప్పారు. నియోజకర్గంలో దళితుల అభ్యున్నతే లక్ష్యంగా చేపట్టిన ల్యాండ్ పర్చేజ్ స్కీమ్‌ను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో నీటిపారుదల, ఉద్యానవనం, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, పశుసంవర్ధకశాఖ, ఐసీడీఎస్, సూక్ష్మనీటి పథకం తదితర అంశాలపై సమీక్షా నిర్వహించారు. ఇంకా ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, వ్యవసాయశాఖ జేడీ హుక్యానాయక్, ఉద్యావనశాఖ ఏడీ రామలక్ష్మీ, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ పెదరాయుళ్లు.. వీళ్లు
సంగారెడ్డి మున్సిపాలిటీ: దసరా రోజైనా తమ కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం వారికి లేకపోయింది. వారితో ఎవ్వరు మాట్లాడినా, వారి ఇళ్లల్లో జరిగే శుభకార్యాలు, చావులకు వెళ్లినా రూ.50 వేల జరిమానా విధిస్తారు. గ్రామంలో కులపెద్దలు నిర్వహించిన పంచాయతీ తీర్పు ఇది. వారు చెప్పింది వినకుంటే కుల బహిష్కరణ చేస్తారు. ఇదేమి విడ్డూరం? ఇదెక్కడ అనుకుంటున్నారా? ఇంకెక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాలలో కులపెద్దల తంతు ఇది. గత అయిదేళ్ల కాలంలో కుల పెద్దల తీర్పుతో పలు కుటుంబాలు సాంఘిక బహిష్కరణకు గురై అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎనిమిది కుటుంబాలు ఈ విధంగా బహిష్కరణ వేటుకు గురయ్యాయి. పోలీసులను ఆశ్రయించినా వారికి సహకరించడంలేదు. వీరిలో రెండు కుటుంబాల వారు చివరకు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తే పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించారు. తెల్లకాగితంపై బాధితులతో సంతకాలు చేయించుకొని కుల బహిష్కరణకు గురైన వారితో పాటు గ్రామ పెద్దల సమక్షంలో గ్రామసభ నిర్వహించి రాజీ చేశామని హెచ్ఆర్సీకి పోలీసులు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు గ్రామస్థులు ఆరోపించారు. దీనిపై గ్రామానికి చెందిన బాధితులు శనివారం జిల్లా ఎస్పీని కలిసేందుకు వచ్చినా వారు అందుబాటులో లేకపోవడంతో ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి తమ సమస్యను వివరించారు. మండలంలోనే మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఇటిక్యాలలో 2వేల మంది ఓటర్లతో కలిపి 2684 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 68 మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా 135 మంది సమీపంలోని వివిధ ప్రైవేటు పరిశ్రమలలో పనిచేస్తున్నారు. గ్రామంలో ప్రధానంగా కూలిపై ఆధార పడినవారే అధికంగా ఉన్నారు. గ్రామానికి చెందిన బింగి కిష్టయ్య, నర్సోల్ల కర్ణయ్య, పర్వతాలు, మహేందర్, భాస్కర్ (ప్రస్తుత ఎంపీటీసీ)లు ఒక గ్రూప్‌గా ఏర్పడి గ్రామంలో పంచాయతీలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తప్పు చేసిన వారికి రూ.50 వేల జరిమాన విధిస్తున్నారు. అందులో పంచాయతీ చెప్పిన వారే వాటాలుగా పంచుకుంటున్నారు. ఇదే నిదర్శనం.. గ్రామానికి చెందిన నర్సోల్ల పెద్ద ఐలయ్య కుమారుడు సంతోష్‌కు అదే మండలం నగరం గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిపించారు. భార్యభర్తల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో కాపురం చేసేందుకు నిరాకరించింది. ఇందుకు గాను మూడేళ్ల క్రితం గ్రామంలో కుల పంచాయతీ నిర్వహించారు. కుల పెద్దలు సంతోష్‌కు రూ.50 జరిమాన విధించారు. అందుకు తన తప్పు లేకున్నా ఎందుకు రూ.50 వేలు చెల్లించాలని కుల పెద్దలను ఎదురు ప్రశ్నించాడు. అందుకు వారు కులపెద్దలు చెప్పింది కాదంటావా అంటూ అతనితో పాటు వారి కుటుంబ సభ్యులను కుల బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వీరింట్లో శుభకార్యాలు జరిగినా చావులు జరిగినా ఎవ్వరూ వెళ్లరు. వెళ్తే రూ. 50వేల జరిమాన చెల్లించాలని తీర్పు చెప్పారు. అలా ఇప్పటి వరకు ముగ్గురితో మాట్లాడారని విడతల వారీగా రూ.39 వేల జరిమాన కుల పెద్దలకు చెల్లించారు. అందులో భాగంగా మే 14న గ్రామానికి చెందిన ఓ యువతి సంతోష్‌తో మాట్లాడినందుకు గాను పంచాయతీ నిర్వహించి జరిమాన విధించారు. ఇందుకు బాధితుడు సంతోష్ అదే రోజు జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి పోలీసులకు రూ.10వేలు, కుల పెద్దలకు రూ. 10 వేల జరిమాన విధించారని బాధితుడు ఐలయ్య తెలిపారు. ఈ విషయంపై మే 31న సిద్దిపేట అర్డీవోతో పాటు గజ్వేల్ డీస్పీకి ఫిర్యాదు చేశారు. అయినా స్పందించకపోవడంతో మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. అందుకు ఆగస్టు 14న సి.ఐ అమృత్‌రెడ్డి, ఎస్.ఐ వీరన్నలు విచారణ చేసి గ్రామ పెద్దల సమక్షంలోనే కుల బహిష్కరణ చేస్తే తప్పులేదని, దండనగా వేస్తే(జరిమాన ) చెల్లించాలని, కుల పెద్దలు చెప్పినట్లు వినాలంటూ పోలీసులు ఉచిత సలహా ఇచ్చారని స్థానికులు తెలిపారు. కుల బహిష్కరణ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దాంతో పోలీసులు సంతోష్ బట్టలు విప్పి స్టేషన్లో కూర్చోబెట్టి కేసును విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేశారు. పోలీసులు నాలుగు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకొని భయపెట్టారని సంతోష్ ఆరోపించారు. -
'మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వస్తే రాజీనామా'
గజ్వేల్, న్యూస్‌లైన్: మరో రెండేళ్లలో గజ్వేల్ నియోజకవర్గంలో మహిళలు మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్లపైకి వస్తే తాను రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర, జిల్లాస్థాయి ఉన్నతాధికారులతోపాటు నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సహకార సంఘాల చైర్మన్లు, నగరపంచాయతీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ విషయంలో ఎలాంటి వెనకడుగు లేదన్నారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సైతం నిర్లక్ష్యం చేస్తే పదవులకు రాజీనామా చేయాలన్నారు. ్ల జాతీయ ఆహార భద్రత పథకం జాబితానుంచి జిల్లాను తొలగించడం వల్ల వరి విత్తనాల సబ్సిడీని ఎత్తేసిన విషయం తెలుసుకున్న సీఎం వెంటనే సబ్సిడీని పునరుద్ధరించనున్నట్లు సభలో ప్రకటించారు. బీటీ పత్తి విత్తనాలు, ఇతర సబ్సిడీ విత్తనాలు, ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా నుంచి మరో ఇద్దరికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే బంగారు తునకగా తీర్చిదిద్దుతానన్నారు. అభివృద్ధిలో ఆదర్శంగా మలచడం ద్వారా దేశం నలుమూలల నుండి ఈ ప్రాంతాన్ని ప్రజలు సందర్శించే విధంగా తయారు చేస్తానన్నారు. అభివద్ధే లక్ష్యంగా గజ్వేల్‌కు ప్రత్యేకంగా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్లు, దీనికి హన్మంతరావు ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారన్నారు. ఈ ఆథారిటీ అధ్వర్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి నోడల్ అధికారిని నియమించనున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు ఆయా తమ గ్రామాల్లో మంచినీరు, విద్య, నీటిపారుదల, విద్యుత్, ఆరోగ్యం, రోడ్డు రవాణా అంశాలవారిగా ప్రణాళికలు రూపొందించి డెవలప్మెంట్ అథారిటీకి అందించాలని చెప్పారు. ఈ ప్రణాళికలకు త్వరితగతిన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా నియోజకవర్గంలో పారిశుద్ధ్య లోపంపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. నాలుగైదురోజుల్లో మండలాలవారీగా సమావేశాలు నిర్వహించి పిచ్చిచెట్ల తొలగింపు, మురికి తొలగింపు కార్యక్రమం కోసం కార్యాచరణ రూపొందించాలని, ఈ కార్యక్రమంలో తానుకూడా పాల్గొంటానన్నారు. అదేవిధంగా ‘పచ్చతోరణం’ పేరిట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మండలానికి లక్ష చొప్పున మొక్కలు నాటే కార్యక్రమాన్ని తొందరలోనే చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు నియోజకవర్గంలో శాఖల వారిగా చేపట్టాల్సిన పనులపై కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ శాఖ రోడ్లన్నీ డబుల్‌గా మార్చాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్అండ్బీ శాఖ సమీక్షలో గజ్వేల్-తూప్రాన్ రహదారిపై కల్వర్టులను బాగుచేయడమే కాకుండా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డు ఫోర్‌లేన్ పనులు వెంటనే చేపట్టాలని, ములుగు మండలం వంటిమామిడి-మేడ్చల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చి కల్వర్టులను బాగుచేయడానికి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. విద్యుత్ శాఖకు సంబంధించి పెండింగ్‌లో వున్న అయిదు 33/11 కేవీ సబ్స్టేషన్ల పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గ రైతాంగం అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ శాఖా ఎస్ఈ రాములు 350 త్రీఫేజ్, 150 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు కావాలని అడగగా మంజూరు చస్తానని సీఎం ప్రకటించారు. అదేవిధంగా తూప్రాన్ మండలం కాళ్లకల్‌లో యూపీహెచ్సీ, తూప్రాన్‌లో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, గజ్వేల్‌లో ఏరియా ఆసుపత్రి కోసం భవన నిర్మాణం వంటి పనులను చేపట్టడానికి అవసరమైన ప్రతిపాదనలిస్తే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో బస్సు సౌకర్యానికి నోచుకోని తూప్రాన్ మండలంలోని ఆరు గ్రామాలు, నియోజకవర్గంలోని మిగతా గ్రామాలకు వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌ను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ గజ్వేల్‌లో బుధవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాల్లో భాగంగా జిల్లాలోని 1326 స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.38.45బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మహిళలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. -
'మీ కాలిలో ముల్లు దిగితే నా పంటితో తీస్తా'
-
'మీ కాలిలో ముల్లు దిగితే నా పంటితో తీస్తా'
గజ్వేల్: నిజమైన అభివృద్ధి జరగాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకలించి బయడపడేస్తామన్నారు. అవినీతికి పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమన్నారు. సంక్షేమంలో కొత్త ఒరవడి సృష్టిస్తామన్నారు. బలహీనవర్గాల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి తమ ప్రాధాన్యాలని చెప్పారు. బలహీన వర్గాల సంక్షేమానికి రూ. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. అందుకోసమే ఈ మంత్రిత్వ శాఖను తన వద్దనే ఉంచుకున్నట్టు వెల్లడించారు. రైతుల పంట రుణాలను మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించారు. జిల్లాకొకటి చొప్పున నిమ్స్ ఆస్పత్రులు కట్టిస్తామన్నారు. గజ్వేల్ ను తెలంగాణ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీయిచ్చారు. పార్టీలకు అతీతంగా గజ్వేల్ అభివృద్ధికి పాటు పడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన గజ్వేల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గజ్వేల్ ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని అంటూ.. మీ కాలిలో ముల్లు దిగితే నా పంటితో తీస్తానన్నారు. గజ్వేల్ ప్రజలకు సేవలు అందించేందుకు ప్రత్యేక అధికారిని, తన నివాసంలో పీఏను నియమించినట్టు కేసీఆర్ వెల్లడించారు. ఏ సమస్య వచ్చినా వీరిని సంప్రదించవచ్చని సూచించారు. -
గజ్వేల్ లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ
గజ్వేల్, న్యూస్‌లైన్: జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు గజ్వేల్ నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఓ రకంగా గజ్వేల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితోపాటు పార్టీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సహకార సంఘాల చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ముఖ్యనాయకులు సోమవారం హైదరాబాద్‌లోనితెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది. నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు బస్సులు, డీసీఎం, సుమోలు, ఇతర వాహనాల్లో నర్సారెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. వీరంతా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు కేకే, హరీష్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణల సమక్షంలో గులాబీ కండువాలను ధరించి టీఆర్ఎస్లో చేరిపోయారు. చేరికలు ముగిశాక కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన నేతలు వీరే.. కాంగ్రెస్‌కు చెందిన డీసీసీబీ వైస్ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్లు జి.ప్రతాప్‌రెడ్డి, సలీం, వంటిమామిడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట ముత్యాలు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, ములుగు, తూప్రాన్, కొండపాక జెడ్పీటీసీ సభ్యులు సింగం సత్తయ్య, సుమన, చిట్టి మాధురి, నియోజకవర్గంలోని సహకార సంఘాల చైర్మన్లు వెంకట్‌నర్సింహారెడ్డి, పోచిరెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహీపాల్‌రెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అనంతుల నరేందర్, విద్యాకుమార్తోపాటు నియోజకవర్గంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లతోపాటు ముఖ్యనాయకులు ఇటిక్యాల లక్ష్మారెడ్డి, నిమ్మ రంగారెడ్డి, నాయిని యాదగిరి, ఊడెం కృష్ణారెడ్డి తదితరులు టీఆర్ఎస్లో చేరారు. అభివృద్ధి కోసమే చేరిక: నర్సారెడ్డి గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ గెలుపొందడమే కాకుండా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో... ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి టీఆర్ఎస్లో చేరినట్టు తాజా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.కేసీఆర్ నాయకత్వంలో గజ్వేల్ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు కొందరు నాయకులు నియోజకవర్గంలో మిగిలి ఉన్నారని, వారిని కూడా త్వరలోనే టీఆర్ఎస్లో చేర్చుకుంటామని ఆయన తెలిపారు. -
కేసీఆర్ కోటకే బీటలు: డీకే అరుణ
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కోటకే బీటలు వారాయి తప్పితే మంత్రుల కోటలకు ఏం కాలేదని మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గంలోని నాలుగు స్థానాలు టీడీపీ గెలుచుకుందని, సీఎం అని చెప్పుకుంటున్న ఆయనే ఓడిపోతుంటే టీఆర్ఎస్ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. 16న వెలువడే ఫలితాలతో ఎవరి కోటలు బీటలు వారుతాయో తేలుతుందన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఫలితాలకు, అసెంబ్లీ ఫలితాలకు తేడా ఉంటుందని వ్యాఖ్యానించారు. -
ఎనిమిదేళ్లుగా ఆగుతూ....సాగుతూ
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ నియోజకవర్గ ప్రజానీకానికి వరప్రదాయినిగా భావిస్తున్న ‘మంజీర’ పథకం ఎక్కడవేసిన గొంగళి అక్కడేనన్న చందంగా మారింది. ఇక్కడి ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చడానికి ఎనిమిదేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పంతో రూపుదిద్దుకున్న ఈ పథకం, ఆయన మరణానంతరం ముందుకు సాగడం లేదు. ఈ పథకానికి గత ఏడాదిన్నర క్రితం ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ (నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం) పథకం కింద రూ.40 కోట్లు మంజూరైతే, అందులో రూ.10 కోట్లకు సంబంధించిన పనులు గతంలో ప్రారంభమయ్యాయి. కానీ రూ.30 కోట్ల నిధుల వినియోగంపై మాత్రం సదిగ్ధం నెలకొంది. టెండర్ పూర్తయి..రెండున్నర నెలల కిందట పనులకు శంకుస్థాపన చేసినా, ఎన్నికలను సాకుగా చూపి అధికారులు పనులు నిలిపివేశారు. గజ్వేల్‌తోపాటు జిల్లాలోని నర్సాపూర్, దుబ్బాక, మెదక్(పాత రామాయంపేట నియోజకవర్గం) నియోజకవర్గాల్లో 20 వుండలాల పరిధిలోని 960 గ్రావూలకు నీరందించే లక్ష్యంతో చేపట్టిన ‘మంజీర’ పథకానికి 2006 మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు ప్రారంభమయా యి. సాలీనా వుంజీరా నది నుండి 0.7 టీఎంసీల నీరు ను ఈ పథకం కోసం వాడుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాతదీన్ని 0.77కి పెంచారు. వెంటనే పనులు కూడా ప్రారంభం కావడంతో గజ్వేల్ నియోజకవర్గంలో ‘మంజీర’ పథకం పనులు 50 శాతం వరకు జరిగాయి. తూప్రాన్, వర్గల్ మండలం మజీద్‌పల్లి గ్రామాల్లో సంప్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టిన అధికారులు తూప్రాన్, వర్గల్, గజ్వేల్ మండలాల్లోని కొన్ని గ్రామాలకు ప్రస్తుతం పాక్షికంగా నీరందిస్తున్నారు. ఈ పథకాన్ని పూర్తి చేయడానికి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకం ద్వారా ఏడాదిన్నర క్రితం రూ. 40 కోట్లు మంజూరు కాగా ఈ నిధులతో నియోజకవర్గంలోని తూప్రాన్, వర్గల్, ములుగు, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లోని 80కిపైగా గ్రామాల్లో పైప్‌లైన్ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. అంతేగాకుండా పలుచోట్ల ఓహెచ్‌బీఆర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ కొత్త నిబంధనల ప్రకారం స్టేట్ టెక్నికల్ కమిటీ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉండగా, ఈ ప్రక్రియలో నెలల తరబడి జాప్యం నెలకొంది. ఫలితంగా ప్రభుత్వం మంజూరుచేసిన రూ.40 కోట్లల్లో కేవలం రూ.10 కోట్లకు సంబంధించిన పనులే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు రెండు నెలల కిందట రూ.30 కోట్ల పనులకు కూడా అధికారులు శంకుస్థాపన చేశారు. దీంతో జనమంతా సంబరపడ్డారు. త్వరలోనే మంజీర నీరు తమ లోగిళ్లలోకి వస్తుందనుకున్నారు. కానీ అధికారులు ఉన్నట్టుండి పైప్‌లైన్ విస్తరణ పనులను నిలిపివేశారు. రోడ్ల పక్కన పైప్లైన్ల కోసం కాల్వలు తవ్వితే, వాటి ద్వారా వివిధ టెలీ కమ్యూనికేషన్ వైర్లు దెబ్బతి ంటాయని అదే జరిగే ఎన్నికల సమయంలో ఇ బ్బందులుంటాయని అధికారులు చెప్పుకొచ్చారు. కొండపాక మండలంపై నీలినీడలు గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్ మండలాలకు ఈ పథకం అడపాదడపా వర్తించే అవకాశముండగా, కొండపాక మండలంపై మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మండలంలోని గ్రామాలకు మంచినీటిని అందించి దాహార్తిని తీర్చాలంటే సుమారు రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపినా,మంజూరుపై ఇప్పటివరకు స్పష్టతలేకపోవడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఈ వ్యవహారంపై గజ్వేల్ ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి, డిప్యూటీఈఈ మోహన్‌రెడ్డిని వివరణ కోరగా, కొండపాక మండలానికి నిధులు రాబట్టేం దుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రూ.30 కోట్ల మంజీర పథకం పనులు ఎన్నికల ఫలితాల తర్వాత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. -
నేడు టీఆర్ఎస్, టీడీపీ భారీ సభలు
గజ్వేల్/వర్గల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో గజ్వేల్ నియోజకవర్గంలో భారీ సభల నిర్వహణకు టీఆర్ఎస్, టీడీపీ సన్నద్ధమవుతున్నాయి. వర్గల్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం నిర్వహించే సభలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొంటారు. సాయంత్రం మూడు గంటలకు కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా వర్గల్ చేరుకుంటారు. వర్గల్ సభ ఖరారు కావడంతో శనివారం రాత్రే పార్టీ కార్యకర్తలు, నేతలు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు రాములు నాయక్, రాష్ట్ర నేత కమలాకర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి రాజయ్య యాదవ్ తదితరులు ఆదివారం ఉదయం వర్గల్ సందర్శించారు. స్థానిక విశ్వతేజ స్కూల్ సమీపంలోని మైదానాన్ని వారు ఎంపిక చేశారు. ఈ మేరకు అక్కడి మైదానాన్ని చదును చేయించి, హెలిప్యాడ్ నిర్మాణ పనులను ముమ్మరం చేయించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్గల్ సభకు నియోజకవర్గంలోని తెలంగాణ అభిమానులు, ప్రజలు, భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గజ్వేల్‌లో చంద్రబాబు సభ గజ్వేల్ సంగాపూర్ రోడ్డు వైపున గల ప్రసన్నాన్నాంజనేయ ఆలయం పక్కనగల మైదానంలో సోమవారం ఉదయం 9.30గంటలకు నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సినీనటుడు పవన్‌కల్యాణ్, టీడీపీ నేత ఆర్. క్రిష్ణయ్య, మహాజన సోషలిస్టు పార్టీ అధినేత మంద కృష్ణ తదితరులు హాజరవుతున్నట్లు ఆ పార్టీ టీడీపీ అభ్యర్థి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. -
ప్రభుత్వాన్నే గజ్వేల్‌కు రప్పిస్తా
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ నియోజకవర్గం దశ మార్చి చూపుతానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఆయన గజ్వేల్‌లోని పిడిచెడ్ రోడ్డువైపున గల మైదానంలో ‘మెతుకు సీమ గర్జన’ పేరిట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు హాజరై ప్రసంగించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్వేల్ వాసులకు ఏ ఇబ్బంది ఉండదన్నారు. తాను ఇదే నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో పొలం దగ్గర వ్యవసాయం చేసుకుంటే... ప్రభుత్వమే ఈ ప్రాంతానికి దిగి వచ్చి ఏం కావాలో అది చేసి పెడుతుందన్నారు. ఈ ప్రాంతంలో కూరగాయలు విరివిగా సాగుతున్నందున ఇజ్రాయిల్ టెక్నాలజీతో చేపట్టనున్న ‘గ్రీన్ హౌస్ కల్టివేషన్’ కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుడతానన్నారు. ప్రతి గ్రామంలో 40-50 ఎకరాల్లో 80 శాతం సబ్సీడీపై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి రైతును లక్షాధికారిని చేస్తానన్నారు. సికింద్రాబాద్-మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేలైన్ పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా మిడ్‌మానేరు నీటిని సిద్దిపేట మీదుగా జిల్లాకు తీసుకువస్తానన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని బూర్గుపల్లి-తిప్పారం, వర్గల్ మండలం పాములపర్తి గ్రామాల్లో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి నియోజకవర్గంలోని 2.5లక్షల ఎకరాలకు మిడ్‌మానేరు ద్వారా సాగునీరందిస్తానని చెప్పారు. గజ్వేల్‌లో రోడ్లు ఏమాత్రం బాగాలేవని, పట్టణంలో ట్రాఫిక్ జామయితే ఈ కొసకోడు ఇటే...ఆ కొసకోడు అటే అన్నట్లు తయారైందన్నారు. ఈ దుస్థితిని మార్చడానికి పట్టణంలో రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు ‘మీ ఆశీస్సులు కోరి వచ్చినా...గెలిపించండి’ అంటూ కోరారు. ఇంకా ఈ సభలో టీఆర్ఎస్ శాససభాపక్ష నేత ఈటేల రాజేందర్, టీఆర్ఎస్ అగ్రనేత హరీష్‌రావు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్. సత్యనారాయణ, జిల్లా ఇన్చార్జి రాజయ్యయాదవ్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల అభ్యర్థులు పద్మా దేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు రమణాచారి, ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, నాయకులు ఎలక్షన్‌రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, తెలంగాణ బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్, నాయకులు గాడిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో పలువురి చేరిక గజ్వేల్‌రూరల్: గజ్వేల్‌లో శుక్రవారం రాత్రి టీఆర్ఎస్ అధ్వర్యంలో నిర్వహించిన ‘మెతుకుసీమ’ గర్జన ఎన్నికల ప్రచారసభలో పలువురు నేతలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీదళంలో చేరారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఏ హకీమ్, మాజీ కౌన్సిలర్ సుభాన్, గజ్వేల్‌కు చెందిన పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంలోనే పలువురు నేతలు కేసీఆర్‌కు జ్ఞాపికలను అందించారు. -
కేసీఆర్‌పై పోటీకి సై
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేసినా రెడీ అని అన్నారు. ఎవరు ఏమిటనేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనే తేలిపోతుందన్నారు. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కంటే అధిక స్థానాలు గెలిచి తీరుతామన్నారు. అలా రాని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని నర్సారెడ్డి శపథం చేశారు. మరోవైపు కేసీఆర్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బ్యాటు పట్టుకుని బరిలోకి దిగాక ఎటువంటి బంతినైనా బౌండరీ దాటిస్తానన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వలసవాదుల పాలన మాకొద్దని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్.. ఇప్పుడు అదే వలస వాదాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకి స్థానికులు దొరకలేదా? కేసీఆర్ పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడ వచ్చి స్థానికేతరునిగా ఎలా పోటీ చేస్తారని అన్నారు. స్థానిక వాదాన్ని ఒక అంశంగా తీసుకుని ఎన్నికలకు వెళ్తానని అన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాకు లీకుల మీద లీకులు ఇస్తున్నారని, ఇటువంటి లీకుల రాజకీయాలు మానేసి బరిలో నిలబడి కలబడాలని ఆయన టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు తెలుసని, టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే తాను తెలంగాణ కోసం కొట్లాడనని అన్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోనే టీఆర్ఎస్ బలం బయట పడుతుందన్నారు. కేసీఆర్‌ను తాను ఇప్పటి వరకు కలవలేదని, అప్పుడెప్పుడో నెల రోజుల కింద ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు గురించి మాట్లాడటానికి కలిశానని అన్నారు. -
కొలిక్కి వచ్చిన ‘మంజీర’!
గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన ‘మంజీర’ మంచినీటి పథకం టెండర్ల ప్రక్రియలో నెలకొన్న జాప్యానికి తెర పడనుంది. సాధారణ ఎన్నికల ‘కోడ్’ ముంచుకొస్తున్న వేళ.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి ఏడాదిన్నర క్రితం ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ (నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్) పథకం కింద రూ.40 కో ట్లు మంజూరుకాగా.. ఇందులో రెండు నెలల క్రితం రూ.10 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా రూ.30 కోట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో జాప్యం నెలకొనగా ఈ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసే దిశగా హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ చీఫ్(ఈఎన్సీ) వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ‘మంజీర’ పథకం పను లు పూర్తి చేయడానికి మంజూరైన నిధులతో తూప్రాన్, వర్గల్, ములుగు, గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లోని 129 గ్రామాల్లో పైప్‌లైన్ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. అంతేగాకుండా పలుచోట్ల ఓహెచ్‌బీఆర్ ట్యాంకుల నిర్మాణం జరగనుంది. కానీ కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం స్టేట్ టెక్నికల్ కమిటీ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉండగా ఈ ప్రక్రియలో నెలలతరబడి జాప్యం నెలకొంది. ఫలితంగా ప్రభుత్వం మంజూరుచేసిన రూ.40 కోట్లల్లో కేవలం రూ.10 కోట్లకు సంబంధించి మాత్రమే ఈ ప్రక్రియ పనులు సాగుతున్నాయి. మిగిలిన రూ.30కోట్ల వినియోగానికి కూడా ప్రభుత్వం ఆమోదం పలికింది. ఇందుకు సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లోని ఈఎన్సీ కార్యాలయ వర్గాలు టెండర్లను నిర్వహించినా సాంకేతిక లోపాల కారణంగా దీనిని నిలిపివేశారు. రీ-టెండర్ ప్రక్రియ వేగవతం ‘మంజీర’ పథకానికి సంబంధించి రీ-టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయడానికి అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నర్సారెడ్డి సైతం ఇందుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో రీ-టెండర్ పక్రియను చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువు కూడా పూర్తయ్యింది. మరో 15 రోజుల్లో టెండర్‌ను పూర్తిచేసి నిధులను వినియోగించే అవకాశం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి డిప్యూటీఈఈ మోహన్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ కొద్దిరోజుల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తయి నిధులు విడుదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. -
అసెంబ్లీ బరిలో కేసీఆర్?
* మెదక్ లోక్‌సభ, గజ్వేల్ శాసనసభ సీట్లపై గురి? సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. 2004 ఎన్నికల్లో కరీంనగర్, 2009లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసిన ఆయన ఈసారి మా త్రం శాసనసభకు పోటీ చేయడంపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో లోక్‌సభకూ పోటీ చేస్తారా అనే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. 2004 ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ, సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు. ఆ తర్వాత సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయగా, అక్కడ జరిగిన ఉపఎన్నికలో హరీష్‌రావు గెలుపొందిన విషయం తెలిసిందే. 2009లో మాత్రం మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు గెలిచారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ, కాంగ్రెస్‌తో అనుసరించాల్సిన వైఖరి వంటివాటిపై ఈ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాసనసభకు పోటీచేయాల్సి వస్తే మెదక్ జిల్లా గజ్వేల్ స్థానంపై కేసీఆర్ దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. లోక్‌సభా స్థానం కూడా మెదక్‌ను ఎంచుకునే అవకాశాలున్నాయి. కేసీఆర్ మేనల్లుడు టీ.హరీష్‌రావు (సిద్దిపేట), కుమారుడు కేటీఆర్ (సిరిసిల్ల) ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లో కొనసాగాలని గతంలో కేటీఆర్ భావించారు. గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల వీలు కాకపోవడంతో సిరిసిల్ల నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఇప్పుడు కేటీఆర్ లోక్‌సభకే వెళ్లాలని కోరుకుంటారా, లేక సిరిసిల్ల నుంచే అసెంబ్లీకే పోటీ చేస్తారా? అనేది తెలియదు. వాచ్‌డాగ్‌గానే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే కేసీఆర్ ప్రకటించారు. తెలం గాణపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత టీజేఎఫ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో కూడా దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అని పునరుద్ఘాటించారు. పునర్నిర్మాణంలో వాచ్‌డాగ్‌లా పనిచేస్తానని, తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఉంటానని స్పష్టంచేశారు. వీటిని బట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతాడనే చర్చకు, ఇతర అనుమానాలకు ఆస్కారమే లేదు. మరి శాసనసభకే పోటీ చేయాలనే యోచనలో అంతరార్థం ఏమిటనే దానిపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తా, విలీనమా? హోరాహోరీ పోరా అనే అంశాలపై కేసీఆర్‌కు కూడా స్పష్టతలేదు. యూపీఏ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కేంద్రంలో రాకుంటే అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? అందుకే అటు లోక్‌సభకు, ఇటు శాసనసభకూ గెలిచి ఉంటే ఎన్నికల అనంతర పరిస్థితులు, అప్పటి అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని అంటున్నారు. -
సాగు నీటి కోసం విలవిల
గజ్వేల్, న్యూస్‌లైన్: సాగునీటి కొరతతో గజ్వేల్ నియోజకవర్గం తల్లడిల్లుతోంది. దశాబ్దాలుగా ఈ దుస్థితి రైతాంగాన్ని కష్టాల్లోకి నెట్టేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సహజ వనరులను పూర్తిస్థారుులో సద్విని యోగం చేసుకోలేక.. సవుస్యను పరిష్కరించేందుకు కొత్త వూర్గాలపై ఆలోచన లేక భవిష్యత్తులో ముప్పు తలెత్తే పరిస్థితి నెలకొంది. సాగునీటి వనరుల విషయుంలో జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే గజ్వేల్ విపత్కర పరిస్థితుల్లో ఉంది. దశాబ్దాలుగా ఈ సవుస్యపై పాలకులు, అధికార యుంత్రాంగం నిర్లక్ష్యం వల్ల సహజ వనరుల వినియోగం సక్రవుంగా లేకపోగా కొత్త వూర్గాలపై ఆలోచనే కొరవడింది. గ్రామాల్లో వ్యవసాయానికి ఆయువుపట్టుగా ఉన్న చెరువుల నీటి నిల్వ సావుర్థ్యం తగ్గిపోవడం, చెరువుల్లో నీరు చేరేందుకు ఆధార మైన కాల్వలు గ్రావూల్లో శిథిలవువుతున్నా పట్టించుకునే నాథుడే కరువవడంతో ఎన్నో పెద్ద చెరువులు తవు పూర్వ వైభవాన్ని కోల్పోయూరుు. గజ్వేల్ వుండలం కొల్గూరు, తొగుట వుండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రావూల వుధ్య ఎన్నో ఏళ్ల కిందట ప్రతిపాదించిన హైలెవల్ ఫీడర్ ఛానల్ నిర్మాణం పెండింగ్‌లో ఉండటం రైతులకు నిరాశకు గురిచేస్తోంది. నియోజకవర్గానికి హల్దీ, కుడ్లేరు వాగులు ఇక్కడి వ్యవసాయానికి గుండెకాయగా వర్ధిల్లుతున్నారుు. కుడ్లేరు వాగు జగదేవ్‌పూర్ వుండలంలో ప్రారంభమై గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల మీదుగా కరీంగనర్‌లోని ఎగువ వూనేరులో కలుస్తోంది. గజ్వేల్‌లో ఈ వాగు 45కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తోంది. వర్షాకాలంలో నీటి ప్రవాహం కలిగివుండే ఈ వాగుపై అవసరవుున్నచోట్ల చెక్‌డ్యాంలను నిర్మించారు. సమద్ధిగా వర్షాలు కురిస్తే చెక్‌డ్యాంలు నిండి భూగర్భ జలవుట్టం పెరగడం ద్వారా రైతులకు కొంత ఊరటనిస్తున్నారుు. ఈ వాగుపై వురికొన్నిచోట్ల చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వురో ప్రధాన వాగు హల్దీ. ఈ వాగు వర్గల్ వుండలం తపాల్ఖాన్ చెరువులో ప్రారంభమై గజ్వేల్, వర్గల్, తూప్రాన్, రావూయుంపేట వుండలాల మీదుగా బొవ్మూరం నుంచి మెదక్‌లోని వుంజీర నదిలో కలుస్తోంది. మొత్తం ఈ వాగు 50 కి.మీ. పొడవునా నియోజకవర్గంలో ప్రవహిస్తోంది. ఈ వాగుపై సైతం అవసరవుున్నచోట్ల నిర్మించిన చెక్‌డ్యాంలు భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతున్నారుు. ఈ వాగుపై సైతం వురికొన్నిచోట్ల చెక్‌డ్యాంలు నిర్మించాల్సి ఉంది. నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రిజర్వాయుర్లు రాచకట్ట, బోరబండలపై నిర్లక్ష్యం అలువుుకుంది. కుడ్లేరు వాగుపై జగదేవ్‌పూర్ వుండలం రాయువరం-తీగుల్ గ్రావూల వుధ్య రూ.4 కోట్ల వ్యయుంతో 2005లో రాచకట్ట నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ జలాశయుంలోని కుడి, ఎడవు కాల్వల ద్వారా 1,560 ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యం గా నిర్ణరుుంచారు. కానీ కాల్వల నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ లక్ష్యం నెరవేరడం లేదు. అదేవిధంగా జగదేవ్‌పూర్ వుండలం ధర్మారం-వర్దరాజ్‌పూర్ గ్రావూ ల వుధ్య నిర్మించిన బోరబండ జలాశయుం ద్వారా 568 ఎకరాలకు ప్రత్యక్షంగా సాగునీటిని అందించాలని నిర్ణరుుం చారు. 1990లో ఈ ప్రాజెక్టు పూర్తరుునప్పటికీ ఇప్పటి వరకు కాల్వలు ప్రవాహానికి నోచుకోక శిథిలవుయ్యూరుు. ప్రాణహిత వస్తేనే కష్టాలు మాయం ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం పూర్తరుుతే ఈ ప్రాంతానికి వుహర్దశ వచ్చే అవకాశవుుంది. ప్రాణహిత నదిలో ప్రస్తుతం 305 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా అందులో 160 టీఎంసీలను తెలంగాణలోని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగుతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించడానికి పథకం సిద్ధం చేశారు. అయితే అందులో ప్రధానంగా లబ్ధి పొందేది మెదక్ జిల్లాయే. ప్రాణహిత నుంచి నీటిని శ్రీపాదసాగర్ ప్రాజెక్టులో వేసి అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా మేడారం, కాకతీయ కెనాల్ ద్వారా కరీంనగర్ జిల్లా మిడ్ మానేర్‌కు చేరవేస్తారు. ఆ తర్వాత అనంతగిరి మీదుగా సిద్దిపేట మండలం ఇమాంబాద్‌కు తీసుకు వస్తారు. ఇక్కడ రిజర్వాయర్ నిర్మించి నీటిని సిద్దిపేట నియోజకవర్గానికి అం దిస్తారు. అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా తడ్కపల్లిలో నిర్మించే రిజర్వాయర్‌కు, గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం తిప్పారం చెరువులోకి నీరు చేరవేస్తారు. ఇటు నుంచి లిప్ట్ ద్వారా వర్గల్ మండ లం పాములపర్తి చెరువులోనికి నీటిని తరలిస్తారు. ఈ చెరువులో పెద్ద రిజర్వాయర్ నిర్మించి నీటిని నిల్వచేస్తారు. పాములపర్తి ఎత్తయిన ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడి నుంచి చేబర్తి చెరువులోకి నీటిని వదిలి ఆ చెరువు నుంచి ప్రారంభమయ్యే వాగు ద్వారా జగదేవ్‌పూర్ మండలంలోని అన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. అలాగే గజ్వేల్, వర్గల్, ములుగు, తూప్రాన్ మండలాలకు కాల్వల ద్వారా నీటిని పంపించే విధంగా ఇంజినీర్లు పథకం రూపొం దించారు. పాములపర్తి చెరువు ద్వారా నియోజకవర్గంలో కాల్వల ద్వారా వ్యవసాయానికి నీరు అందిస్తారు. అంతేకాక చెరువు, కుంటలను నింపి రెండో పంటకు సైతం నీటిని అంది స్తారు. పథకం వర్తింపుపై అనుమానాలు...? ప్రాణహిత వస్తే....గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మారుతాయనుకుంటున్న తరుణంలో... హెచ్ఎండీఎ పరిధిలోని మండలాలకు ఈ పథకం వర్తించబోదనే ప్రచా రం ఇటీవల జోరుగా సాగుతోంది. ఈ ప్రచారం ఇక్కడి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ములుగు, వర్గల్, తూప్రాన్ మండలా లు హెచ్ఎండీఎ పరిధిలోని వెళ్తుండగా ఒక వేళ ఈ ప్రచారమే నిజమైతే ఆయా మండలాల రైతుల భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రాణహిత-చేవెళ్ల పథకం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కృష్ణను ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా తమకు విషయంలో ఇంకా ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
ప్రభుత్వ భూమి స్వాధీనంపై దుమారం
గజ్వేల్, న్యూస్‌లైన్ : గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని రాజిరెడ్డిపల్లిలోగల ప్రభుత్వ భూమి స్వాధీన ప్రక్రియ దుమారం రేపింది. స్వాధీనానికి అడ్డుతగులుతున్నారని రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు 15 మంది దళితులపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం, దీనిని తట్టుకోలేక ఓ మహిళా సొమ్మసిల్లి పడిపోవడం వివాదాస్పదమైంది. టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాజిరెడ్డిపల్లిలోని 155/1 సర్వే నంబర్లో ఏడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఫెన్సింగ్ వేసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ఈ భూమిని గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఉన్నామని, దీనిపై పట్టాలిచ్చి తమకు ఆదుకోవాలని గ్రామానికి చెందిన ఎస్సీ భూ బాధితులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వాధీన ప్రక్రియకు అడ్డుతగులుతున్నారని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయగా పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కాయిత యాదమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. సమాచారం తెలుసుకున్న టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఎస్సీల అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుండగా పట్టించుకోని రెవెన్యూ అధికారులు పేద దళితులు 30 ఏళ్లుగా సాగులో ఉన్న భూములను టార్గెట్‌గా చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. ప్రధాని చేతుల మీదుగా జిల్లాలో భూ పంపిణీ జరగ్గా ఈ పేదలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. దళితులకు ఇంత అన్యాయం జరుగుతుండగా స్థానిక ఎమ్మెల్యే నర్సారెడ్డికి పట్టదా? అంటూ విమర్శించారు. భేషరుతుగా దళితులపై కేసులను ఎత్తి వేయడమే కాకుండా ఆ భూమిపై పట్టాలిచ్చి హక్కులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మాజీ జెడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య, టీడీపీ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు ఉప్పల మెట్టయ్య, నాయకులు విరాసత్ అలీ, నయ్యర్ పఠాన్, మతిన్, బోస్, ఆర్కే శ్రీనివాస్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాధితులకు సీపీఐ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి కోట కిశోర్, సీఐటీయూ నాయకులు జంగం నాగరాజులు సంఘీభావం తెలిపారు.