సాగునీటి కొరతతో గజ్వేల్ నియోజకవర్గం తల్లడిల్లుతోంది. దశాబ్దాలుగా ఈ దుస్థితి రైతాంగాన్ని కష్టాల్లోకి నెట్టేస్తోంది.
గజ్వేల్, న్యూస్‌లైన్: సాగునీటి కొరతతో గజ్వేల్ నియోజకవర్గం తల్లడిల్లుతోంది. దశాబ్దాలుగా ఈ దుస్థితి రైతాంగాన్ని కష్టాల్లోకి నెట్టేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సహజ వనరులను పూర్తిస్థారుులో సద్విని యోగం చేసుకోలేక.. సవుస్యను పరిష్కరించేందుకు కొత్త వూర్గాలపై ఆలోచన లేక భవిష్యత్తులో ముప్పు తలెత్తే పరిస్థితి నెలకొంది. సాగునీటి వనరుల విషయుంలో జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే గజ్వేల్ విపత్కర పరిస్థితుల్లో ఉంది. దశాబ్దాలుగా ఈ సవుస్యపై పాలకులు, అధికార యుంత్రాంగం నిర్లక్ష్యం వల్ల సహజ వనరుల వినియోగం సక్రవుంగా లేకపోగా కొత్త వూర్గాలపై ఆలోచనే కొరవడింది.
గ్రామాల్లో వ్యవసాయానికి ఆయువుపట్టుగా ఉన్న చెరువుల నీటి నిల్వ సావుర్థ్యం తగ్గిపోవడం, చెరువుల్లో నీరు చేరేందుకు ఆధార మైన కాల్వలు గ్రావూల్లో శిథిలవువుతున్నా పట్టించుకునే నాథుడే కరువవడంతో ఎన్నో పెద్ద చెరువులు తవు పూర్వ వైభవాన్ని కోల్పోయూరుు. గజ్వేల్ వుండలం కొల్గూరు, తొగుట వుండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రావూల వుధ్య ఎన్నో ఏళ్ల కిందట ప్రతిపాదించిన హైలెవల్ ఫీడర్ ఛానల్ నిర్మాణం పెండింగ్‌లో ఉండటం రైతులకు నిరాశకు గురిచేస్తోంది. నియోజకవర్గానికి హల్దీ, కుడ్లేరు వాగులు ఇక్కడి వ్యవసాయానికి గుండెకాయగా వర్ధిల్లుతున్నారుు. కుడ్లేరు వాగు జగదేవ్‌పూర్ వుండలంలో ప్రారంభమై గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల మీదుగా కరీంగనర్‌లోని ఎగువ వూనేరులో కలుస్తోంది.
గజ్వేల్‌లో ఈ వాగు 45కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తోంది. వర్షాకాలంలో నీటి ప్రవాహం కలిగివుండే ఈ వాగుపై అవసరవుున్నచోట్ల చెక్‌డ్యాంలను నిర్మించారు. సమద్ధిగా వర్షాలు కురిస్తే చెక్‌డ్యాంలు నిండి భూగర్భ జలవుట్టం పెరగడం ద్వారా రైతులకు కొంత ఊరటనిస్తున్నారుు. ఈ వాగుపై వురికొన్నిచోట్ల చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వురో ప్రధాన వాగు హల్దీ. ఈ వాగు వర్గల్ వుండలం తపాల్‌ఖాన్ చెరువులో ప్రారంభమై గజ్వేల్, వర్గల్, తూప్రాన్, రావూయుంపేట వుండలాల మీదుగా బొవ్మూరం నుంచి మెదక్‌లోని వుంజీర నదిలో కలుస్తోంది. మొత్తం ఈ వాగు 50 కి.మీ. పొడవునా నియోజకవర్గంలో ప్రవహిస్తోంది. ఈ వాగుపై సైతం అవసరవుున్నచోట్ల నిర్మించిన చెక్‌డ్యాంలు భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతున్నారుు. ఈ వాగుపై సైతం వురికొన్నిచోట్ల చెక్‌డ్యాంలు నిర్మించాల్సి ఉంది.
నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రిజర్వాయుర్లు రాచకట్ట, బోరబండలపై నిర్లక్ష్యం అలువుుకుంది. కుడ్లేరు వాగుపై జగదేవ్‌పూర్ వుండలం రాయువరం-తీగుల్ గ్రావూల వుధ్య రూ.4 కోట్ల వ్యయుంతో 2005లో రాచకట్ట నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ జలాశయుంలోని కుడి, ఎడవు కాల్వల ద్వారా 1,560 ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యం గా నిర్ణరుుంచారు. కానీ కాల్వల నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ లక్ష్యం నెరవేరడం లేదు. అదేవిధంగా జగదేవ్‌పూర్ వుండలం ధర్మారం-వర్దరాజ్‌పూర్ గ్రావూ ల వుధ్య నిర్మించిన బోరబండ జలాశయుం ద్వారా 568 ఎకరాలకు ప్రత్యక్షంగా సాగునీటిని అందించాలని నిర్ణరుుం చారు. 1990లో ఈ ప్రాజెక్టు పూర్తరుునప్పటికీ ఇప్పటి వరకు కాల్వలు ప్రవాహానికి నోచుకోక శిథిలవుయ్యూరుు.
ప్రాణహిత వస్తేనే కష్టాలు మాయం
ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం పూర్తరుుతే ఈ ప్రాంతానికి వుహర్దశ వచ్చే అవకాశవుుంది. ప్రాణహిత నదిలో ప్రస్తుతం 305 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా అందులో 160 టీఎంసీలను తెలంగాణలోని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగుతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించడానికి పథకం సిద్ధం చేశారు. అయితే అందులో ప్రధానంగా లబ్ధి పొందేది మెదక్ జిల్లాయే. ప్రాణహిత నుంచి నీటిని శ్రీపాదసాగర్ ప్రాజెక్టులో వేసి అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా మేడారం, కాకతీయ కెనాల్ ద్వారా కరీంనగర్ జిల్లా మిడ్ మానేర్‌కు చేరవేస్తారు.
ఆ తర్వాత అనంతగిరి మీదుగా సిద్దిపేట మండలం ఇమాంబాద్‌కు తీసుకు వస్తారు. ఇక్కడ రిజర్వాయర్ నిర్మించి నీటిని సిద్దిపేట నియోజకవర్గానికి అం దిస్తారు. అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా తడ్కపల్లిలో నిర్మించే రిజర్వాయర్‌కు, గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం తిప్పారం చెరువులోకి నీరు చేరవేస్తారు. ఇటు నుంచి లిప్ట్ ద్వారా వర్గల్ మండ లం పాములపర్తి చెరువులోనికి నీటిని తరలిస్తారు. ఈ చెరువులో పెద్ద రిజర్వాయర్ నిర్మించి నీటిని నిల్వచేస్తారు. పాములపర్తి ఎత్తయిన ప్రాంతంలో ఉన్నందువల్ల ఇక్కడి నుంచి చేబర్తి చెరువులోకి నీటిని వదిలి ఆ చెరువు నుంచి ప్రారంభమయ్యే వాగు ద్వారా జగదేవ్‌పూర్ మండలంలోని అన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. అలాగే గజ్వేల్, వర్గల్, ములుగు, తూప్రాన్ మండలాలకు కాల్వల ద్వారా నీటిని పంపించే విధంగా ఇంజినీర్లు పథకం రూపొం దించారు. పాములపర్తి చెరువు ద్వారా నియోజకవర్గంలో కాల్వల ద్వారా వ్యవసాయానికి నీరు అందిస్తారు. అంతేకాక చెరువు, కుంటలను నింపి రెండో పంటకు సైతం నీటిని అంది స్తారు.
పథకం వర్తింపుపై అనుమానాలు...?
ప్రాణహిత వస్తే....గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మారుతాయనుకుంటున్న తరుణంలో... హెచ్‌ఎండీఎ పరిధిలోని మండలాలకు ఈ పథకం వర్తించబోదనే ప్రచా రం ఇటీవల జోరుగా సాగుతోంది. ఈ ప్రచారం ఇక్కడి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నియోజకవర్గంలో ఆరు మండలాల్లో ములుగు, వర్గల్, తూప్రాన్ మండలా లు హెచ్‌ఎండీఎ పరిధిలోని వెళ్తుండగా ఒక వేళ ఈ ప్రచారమే నిజమైతే ఆయా మండలాల రైతుల భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రాణహిత-చేవెళ్ల పథకం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కృష్ణను ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా తమకు విషయంలో ఇంకా ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.