
లక్ష ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు: కడియం
విద్యాశాఖతోపాటు ఇతర విభాగాల్లో ఉన్న సుమారు లక్షకుపైగా ఖాళీల భర్తీకి 2015-16 ఏడాదిలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు.
గజ్వేల్(మెదక్): విద్యాశాఖతోపాటు ఇతర విభాగాల్లో ఉన్న సుమారు లక్షకుపైగా ఖాళీల భర్తీకి 2015-16 ఏడాదిలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. బుధవారం ఆయన గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించారు. నగరపంచాయతీ పరిధిలో ఏర్పాటుచేయబోయే ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించి పరిశీలన జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గురుకుల విద్యావ్యవస్థను పటిష్టం చేసి, మరింత మెరుగైన ఫలితాలు సాధించనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డ్డి తదితరులు పాల్గొన్నారు.