వాగుపై బ్రిడ్జి నిర్మించకుండా వదిలేసిన దృశ్యం
బోనకల్ : రహదారి మార్గంలేక ఆళ్లపాడు, నారాయణపురం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులను వేడుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో 2012లో ఆళ్లపాడు నుంచి నారాయణపురం రహదారికి బీటీ రోడ్డు వేసేందుకు రూ.2.13కోట్ల నిధులను మంజూరు చేశారు. నాటి డిప్యూటీ æస్పీకర్ మల్లుభట్టి విక్రమార్క రోడ్డు పనులకు శంకుస్థాపన కూడా చేశారు. స్థానికులు మంచిరోజులు వచ్చినట్లే అనుకున్నారు. కానీ ఆ మంచిరోజులు ఎంతకీ రావడం లేదు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. రోడ్డుకు రెండు లేయర్ల కంకర, డస్ట్ మిశ్రమాన్ని వేసి రోలింగ్ చేసిన తరువాత బీటీ వేయాల్సి ఉంది.
అంతేకాకుండా ఈ మార్గంలో వాగుపై వంతెన కూడా నిర్మించాల్సి ఉంది. సదరు కాంట్రాక్టర్ రోడ్డుపై ఒక లేయరు కంకర పరచి వదిలేశాడు. వాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు పిల్లర్లు వేసి అసంపూర్తిగానే వదిలేశాడు. దీంతో నిత్యం ఈ రహదారిలో రాకపోకలు సాగిస్తున్న రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పశువులు వాగువద్ద వం తెన కోసం నిర్మించిన ఇనుపచువ్వలకు తగిలి గాయాలపాలవుతున్నాయి. రోడ్డు నిర్మాణపు పనులను అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్‌కు అ«ధికారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేసినా.. అధికారులు బిల్లులు ఇవ్వలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ప్రజాప్రతినిధులకు సమస్య వివరించినా... పట్టించుకోకపోవడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యేఅవకాశం ఉందని రోడ్డు పనులు ఇప్పట్లో అయ్యేపనికాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సగంసగం పనులతో ఇబ్బంది పడుతున్నాం...
అసంపూర్తి రోడ్డు నిర్మాణం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం పనులను మధ్యలో వదిలేసిండు. రెండు గ్రామాల రైతులు పంటలను ఇంటికి తెచ్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. అధికారులు పట్టించుకోవడంలేదు. పైఅ«ధికారులు స్పందించి రోడ్డు నిర్మాణపు పనులు పూర్తి చేయాలి.
– వేల్పుల ఆనందరావు, సర్పంచ్ ఆళ్లపాడు
అధికారులు చర్యలు తీసుకోవాలి...
రోడ్డులను వెంటనే పూర్తిఅయ్యేలా సంబంధిత అ«ధికారులు చర్యలు తీసుకోవాలి. కంకర తేలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో వాగు పొంగి ప్రమాదాలు జరిగిన సంఘ టనలు ఉన్నాయి. పోలీసు శాఖ సహకారంతో గ్రావెల్ పోయించాము. ముళ్లకంచెను తొలగించాము. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
– మరీదు బరకయ్య, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment