ఖమ్మం : ఖమ్మం జిల్లా కుక్కనూరు మండలం వెంకటాపురం గ్రామం, ములక లపల్లి మండలం తిమ్మెరపేట గ్రామానికి మధ్య ఉన్న రహదారికి గండిపడింది. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా రెండు గ్రామాల మధ్య రహదారి కోతకు గురవ్వడంతో 50 అడుగుల మేర రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.