ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం
ఎర్రుపాలెం, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. వరుస తుపానులతో రైతులు తీవ్రం గా నష్టపోయినా అధికార కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదని, కేవలం సీట్లు కాపాడుకునే ప్రయత్నంలోనే ఉన్నారని అన్నా రు. నష్టం అంచనాలు వేయడంలో విఫలమైం దని అన్నారు.
ప్రభుత్వ వైఖరిని ఖండించాల్సిన టీడీపీ కేవలం వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఇకనైనా జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం మానుకుని రైతుల గురించి పట్టించుకోవాలని అన్నారు. టీడీపీ, అధికార కాంగ్రెస్‌లను అనుకూలమైన దొంగ ఓట్లు ఉన్నాయని, వాటన్నింటిని వైఎస్సార్‌సీపీ శ్రేణులు గుర్తించి తొలగించాలని కోరారు. ఈ నెల 15 వరకు మండల, గ్రామ, బూత్‌స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా కమిటీని మరింత పటిష్టంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ దళిత విభా గం జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు, నియోజకవర్గ నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు లక్కిరెడ్డి నర్సిరెడ్డి పాల్గొన్నారు.