ఆ అవకాశం ఎప్పటికి వచ్చేనో?! | trisha not Opportunity rajinikanth movie | Sakshi
Sakshi News home page

ఆ అవకాశం ఎప్పటికి వచ్చేనో?!

Published Wed, Aug 24 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

ఆ అవకాశం ఎప్పటికి వచ్చేనో?!

ఆ అవకాశం ఎప్పటికి వచ్చేనో?!

 సౌత్‌లో స్టార్ హీరోలందరితోనూ త్రిష జోడీ కట్టారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో పాటు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్... తమిళంలో విజయ్, విక్రమ్, అజిత్, సూర్య, ఆర్య... మ్యాగ్జిమమ్ అందర్నీ కవర్ చేశారు. లోకనాయకుడు కమల్ హాసన్‌తో కలసి రెండు సినిమాలు ‘మన్మథ బాణం’, ‘చీకటిరాజ్యం’లలో నటించారు.
 
  కానీ, సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం మాత్రం త్రిషకు ఇప్పటివరకూ రాలేదు. అందుకు ఈ చెన్నై చందమామ బాధ పడుతున్నారట. రజనీతో కలసి నటించాలనే నా కోరిక ఎప్పటికి తీరుతుందో? రజనీ హీరోయిన్ అనే ట్యాగ్ ఎప్పుడు వస్తుందో? అని ఎదురు చూస్తున్నానని త్రిష తెలిపారు. ఇన్నేళ్లపాటు సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగడానికి ప్రతిభతో పాటు అదృష్టం కూడా కారణమన్నారు. ‘‘ఫ్యూచర్ ఎలా ఉండాలో ఎప్పుడూ డిసైడ్ చేసుకోలేదు. ఇప్పుడూ అంతే. ప్రతి రోజూ సంతోషంగా గడిపేయడమే నా పాలసీ’’ అని త్రిష చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement