
నూతన దర్శకులకు చాన్స్
ఈ ఏడాది ఇద్దరు నూతన దర్శకులకు అవకాశం కల్పించనున్నట్లు నటి, రాజకీయ నాయకురాలు కుష్భు వెల్లడించారు. ఈమె ఒక పక్క రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటునే మరోపక్క సినిమా, బుల్లితెర కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇంకో పక్క తన అల్కి సినీ మేకర్స్ పతాకంపై చిత్ర నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు గరి, రెండు, నగరం మరుపక్కం, కలగలప్పు చిత్రాలను నర్మించిన కుష్భు ఈ ఏడాది వేగాన్ని పెంచనున్నారు.
తన భర్త సుందర్ సి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని, నూతన దర్శకులతో మరో రెండు చిత్రాలను ఇదే ఏడాదిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల అరణ్మణై వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరపై ఆవిష్కరించిన సుందర్ సి తాజాగా దానికి కొనసాగింపును రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అర్ధాంగి కుష్భు నిర్మించనున్నట్లు సమాచారం. మరో రెండు చిత్రాల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు కుష్భు తనట్విట్టర్‌లో పేర్కొన్నారు.