New directors
-
వారి వల్లే స్టార్ అయ్యా: నాగార్జున
‘‘ఒకే రకమైన జానర్స్‌లో చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తే బోర్ కొడుతుంది. కొత్త దర్శకులైతే నా పాత్రలు కూడా కొత్తగా ఉంటాయి. నా నటన కూడా రొటీన్‌గా కాకుండా మారుతుందనే నమ్మకం ఉంది. అందుకే కొత్త డైరెక్టర్స్‌తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తాను. నేను ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అయ్యానంటే కేవలం కొత్త దర్శకులు, కొత్తదనం వల్లే’’ అని హీరో నాగార్జున అన్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగార్జున చెప్పిన విశేషాలు. ► వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి సినిమాలో కమర్షియల్ యాక్షన్‌కి వీలుండదు.. అందుకే ఒక కొత్త రకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఈ సినిమాలో పెట్టాం. నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం కావడంతో ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌కి పెద్దగా కష్టపడలేదు. అయితే మనాలీలో యాక్షన్ సీక్వెన్స్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. కానీ ఆ సీక్వెన్స్ ఆడియన్స్‌కి ఎగై్జటింగ్‌గా అనిపిస్తాయి. ► ఈ సినిమాలో ఏసీపీ విజయ్ వర్మగా నటించాను. ఒక మంచి భర్త, మంచి తండ్రితో పాటు మంచి ఎన్ఐఎ టీమ్ లీడర్‌గా కనిపిస్తాను. దేశంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే టెర్రరిస్ట్‌ను పట్టుకోవడమే విజయ్ వర్మ లక్ష్యం. ‘వైల్డ్ డాగ్’ కొత్త కమర్షియల్ ఫిల్మ్. ఈ సినిమా, నా పాత్ర అభిమానులందరికీ నచ్చుతుంది.. వారందరూ గర్వపడతారు. ► ట్రైలర్ చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా? అని ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అందుకే సినిమాకి ఎంత జాగ్రత్తలు తీసుకున్నామో.. ట్రైలర్‌కి కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నాం. ► నా ప్రతి సినిమాని బాగా ప్రమోట్ చేస్తాను. అయితే ‘వైల్డ్ డాగ్’కి మాత్రం ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో నేనొక్కడే అందరికీ తెలుసు. దర్శకుడుతో సహా అందరూ కొత్తవాళ్లే.. పైగా ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్. ► నేను ‘శివ’ సినిమా చేస్తున్నప్పుడు వయొలెన్స్ ఎక్కువగా ఉంది.. మహిళలకు నచ్చదేమో అనుకున్నారు. కానీ, ఆ సినిమాను మహిళలు కూడా బాగా ఆదరించారు. ‘వైల్డ్ డాగ్’ సినిమా కూడా కుటుంబ ప్రేక్షకులకూ చేరువవుతుందనే నమ్మకం ఉంది. ► ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాది పవర్ఫుల్ పాత్ర. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేను, నాగచైతన్య కలిసి చేయనున్న ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ రెడీగా ఉంది. నేను, అఖిల్ కలసి ఓ యాక్షన్ మూవీ చేయాలనుంది. నేను నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా కొత్త దర్శకుడితో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్‌తో సినిమా ఉంటుంది. -
ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్ల బోర్డులో మార్పులు
న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, ఫ్లిప్‌కార్ట్ తన డైరెక్టర్ల బోర్డ్‌ను పునర్వ్యస్థీకరించింది. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి, హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈఓ, కేకీ మిస్త్రీలకు డైరెక్టర్ల బోర్డ్‌లో స్థానం కల్పించింది. నలుగురిని డైరెక్టర్ల బోర్డ్ నుంచి తప్పించింది. త్వరలో ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానుండటంతో ఈ మార్పులు జరిగాయని సమాచారం. డైరెక్టర్ల బోర్డ్ పునర్వ్యస్థీకరణను ఫ్లిప్‌కార్ట్ ధ్రువీకరించింది. ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కృష్ణమూర్తి డైరెక్టర్ల మార్పులు, చేర్పుల వివరాలను వెల్లడించారు. నలుగురు డైరెక్టర్లు–రాజేశ్ మాగౌ, రోహిత్ భగత్, స్టూవార్ట్ వాల్టన్, డిర్క్‌వాన్ డెన్ బెరేలను డైరెక్టర్లుగా తొలగిస్తున్నామని పేర్కొన్నారు. వీరి స్థానంలో కళ్యాణ్ కృష్ణమూర్తి, కేకీ మిస్త్రీలతో పాటు వాల్‌మార్ట్ నుంచి సురేశ్ కుమార్, లే హాప్కిన్స్ను డైరెక్టర్లుగా నియమిస్తున్నట్లు వివరించారు. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను వాల్‌మార్ట్ కంపెనీ 1,600 కోట్ల డాలర్లకు 2018లో కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుకు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ సంస్థ 120 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
షార్ట్ కట్
-
నూతన దర్శకులకు చాన్స్
ఈ ఏడాది ఇద్దరు నూతన దర్శకులకు అవకాశం కల్పించనున్నట్లు నటి, రాజకీయ నాయకురాలు కుష్భు వెల్లడించారు. ఈమె ఒక పక్క రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటునే మరోపక్క సినిమా, బుల్లితెర కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇంకో పక్క తన అల్కి సినీ మేకర్స్ పతాకంపై చిత్ర నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు గరి, రెండు, నగరం మరుపక్కం, కలగలప్పు చిత్రాలను నర్మించిన కుష్భు ఈ ఏడాది వేగాన్ని పెంచనున్నారు. తన భర్త సుందర్ సి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని, నూతన దర్శకులతో మరో రెండు చిత్రాలను ఇదే ఏడాదిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల అరణ్మణై వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరపై ఆవిష్కరించిన సుందర్ సి తాజాగా దానికి కొనసాగింపును రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అర్ధాంగి కుష్భు నిర్మించనున్నట్లు సమాచారం. మరో రెండు చిత్రాల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు కుష్భు తనట్విట్టర్లో పేర్కొన్నారు. -
దమ్ముంటే రండి...
రేపు కొత్త సంవత్సరం వస్తోంది.దాంతోపాటు కొత్త డెరైక్టర్లూ రావాలి. వాళ్లు కొత్త ఆలోచనలతో వస్తే... కొత్త రకం సినిమాలు వస్తాయి.మీరు రాకపోతే...మేం తీసిందే చూడండి.రేప్పొద్దున మేం తీసిన సినిమాలు బాగోలేదంటే ఊరుకోం. దమ్ముంటే రండి.రేపు ఇక్కడే కలుద్దాం. -
ఈతరం దర్శకులు