రాజకీయ రంగప్రవేశంపై స్పీడ్‌ పెంచిన విజయ్‌ | Tamil Actor Vijay Political Entry Plan With Judicial | Sakshi
Sakshi News home page

Vijay: రాజకీయ రంగప్రవేశంపై స్పీడ్‌ పెంచిన విజయ్‌

Published Sun, Aug 6 2023 11:10 AM | Last Updated on Sun, Aug 6 2023 11:11 AM

Tamil Actor Vijay Political Entry Plan With Judicial - Sakshi

కోలీవుడ్‌ హీరో విజయ్‌ రాజకీయ రంగప్రవేశంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం ఆయన ఆలోచనలు, చేస్తున్న వ్యాఖ్యలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలే. విజయ్‌ తన అభిమాన సంఘం ద్వారా చాలాకాలంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇటీవల తమిళనాడులో జిల్లాకు ముగ్గురు చొప్పున 10వ తరగతి, ప్లస్‌టూలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు, విజయ్‌ తన పనైయూర్‌లోని కార్యాలయానికి పిలిపించి ధ్రువపత్రాలను ప్రోత్సాహంగా అవార్డులను అందించారు.

(ఇదీ చదవండి: రామ్‌ చరణ్‌,జూ.ఎన్టీఆర్‌.. ఉత్తమ హీరో ఎవరో తేలనుందా..?)

అదేవిధంగా విజయ్‌ తన అభిమాన సంఘాల ద్వారా నిరక్షరాస్యతను తొలగించే విధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాయంకాలం విద్యా తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పలువురు విద్యను నేర్చుకోవాలన్న ఆసక్తితో తరగతులకు హాజరవుతున్నారని సంఘం కార్యదర్శి బుస్సీ పేర్కొన్నారు. కాగా తాజాగ విజయ్‌ మక్కళ్‌ సంఘంకు చెందిన న్యాయవాద విభాగంతో ఆయన సమావేశం అయ్యారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 350 మందికి పైగా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

(ఇదీ చదవండి: ఆగ్రహంతో బన్నీ ఫ్యాన్స్‌.. మైత్రి మూవీస్‌పై ఫైర్‌.. నేడు ధర్నా చేసే ఛాన్స్‌)

ముఖ్యంగా రాష్ట్రంలోని జిల్లాకు ఒకటి చొప్పున ఉచిత న్యాయ సలహాల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలోనూ ఈ న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సంఘం కార్యదర్శి బుస్సీ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న విజయ్‌ చైన్నెకి తిరిగి రాగానే వచ్చేవారం మద్రాసు హైకోర్టు సమీపంలో విజయ్‌ సంఘ ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement