judicial branch
-
రాజకీయ రంగప్రవేశంపై స్పీడ్ పెంచిన విజయ్
కోలీవుడ్ హీరో విజయ్ రాజకీయ రంగప్రవేశంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం ఆయన ఆలోచనలు, చేస్తున్న వ్యాఖ్యలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలే. విజయ్ తన అభిమాన సంఘం ద్వారా చాలాకాలంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇటీవల తమిళనాడులో జిల్లాకు ముగ్గురు చొప్పున 10వ తరగతి, ప్లస్‌టూలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు, విజయ్ తన పనైయూర్‌లోని కార్యాలయానికి పిలిపించి ధ్రువపత్రాలను ప్రోత్సాహంగా అవార్డులను అందించారు. (ఇదీ చదవండి: రామ్ చరణ్,జూ.ఎన్టీఆర్.. ఉత్తమ హీరో ఎవరో తేలనుందా..?) అదేవిధంగా విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా నిరక్షరాస్యతను తొలగించే విధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాయంకాలం విద్యా తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పలువురు విద్యను నేర్చుకోవాలన్న ఆసక్తితో తరగతులకు హాజరవుతున్నారని సంఘం కార్యదర్శి బుస్సీ పేర్కొన్నారు. కాగా తాజాగ విజయ్ మక్కళ్ సంఘంకు చెందిన న్యాయవాద విభాగంతో ఆయన సమావేశం అయ్యారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 350 మందికి పైగా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. (ఇదీ చదవండి: ఆగ్రహంతో బన్నీ ఫ్యాన్స్.. మైత్రి మూవీస్‌పై ఫైర్.. నేడు ధర్నా చేసే ఛాన్స్) ముఖ్యంగా రాష్ట్రంలోని జిల్లాకు ఒకటి చొప్పున ఉచిత న్యాయ సలహాల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలోనూ ఈ న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సంఘం కార్యదర్శి బుస్సీ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న విజయ్ చైన్నెకి తిరిగి రాగానే వచ్చేవారం మద్రాసు హైకోర్టు సమీపంలో విజయ్ సంఘ ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. -
న్యాయశాఖలో ఉద్యోగాలకు రాత పరీక్షలు
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లా న్యాయశాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఆదివారం రాత పరీక్షలు నిర్వహించారు. న్యాయశాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంటు, ఫీల్డు అసిస్టెంటు, ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తులను సక్రమంగా పూరించిన 3,200 మందికి మాత్రమే అధికారులు హాల్‌టికెట్లు పంపిణీ చేశారు. జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగులు ఆదివారం చిత్తూరుకు చేరుకుని పరీక్షలు రాశారు. చిత్తూరులోని ఎన్పీ.సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నిర్వహించిన పరీక్షలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవిబాబు పర్యవేక్షించారు. న్యాయమూర్తులు, న్యాయశాఖ ఉద్యోగులు పరీక్షల విధులకు హాజరయ్యారు. కాగా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు.